విశాఖలోని పీఎం పాలెం బింద్రా నగర్ లో పార్కు స్థలం కబ్జా కలకలం రేపింది. పట్టపగలే మూడు కోట్ల విలువ చేసే పార్క్ స్థలాన్ని కేటుగాళ్లు కబ్జా చేశారు. జీవీఎంసీ కమిషనర్ సాయి కాంత్ వర్మ, జీవీఎంసీ సిటీ ప్లానర్ సురేష్ అండదండలతో రేచ్చిపోతున్నారు భూరాబందులు. బింద్రానగర్ షిప్ యార్డ్ లో వాలిన భూ రాబందులు, భూ బకాసురులకు జీవీఎంసీ జోన్ 2 టౌన్ ప్లానింగ్ విభాగం కొమ్ముకాస్తుంది. సీవీఆర్ న్యూస్‌ని ఘా పరిశోధనలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి.
Vishakapattanam
అల్లూరి జిల్లా చింతపల్లి లో సిపిఎం ప్రజా రక్షణ బేరి బస్సు యాత్ర లో భాగంగా చింతపల్లి కి నాలుగవ రోజు చేరుకున్న రాష్ట్ర సిపిఎం కార్యదర్శి కామ్రేడ్ వి శ్రీనివాసరావు ఈ సందర్భంగా చింతపల్లి పాత బస్టాండ్ వద్ద సిపిఎం జిల్లా కార్యదర్శి బోనంగి చిన్నప్పడాల్ ఆధ్వర్యంలో ఆశా వర్కర్స్ అంగన్వాడీ వర్కర్స్ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ వి శ్రీనివాసరావుకు హారతి ఇచ్చే ఆహ్వానించారు ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ వెనుకబడి ఉన్న అల్లూరి సీతారామ జిల్లా మోడీ ప్రభుత్వం జగన్ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థ ఆదానికి భూములు ముట్ట చెప్పడానికి చూస్తుందని అల్లూరి సీతారామ జిల్లాలో ప్రతి మారుమూల గ్రామం కూడా అభివృద్ధి చేయవలసింది పోయి వెనకబడిన ప్రాంతముగా చేయబోతున్నారని అలా జరిగితే మన్య ప్రజలందరూ ఒకటిగా కూడి అడ్డుకుంటామని ఆయన అన్నారు.
Read Also..
విశాఖ GVMC ప్రధాన కార్యాలయం ముందే భారీ అక్రమ నిర్మాణం జీవీఎంసీ కి కూత వేటు దూరంలోనే అక్రమ నిర్మాణం చోద్యం చూస్తున్న జీవీఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ సురేష్ కళ్ళుండి కబోది గా మారిన జీవీఎంసీ కమిషనర్ సాయి కాంత్ వర్మ నిత్యం రద్దీగా ఉండే అసిల్ మెట్ట రోడ్డులో భారీ అక్రమ నిర్మాణం కాసులకు కక్కుర్తిపడి అడ్డగోలుగా అనుమతులు గొయాజ్ లగ్జరీ సిల్వర్ జూయలరీ యాజమాన్యం బరితెగింపు. గోయాజ్ పేరుతో సిల్వర్ జూయలరీ భారీ అక్రమ భవనం ఫుట్‌పాత్ ను సైతం మింగేసిన గొయాజ్ జ్యూయలరీ కన్నింగ్ యాజమాన్యం ఇంత జరుగుతున్న చోద్యం చూస్తున్న జీవీఎంసీ కమీషనర్
నీటి పారుదల రంగంపై సదస్సు జరగడం శుభపరిణామం అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. విశాఖలోని రాడిసన్ బ్లూ హోటల్ సెంట్రల్ వాటర్ కమిషన్, ఏపీ జలవనరుల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఐసీఐడీ కాంగ్రెస్ ప్లీనరీని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సదస్సులో పాల్గొన్న దేశ, విదేశీ ప్రతినిధులకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు. ఏపీలో సాగునీటి రంగం, వ్యవసాయంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని సీఎం జగన్ అన్నారు. ఏపీకి విస్తారమైన తీర ప్రాంతం ఉంది. ప్రతి నీటిబొట్టును ఒడిసి పట్టుకోవడమే లక్ష్యం. రాయలసీమ, దక్షిణ కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో తరచూ కరవు వస్తోంది. వర్షం కురిసేది తక్కువ కాలమే.. ఆ నీటిని సంరక్షించుకుని వ్యవసాయానికి వాడుకోవాలి. సదస్సు నిర్వహణకు ఏపీకి అవకాశం ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నాం’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు.
ఫైబర్ నెట్ కేసులో ఏపీ సీఐడీ పోలీసులు వేగం పెంచారు. ఈ కేసులో కీలకంగా మారిన టెరాసాఫ్ట్ సంస్థ ఆస్తులను అటాచ్ చేసేందుకు నిర్ణయించారు. పోలీసుల నిర్ణయానికి రాష్ట్ర హోం శాఖ అంగీకరించడంతో కోర్టు అనుమతికి దరఖాస్తు చేసుకున్నారు. ఫైబర్ నెట్ టెండర్లను నిబంధనలకు విరుద్ధంగా టెరాసాఫ్ట్ సంస్థకు కట్టబెట్టినట్టు సీఐడీ కేసు దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీంతో, సంస్థకు చెందిన పలు స్థిరాస్తులను అటాచ్ చేయాలని సీఐడీ భావించింది. ఈ మేరకు చేసిన ప్రతిపాదనలకు హోం శాఖ ఆమోదం తెలిపింది. పోలీసులు అటాచ్ చేయదలిచిన ఆస్తుల్లో గుంటూరులోని ఓ ఇంటి స్థలం, విశాఖపట్నంలోకి ఓ ఫ్లాట్, హైదరాబాద్‌లో నాలుగు ప్లాట్లు, తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయ భూమి ఉంది. ఈ ఆస్తుల అటాచ్‌మెంట్‌కు అనుమతి కోసం సీఐడీ పోలీసులు విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.
ఆంద్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు విశాఖలోని రుషికొండ చుట్టూ తిరుగుతున్నాయి. జగన్ ప్రభుత్వం విశాఖని పరిపాలనా రాజధానిగా ప్రకటించినప్పటినుంచి రుషికొండ వివాదాలకొండగా మారిపోయింది. ప్రభుత్వం రుషికొండ చుట్టూ అక్రమ తవ్వకాలు చేపడుతుందని విపక్షాలు హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై అప్పట్లో విచారణ చేపట్టిన న్యాయస్థానం పరిశీలన కోసంఓ కమిటీని నియమించింది. ఆ కమిటీ రుషికొండపై జరుగుతున్న నిర్మాణాలపై ఓ నివేదిక ఇచ్చింది. అనుమతికి మించి నిర్మాణాలు ఉన్నాయని ఆ కమిటీ పేర్కొంది. అయితే, సీఎం జగన్ తాను విశాఖకు మకాం మార్చుతున్నానంటూ, ప్రభుత్వ భవనాల నిర్మాణం కోసం ప్రత్యేక కమిటీ వేశారు. రుషికొండపై నూతనంగా చేపట్టిన నిర్మాణం బాగుందంటూ ఈ కమిటీ నివేదిక ఇచ్చేందుకు సన్నద్ధమైంది. దాంతో, రుషికొండ ఉల్లంఘనలపై మొదట్లో పిటిషన్లు వేసిన వారు హైకోర్టులో మరో పిటిషన్ వేశారు. తాజాగా, రుషికొండ నిర్మాణాలపై మరోసారి విచారణ చేపట్టిన హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. తాము నియమించిన కమిటీ ఇచ్చిన నివేదికపై మరోసారి విచారణ చేపట్టాలని కేంద్ర అటవీ పర్యావరణ శాఖ కార్యదర్శిని ఆదేశించింది. రుషికొండపై ఉన్న నిర్మాణాలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. అంతేకాదు, దీనిపై మూడు వారాల్లో నివేదిక ఇవ్వాలని కేంద్ర అటవీ పర్యావరణ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంలో తదుపరి విచారణను నవంబరు 28కి వాయిదా వేసింది. రుషికొండపై 9.88 ఎకరాలకు అనుమతి ఇస్తే, 20 ఎకరాల్లో తవ్వకాలు చేపట్టారని అప్పట్లో పిటిషన్లు వేశారు. విచారణ సందర్భంగా అనుమతికి మించి 3 ఎకరాలు ఎక్కువ తవ్వకాలు చేపట్టినట్టు ప్రభుత్వం అంగీకరించింది. అయితే, అంతకంటే ఎక్కువే తవ్వకాలు చేపట్టారని పిటిషనర్ ఆరోపించడంతో, కేంద్ర ప్రభుత్వం సర్వే చేపట్టింది. ఇప్పుడు హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో, రుషికొండలో కేంద్రం మరోసారి సర్వే చేపట్టే అవకాశాలున్నాయి.
విశాఖపట్టణం పరిధిలో సింహాద్రి అప్పన్న భక్తులచే పిలవబడే లక్ష్మీనరసింహస్వామి కొలువైన దివ్యక్షేత్రం సింహాచలం. సింహగిరి కొండపై వెలసిన ఈ స్వామిని దర్శించుకోవడానికి నిత్యం వేలాదిగా భక్తులు తరలివస్తుంటారు. దక్షిణ భారత దేశంలో కొలువైన వైష్ణవ క్షేత్రాల్లో ప్రముఖమైనదిగా పేర్కొనబడుతోన్న ఈ ఆలయానికి తిరుమల తర్వాత అంతటి పేరుండడం గమనార్హం.
స్థల పురాణం
అలనాడు విష్ణు భక్తుడైన ప్రహ్లాదుడు సింహాచలంలోని నహసింహ స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించాడని ప్రతీతి. తన తండ్రి, రాక్షసుడైన హిరణ్యకశిపుడు విష్ణువును చూపించమంటూ స్థంభాన్ని పగులగొట్టిన సమయంలో అందులోంచి మహావిష్ణువు నరసింహుడి అవతారంలో ప్రత్యక్షమై హిరణ్యకశిపుడిని సంహరించాడన్న పురాణ కథ అందరికీ తెలిసిందే.ఇలా తనకోసం ప్రత్యక్షమైన నరసింహుడి అవతారాన్ని ప్రహ్లాదుడు మొదటగా సింహాచలంలో ప్రతిష్టించాడని పురాణాలు చెబుతున్నాయి. అయితే సింహాచలంలోని ఆలయాన్ని మాత్రం పురూరవుడనే రాజు నిర్మించినట్టు పురాణాలు చెబుతున్నాయి. పురూరవుడు సింహాచలం ప్రాంతాన్ని సందర్శించిన సందర్భంలో ఇక్కడ నేలలో కప్పబడిన నరసింహస్వామి విగ్రహం బయటపడింది. దాంతో ఆరాజు ఇక్కడ ఆలయాన్ని నిర్మించాడని అలాగే ఈ సందర్భంగా ఆకాశవాణి పలికిన పలుకుల మేరకు స్వామివారిని ఎల్లప్పుడూ చందనం పూతతోనే ఉంచే ఏర్పాటు చేశారు. అలా ఆనాడు మొదలైన ఆచారమే నేటికీ కొనసాగుతోంది. స్వామివారిని ఏడాదిలో 12 రోజులు తప్ప మిగిలిన రోజులంతా చందనం పూతతోనే దర్శించాల్సి ఉంటుంది.
క్షేత్ర విశేషాలు
సింహాచలంలో ఉండే స్వామివారి గాలిగోపురంకు ఓ ప్రత్యేకత ఉంది. అన్ని దేవాలయాల్లో ఉన్నట్టు తూర్పు ముఖంగా కాకుండా సింహాచలంలోని గాలిగోపురం పడమర ముఖంగా ఉంటుంది. అలాగే ఇక్కడ గర్భగుడికి ఎదురుగా ఉండే ద్వజస్థంభాన్ని కప్ప స్థంభం అని వ్యవహరిస్తారు. గతంలో ఇక్కడే కప్పం అనబడే పన్నులు చెల్లించేవారని అందుకే కాలగమనంలో ఈ స్థంభానికి కప్ప స్థంభం అనే పేరు వచ్చిందని చెబుతుంటారు.సింహాచలం కొండపై అక్కడక్కడా జలధారలు ప్రవహిస్తుంటాయి. భక్తులు వీటిలో స్నానం చేసి స్వామివారిని దర్శిస్తారు. వీటిలో గంగధార, ఆకాశధార, చక్రధార, మాధవధార అనేవి ముఖ్యమైనవి.
విశాఖలో స్పెన్సర్స్ సూపర్ మార్కెట్ బరితెగించింది. ఎలాంటి అనుమతులు లేకుండా కమర్షియల్ షాపులు ఓపెన్ చేస్తున్నారు. అడ్డగోలుగా భారీ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా.. జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు వారిని పట్టించుకోవడంలేదు. అనుమతులు లేకుండా కోట్ల రూపాయల కమర్షియల్ వ్యాపారం చేపడ్తుండటంతో.. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతుంది.
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో ఉదయం తెల్లవారుజామున నుండి దట్టమైన పొగ మంచు కురుస్తుంది. దీంతో వాహన చోధకులు పొగ మంచులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు పొగ మంచుతో చింతపల్లిలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. దట్టమైన పొగ మంచుల ఆనందించాలంటే టూరిస్టులకు చింతపల్లి లంబసింగి కొత్తపల్లి జలపాతాలు. వంజరి మంచు సోయగాలు, చెరువులు, తాజ్ంగి డ్యాం పర్యాటలకు అనుకూలమైన ప్రదేశలుగా ఉన్నాయి. టూరిస్టులు ఎవరైనా ఈ ప్రాంతాలకు వచ్చి అందమైన వాతావరణాన్ని అనుభవించవచ్చని చింతపల్లి యూత్ అంటున్నారు.
విశాఖలో కరెన్సీ కట్టలు కలకంరేపాయి. రూ.1.30 కోట్లు హవాలా డబ్బు గుట్టురట్టు అయ్యింది. ఎన్ఏడీ జంక్షన్లో హవాలా మనీ సంచలనంగా మారింది. వాషింగ్ మిషన్‌లో భారీగా కరెన్సీ నోట్ల కట్టలు బయటపడ్డాయి. విజయవాడకు ఆటోలో తరలిస్తుండగా పట్టుకున్నారు. భారీగా కరెన్సీ కట్టలతో పాటుగా ఏకంగా 30 మొబైల్స్‌ను కూడా సీజ్ చేశారు ఎయిర్ పోర్ట్ జోన్ పోలీసులు. అలాగే వాహానాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ కరెన్సీ కట్టలు సోనోవిజన్ సంస్థకు చెందిందిగా తెలుస్తోంది. ఏపీలో 35 బ్రాంచీలకు చెందిన 1.30 కోట్ల నగదును విజయవాడకు తరలిస్తూ అడ్డంగా బక్కైంది సోనోవిజన్ జమాన్యం..ప్రభుత్వానికి కట్టవలసిన టాక్సులు ఎగ్గొట్టి దొడ్డి దారిలో.. బ్లాక్ మనీ దారి మల్లిస్తున్న సోనోవిజన్ MD మూర్తి య 30 సెల్ఫోన్లు, వాహనం స్వాధీనం చేసుకున్నారు ఎయిర్ పోర్ట్ జోన్ పోలీసులు సక్రమమైన డబ్బైతే వాషింగ్ మెషీన్, ఫ్రిజ్ లలో..,. నోట్ల కట్టలు ఎందుకు తరలిస్తున్నారని పోలీసులు విచారిస్తున్నారు. సోనోవిజన్ md. మూర్తి కేసును తారుమారు చేసేందుకు పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది.



Total views : 61510