Vishakapattanam
విశాఖజిల్లా పరదేశిపాలెం దారుణం చోటుచేసుకుంది అత్తింటి వేదిపులతో రోడ్డున పడ్డ కోడలు. విశాఖ పోలీస్ కమీషనర్ కు పిర్యాదు చేసిన దొడ్డి హేమలత బర్తచనిపోడంతో తనను వేదిస్తువ్నారంటూ కోడలు అవేదన పీయంపాలె పోలీసుల తీరుపై
మండి పడుతున్న హేమలత. CVR NEWS ను ఆశ్రయించిన
బాదిత మహిళ. తనను చంపేస్తారంటూ బయపడుతున్న హేమలత. న్యాయం జరిగేలా చూస్తాం అని CVR NEWS భరోసా…
ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణకు ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. ఈ నెల 6న శృంగవరపుకోటలో జరిగిన వైసీపీ బస్సు యాత్రలో మంత్రి పాల్గొన్నారు. ఈ యాత్రలోనే మంత్రి అస్వస్థతకు గురయ్యారు. దీంతో హుటాహుటిన మంత్రి బొత్సను విశాఖపట్నంలోని ఆసుపత్రికి తరలించారు. ఆయనను పరీక్షించిన వైద్యులు.. గుండెలో మూడు చోట్ల పూడికలు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఆపరేషన్ చేయాలని సూచించడంతో కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్ కు తరలించారు. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మంత్రి బొత్స సత్యనారాయణను చేర్పించగా.. శనివారం వైద్యులు ఆయనకు ఆపరేషన్ చేశారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకు ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో ఈ సర్జరీ జరిగింది. ఆపరేషన్ విజయవంతంగా పూర్తయిందని, బొత్స సత్యనారాయణ ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు చెప్పారు. నెల రోజుల వరకు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు మంత్రి బొత్స కుటుంబ సభ్యులు తెలిపారు.
అల్లూరి జిల్లా కొయ్యురు హత్య కేసులో నిందితుడుని కొయ్యూరు పోలీసులు అరెస్ట్ చేశారు. తేదీ 10.11.2023న తన కుమార్తె అయిన లక్ష్మీని తన అల్లుడు అయిన కొర్ర సత్తిబాబు కొట్టి చంపినట్లు కొయ్యూరు పోలీస్ స్టేషన్ కు డౌనురు కు చెందిన కిల్లో సీత అనే మహిళ రిపోర్టు మేరకు కొయ్యూరు పోలీసులు హత్య నేరం కింద కేసు నమోదు చేసినారు. దీని మీద దర్యాప్తు చేసిన కొయ్యూరు సీఐ గారు A.స్వామి నాయుడు తన సిబ్బందితో కలిసి నేర స్థలాన్ని సందర్శించి మృతురాలు దేహానికి శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తము నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ కి తరలించినారు. సదరు మృతురాలు లక్ష్మీని హత్య చేసి పరారైన నిందితుడు అయిన కొర్ర సత్తిబాబు, S/o కృష్ణ, వయస్సు 28 సం, కులం ST- కోందు, పాలమామిడి గ్రామం, ములపేట పంచాయతీ, కోయ్యురు మండలము. ఈరోజు అనగా తేదీ 11.11.2023న అరెస్టు చేసారు. నిందితున్ని రిమాండ్ నిమిత్తము కోర్టుకు తరలించారు.
Read Also..
విశాఖ నగర పరిధిలోని మధురవాడలో మద్యం లారీ బోల్తా పడింది. ఆనందపురం నుంచి విశాఖ నగరంవైపు వెళ్తున్న మద్యం లారీ మధురవాడ వద్దకు రాగానే బోల్తా పడింది. ఎదురుగా వెళ్తున్న మరో వాహనాన్ని ఓవర్టేక్ చేసే క్రమంలో లారీ డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీలో ఉన్న మద్యం సీసాలన్నీ రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. ఇది గమనించిన స్థానికులు, పలువురు వాహనదారులు ఒక్కసారిగా ఎగబడ్డారు. ఎవరికి నచ్చినట్లు వారు మద్యం బాటిళ్లను తీసుకెళ్లారు. ఘటన జరిగిన సమయంలో అక్కడే అందుబాటులో ఉన్న ట్రాఫిక్ పోలీసులు వెంటనే స్పందించారు. జనం గుమిగూడకుండా చర్యలు తీసుకున్నారు. వెంటనే మధురవాడ పోలీసులకు సమాచారం అందించారు. ప్రమాదంలో లారీ డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి.
హెటేరో నుండి వెలువడే విష రసాయనిక వ్యర్థ జలాలను సముద్రంలో పంపడానికి వేసే పైపు లైన్ ను పోలీసుల సహకారంతో వేయడం అమానుషం అని అనిత అన్నారు.కోర్టులో కేసులు వున్న పట్టించుకోకుండా, ప్రజల ప్రాణాలను లెక్కచేయకుండా పైపులైన్ వేయడం ఎంతవరకు న్యాయం అని మీడియా పరంగా ప్రశ్నించారు. మత్యకారులు గ్రామంలో ఎటువంటి గొడవలు జరగకుండా సుమారు 200 మంది పోలీసులను దించి ప్రతి గ్రామంలో చుట్టిముట్టి పైపు లైన్ వేస్తున్నారని అనిత మండి పడ్డారు.
విశాఖ ఉక్కు ప్రైవేటేకరణకు వ్యతిరేకంగా నెల్లూరులో విద్యార్థి సంఘాల ఆందోళన..!
విశాఖ ఉక్కు ప్రైవేటేకరణకు వ్యతిరేకంగా నెల్లూరులో విద్యార్థి సంఘాలు ఆందోళన చేశాయి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమం వెయ్యి రోజులకు చేరుకున్నసందర్భంగా నెల్లూరు ఆర్టీసీ కూడలి వద్ద విద్యార్థి సంఘాలు ఆందోళన నిర్వహించాయి. సీఎం జగన్మోహన్ రెడ్డి, ప్రధాని మోదీతో చేతులు కలిపి.. రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థలను అధాని కి దారా దత్తం చేస్తున్నారని విద్యార్థి సంఘాల నేతలు విమర్శించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపాలని, కడప ఉక్కును స్థాపించాలని ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ నేతలు డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేసి చిన్న బజార్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతర పోరాటం చేస్తామని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు లోకనాథం హెచ్చరించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆ పార్టీ చేపట్టిన బస్సు యాత్ర మంగళవారం రాత్రి పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం చేరుకుంది .ఈ సందర్భంగా స్టీమర్ రోడ్ లో ప్రజా రక్షణ బేరీ పేరుతో నిర్వహించిన సభలో లోకనాథం మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి విధానాలకు తలొగ్గి జగన్ పాలన చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఎన్నికలలో ఉద్యోగ కార్మికులకు ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీలన్నీ నీటి మాటలగానే మిగిలాయని, నాలుగున్నర ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదంటూ. ఉన్న పరిశ్రమలే రాష్టం నుంచి తరలిపోతున్నాయని, దీనివల్ల నిరుద్యోగులకు ఉపాధి లేకుండా పోయిందని లోకనాథం జగన్ పాలనపై ఫైర్ అయ్యారు. ఈ సభలో రాష్ట్ర కమిటీ సభ్యులు మంతెన సీతారా జిల్లా కార్యదర్శి బలరాoలు పాల్గొన్నారు.
ఏపీ హైకోర్టులో కోడికత్తి కేసు విచారణ జరిగింది. ఈ కేసులో నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావు బెయిల్ కోరుతూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని ఎన్ఐఏను ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 6కు వాయిదా వేసింది. దీంతో ఏపీ హైకోర్టు శ్రీనివాసరావు బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఎన్ఐఏ ఈ కేసుకు సంబంధించి కౌంటర్ దాఖలు చేశారు. దీంతో తదుపరి విచారణను హైకోర్టు ఈనెల 15కు వాయిదా వేసింది. ఈ కేసులో నిందితుడు శ్రీనివాసరావు తరఫున న్యాయవాది సలీం వాదనలు వినిపిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు శ్రీనివాసరావుకు బెయిల్ రాలేదు. కోడికత్తి ఘటన జరిగినప్పటి నుంచి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులోనే ఉన్నాడు. దీంతో కుటుంబ సభ్యులు సైతం శ్రీనివాసరావుకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతున్నారు. ఈ మేరకు సీజేఐకు సైతం లేఖ రాసిన సంగతి తెలిసిందే.
విశాఖ నగరంలో గోయాబ్ యాజమాన్యం అక్రమ కట్టడం..స్థానిక ప్రజలకు చుక్కలు చూపిస్తోంది. ఆశీలుమెట్లలో అక్రమంగా గోయాజ్ సిల్వర్ జ్యూయలరీ పేరుతో షోరూం నిర్మించింది గోయాజ్ యాజమాన్యం..అయితే ఫుట్ పాత్ ను సైతం ఆక్రమించేస్తూ నిర్మాణం చేపట్టడంతో..విశాఖ జీవీఎంసీ కార్యాలయం ముందు
భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఈ నిర్మాణానికి అడ్డగోలుగా అనుమతులు ఇచ్చిన జీవీఎంసీ చీఫ్, సిటీ ప్లానర్ సురేష్ పై స్థానికులు మండిపడ్తున్నారు. అటు ఇంత జరుగుతున్న చోద్యం చూస్తున్న జీవీఎంసీ కమిషనర్ సాయి కాంత్ వర్మపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.





Total views : 62120