Monday, June 1, 2026
News Navigation
Monday, June 1, 2026
News Navigation

Breaking

Monday, June 1, 2026
Home Andhra Pradesh టెక్స్ టైల్స్ గార్మెంట్ పాలసీలకు ఏపీ క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్

టెక్స్ టైల్స్ గార్మెంట్ పాలసీలకు ఏపీ క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్

by Rama
టెక్స్ టైల్స్ గార్మెంట్ పాలసీలకు ఏపీ క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్

సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశం ముగిసింది. పలు రంగాల్లో ప్రభుత్వ విధానాలకు ఈ సమావేశంలో ఆమోదం తెలిపారు. ఏపీ మారిటైమ్ పాలసీ, టెక్స్ టైల్స్ గార్మెంట్ పాలసీ, ఐటీ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ పాలసీ లకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు మంత్రి పార్ధసారధి తెలిపారు. పులివెందుల, ఉద్ధానం, డోన్ తాగునీటి ప్రాజెక్టులను క్యాబినెట్ ఆమోదించింది. హోమియోపతి, ఆయుర్వేద ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ చట్ట సవరణకు కూడా సమావేశంలో ఆమోదం లభించింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గిరిజన గృహ పథకం అమలు, ఇంటిగ్రేటెడ్ టూరిజం పాలసీ, క్రీడా విధానంలో మార్పులకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బియ్యం అక్రమ రవాణా ప్రభుత్వానికి సవాల్ గా మారిందని, దీనికి అడ్డుకట్ట వేస్తామన్నారు. ఆస్తులు గుంజుకోవడం వైసీపీ హయాంలో ట్రెండ్ గా మారిందని ఆరోపించారు. ఇక, కేంద్ర ప్రభుత్వ పథకం జల్ జీవన్ మిషన్ పథకం రాష్ట్రంలో అమలు చేయడంలో ఆలస్యం జరుగుతుండడం పట్ల క్యాబినెట్ అసంతృప్తి వ్యక్తం చేసిందని మంత్రి పార్థసారధి తెలిపారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • తెలంగాణ లో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే -మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు.
    కరీంనగర్ గడ్డ బిజెపి అడ్డాగా బండి సంజయ్ నిలబెట్టారని, ఇటీవల జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బిజెపి విజయం సాధించడంలో బండి సంజయ్ పట్టుదల, కరీంనగర్ బిజెపి శ్రేణుల కసి తోనే బల్దియా పై కాషాయ జెండా ఎగిరిందనీ, ఇలాంటి ఫలితం…
  • హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గంలో అడుగుపడిన ‘రుద్రమ’ బ్రాండ్.
    గ్రామీణ మహిళల ఆర్థిక ఆత్మగౌరవానికి పరకాల నియోజకవర్గం సరికొత్త వేదికైంది. మహిళలను వ్యాపారవేత్తలుగా మార్చేందుకు, వారి ఆర్థిక సాధికారతే లక్ష్యంగా దామెర మండలం ల్యాదేళ్ల గ్రామంలో సరికొత్త అధ్యాయం మొదలైంది. మహిళా శక్తి వారోత్సవాల్లో భాగంగా ఇక్కడ ‘పరకాల స్కిల్ డెవలప్‌మెంట్…
  • అప్పులు కావు,మీ వ్యాపారాలకు పెట్టుబడులు.
    ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ద్వారా అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ అన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సభ్యులకు ప్రభుత్వ సహకారంతో బ్యాంకుల ద్వారా మంజూరైన 2…
  • ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు బంపర్ ఆఫర్ .
    కార్పొరేట్ పాఠశాలలకు మేమేం తక్కువ కాదంటూ ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులు సత్తా చాటారు. పదో తరగతి ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఘన సత్కారం లభించింది. సికింద్రాబాద్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో టాప్‌గా నిలిచిన 100 మంది…
  • అత్యంత ప్రతిష్ఠాత్మకం ఏపీలో యోగాంధ్ర-2026.
    ఏపీలో యోగాంధ్ర-2026ను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. జూన్‌ 7 నుంచి 14 రోజులు రాష్ట్రవ్యాప్త కార్యక్రమాలు ప్రణాళిక ప్రకారం చేపట్టాలని సూచించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ నిర్వహణపై ఉండవల్లి నివాసంలో మంత్రులు, అధికారులతో సమీక్షించారు.యోగాంధ్ర కార్యక్రమాల వివరాలను…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

019254
Total views : 90159

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.