Sunday, May 17, 2026
News Navigation
Sunday, May 17, 2026
News Navigation

Breaking

Sunday, May 17, 2026
Home Andhra Pradesh ఏపీ కొత్త మ్యాప్ విడుదల…

ఏపీ కొత్త మ్యాప్ విడుదల…

by CVR NEWS

ఏపీ రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ రాష్ట్ర సరికొత్త మ్యాప్‌ను అధికారికంగా విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ. గతంలో ఉన్న 26 జిల్లాలకు అదనంగా మార్కాపురం, పోలవరం ప్రాంతాలను కొత్త జిల్లాలుగా గుర్తిస్తూ మొత్తం 28 జిల్లాలతో కూడిన మ్యాప్‌ను రూపొందించింది. పరిపాలన సౌలభ్యం, ప్రజలకు పాలనను మరింత చేరువ చేయడం, అభివృద్ధి వికేంద్రీకరణే లక్ష్యంగా ప్రభుత్వం ఈ మార్పులు చేసింది. ముఖ్యంగా రాజధాని విషయంలో కొంతకాలంగా నెలకొన్న సందిగ్ధతకు తెరదించుతూ, అధికారిక మ్యాప్‌లో అమరావతిని రాజధానిగా స్పష్టంగా పేర్కొన్నారు. రాజధాని అమరావతిని కేంద్ర బిందువుగా చూపిస్తూ రూపొందించిన ఈ మ్యాప్, రాష్ట్ర భౌగోళిక సరిహద్దుల్లో వచ్చిన మార్పులను స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ కొత్త జిల్లాల ఏర్పాటుతో ఆయా ప్రాంతాల్లో పాలన మరింత వేగవంతం కానుంది.

Advertisements

You may also like

Our Visitor

014083
Total views : 78929

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.