Tuesday, September 29, 2026
News Navigation
Tuesday, September 29, 2026
News Navigation

Breaking

Tuesday, September 29, 2026
Home Andhra Pradesh కృష్ణా జిల్లా ఆత్కూరులో నూతన పీహెచ్‌సీ ప్రారంభించిన వెంకయ్య నాయుడు.

కృష్ణా జిల్లా ఆత్కూరులో నూతన పీహెచ్‌సీ ప్రారంభించిన వెంకయ్య నాయుడు.

by CVR NEWS
కృష్ణా జిల్లా ఆత్కూరులో నూతన పీహెచ్‌సీ ప్రారంభించిన వెంకయ్య నాయుడు

కృష్ణా జిల్లా ఆత్కూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రారంభించారు. అనంతరం కేంద్రాన్ని పరిశీలించి వైద్య సిబ్బందితో మాట్లాడారు. దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమర్థవంతమైన పాలన అందిస్తున్నారని వెంకయ్య నాయుడు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తూ ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.ప్రజలకు అవసరమైన రహదారులు, ప్రాథమిక పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, నిరంతర విద్యుత్ సరఫరా వంటి మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వాలు దృష్టి సారించాలని సూచించారు. ఉచిత పథకాల కంటే మౌలిక వసతుల అభివృద్ధికే అధిక ప్రాధాన్యం ఇవ్వాలని అభిప్రాయపడ్డారు.ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఖాళీగా ఉన్న 800 అధ్యాపక పోస్టుల భర్తీకి చర్యలు తీసుకున్న మంత్రి నారా లోకేష్‌కు ధన్యవాదాలు తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజల ఆరోగ్య అవసరాలను తీర్చడంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తాయని, ఆత్కూరు పీహెచ్‌సీ ద్వారా పరిసర గ్రామాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: