Thursday, July 9, 2026
News Navigation
Thursday, July 9, 2026
News Navigation

Breaking

Thursday, July 9, 2026
Home Andhra Pradesh విశాఖ: సముద్రంలో చిక్కుకున్న ఏడుగురు మత్స్యకారులు.

విశాఖ: సముద్రంలో చిక్కుకున్న ఏడుగురు మత్స్యకారులు.

by CVR NEWS
విశాఖ: సముద్రంలో చిక్కుకున్న ఏడుగురు మత్స్యకారులు

విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు సముద్రంలో చిక్కుకుపోయినట్లు సమాచారం అందడంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ నెల ఒకటో తేదీన విశాఖ నుంచి చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులైన అప్పలరాజు, బండియ్య, గరగయ్య, సీతుడు, చిన్న అమ్మోరు, కారి చిన్న, చిన్నయ్యల ఆచూకీ ఇప్పటివరకు లభించలేదు.మత్స్యకారుల మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్‌లో ఉండటంతో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించగా, మత్స్యకారుల కోసం ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టారు. నేవీ, మెరైన్ పోలీసులు, కోస్ట్‌గార్డ్ బృందాలు సముద్రంలో విస్తృతంగా గాలిస్తున్నాయి.గల్లంతైన వారిలో ఆరుగురు భోగాపురం ముక్కాంకు చెందినవారు కాగా, మరొకరు భీమిలి ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. మత్స్యకారుల ఆచూకీ కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

038960
Total views : 193634

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: