Tuesday, July 21, 2026
News Navigation
Tuesday, July 21, 2026
News Navigation

Breaking

Tuesday, July 21, 2026
Home Andhra Pradesh డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సీవీఆర్ కథనాలకు స్పందన.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సీవీఆర్ కథనాలకు స్పందన.

by CVR NEWS
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సీవీఆర్ కథనాలకు స్పందన

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రైతుల ఇబ్బందులపై సీవీఆర్ న్యూస్ చానెల్ ప్రసారం చేసిన ప్రత్యేక కథనాలపై విశేష స్పందన లభిస్తోంది. తక్షణమే మంత్రులు స్పందించారు. మంత్రులు రామనాయుడు, వాసంశెట్టి సుభాష్, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కొత్తపేట నియోజకవర్గంలో పర్యటించారు. ఆత్రేయపురం మండలం లొల్ల–వాడపల్లి కొత్త వంతెన సమీపంలో నీటమునిగిన వరి పొలాలను పరిశీలించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నీట మునిగిన పంటల నష్టాన్ని రైతులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే సంబంధిత శాఖ అధికారులను అక్కడికే పిలిపించి ..మురుగునీరు బయటకు వెళ్లేలా అత్యవసర చర్యలు చేపట్టాలని మంత్రి నిమ్మల ఆదేశించారు.పొలాల్లో నిల్వ ఉన్న నీటిని త్వరితగతిన తొలగించి రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని మంత్రి నిమ్మల రామనాయుడు సూచించారు. సమస్య శాశ్వత పరిష్కారానికి అవసరమైన చర్యలపై నివేదిక సిద్ధం చేసి సమర్పించాలని అధికారులకు చెప్పారు. రైతుల పంటలను కాపాడేందుకు ప్రభుత్వం అవసరమైన సహకారం అందిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

042041
Total views : 221448

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: