జిల్లాలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో సాగునీటి నిర్వహణను పర్యవేక్షించేందుకు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు బైక్‌పై ప్రయాణించారు. ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి కొత్తపేట, పి.గన్నవరం, అమలాపురం, ముమ్మిడివరం నియోజకవర్గాల్లోని గోదావరి సెంట్రల్ డెల్టా కాలువల వెంబడి ఆయన పర్యటన సాగింది. ఈ సందర్భంగా లాకుల నీటిమట్టాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కొత్తపేట నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావుతో కలిసి నల్ల లాకులను తనిఖీ చేశారు. 70 ఏళ్ల చరిత్రలో జులై నెలలో గోదావరి నదికి ఇంత తక్కువ ఇన్‌ఫ్లో రావడం ఇదే మొదటిసారని ఈ సందర్భంగా మంత్రి నిమ్మల పేర్కొన్నారు. 70 శాతం కాలువలు, 30 శాతం వర్షాలపై ఆధారపడి డిజైన్ చేసిన డెల్టాలో ప్రస్తుత పరిస్థితుల వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పారు. కాకినాడ రూరల్, అమలాపురం, ముమ్మిడివరం శివారు ప్రాంతాల్లో ఉన్న నీటి ఎద్దడిని అధిగమించేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.
గోదావరి డెల్టాలో నీటి సంరక్షణే లక్ష్యం- మంత్రి నిమ్మల.
45




Total views : 221094