Friday, September 18, 2026
News Navigation
Friday, September 18, 2026
News Navigation

Breaking

Friday, September 18, 2026
Home Latest News ముదిగొండలో రహదారి విస్తరణ పనులపై ఉద్రిక్తత.

ముదిగొండలో రహదారి విస్తరణ పనులపై ఉద్రిక్తత.

by CVR NEWS

ఖమ్మం జిల్లా ముదిగొండ మండల కేంద్రంలో రహదారి విస్తరణ పనులు ఉద్రిక్తతకు దారితీశాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సొంత నియోజకవర్గమైన మధిర పరిధిలోని ముదిగొండ కూడలి వద్ద అధికారులు పనులు ప్రారంభించగా, స్థలాలు, దుకాణాలు కోల్పోతున్నామంటూ స్థానికులు, వ్యాపారులు తీవ్ర నిరసన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి పనులను అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు గ్రామాభివృద్ధి కోసం రహదారి విస్తరణ అవసరమని మరో వర్గం మద్దతు తెలపడంతో పరిస్థితి మరింత వేడెక్కింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసు బలగాలను మోహరించిన అధికారులు, బాధితులతో చర్చలు జరిపి నిర్వాసితులందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళన విరమించగా, పోలీసుల బందోబస్తు మధ్య రహదారి విస్తరణ పనులు తిరిగి ప్రారంభమయ్యాయి.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: