జనసేన పార్టీలో పొకల మల్లికార్జున్ చేరికతో తిరుపతి జనసేనలో కొత్త ఉత్సాహం వచ్చింది. ఈ సాయంత్రం తిరుపతిలోని జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలవాలను వేసి నివాళులు అర్పించి అక్కడి నుంచి నాలుగు కాళ్ల మండపం వరకు పోకల మల్లికార్జున్ తన అనుచరులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతిలో జనసేన అభ్యర్థి ఆరని శ్రీనివాసులు కు మద్దతు ఇచ్చి అత్యధిక మెజారిటీతో జనసేన అభ్యర్థిని గెలిపించుకోవాలని అలాగే తిరుపతిని జనసేన కంచుకోటగా మార్చు కోవాలని పిలుపునిచ్చారు. ఈ ఐదు సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, జనసేన బిజెపి టిడిపి కూటమి లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ను స్వర్ణ ఆంధ్ర ప్రదేశ్ గా మార్చే సత్తా చంద్రబాబు నాయుడుకి ఉందని కావున కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలని జనసేన నాయకులు పోకల మల్లికార్జున్ పిలుపునిచ్చారు.
Prakash
ఆ ఉమ్మడి జిల్లా ఏది …ఆ హార్ట్ సీట్ గా మారిన పార్లమెంటు స్థానం ఏది…
లోక్ సభ ఎన్నికలు వేళ ఆ ఉమ్మడి జిల్లాలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఉమ్మడి జిల్లాలో ఉన్న ఓ పార్లమెంట్ సెగ్మెంట్ నుండి హ్యాట్రిక్ కొట్టిన బి ఆర్ యెస్ మరో విజయం సాధించాలని భావిస్తుంటే, రాష్ట్రంలో అధికారం సాధించి దూకుడు మీదున్న కాంగ్రెస్ ఈ సారి విజయం మాదే అంటూ ప్రచారం చేస్తున్నారు. కేంద్రంలో మరోసారి బిజెపి పార్టీ అధికారంలోకి రావాలంటే ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో నన్ను గెలిపియ్యాలంటూ బిజెపి అభ్యర్థి కోరుతున్నారు. మూడు ప్రధాన పార్టీలు ఎలాగైనా తమ పట్టును నిలుపుకునేందుకు అస్త్రాలు సిద్దం చేసుకుంటున్నాయి. ఇంతకు ఆ ఉమ్మడి జిల్లా ఏది… ఆ హార్ట్ సీట్ గా మారిన పార్లమెంటు స్థానం ఏదో ఇప్పుడు చూద్దాం.
పాలమూరు జిల్లా (Palamuru District) : ఉమ్మడి జిల్లాలో రెండు పార్లమెంట్ సెగ్మెంట్లు…
ఉమ్మడి పాలమూరు జిల్లా (Palamuru District) కాంగ్రెస్ పార్టీకి కంచుకోట గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో 14 నియోజకవర్గాలకు గాను 12 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఉమ్మడి జిల్లాలో రెండు పార్లమెంట్ సెగ్మెంట్లు ఉన్నాయి. అవి మహబూబ్ నగర్ మరియు నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానాలు.. అయితే మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ అన్ని రాజకీయ పార్టీలకు హాట్ సీట్ గా మారింది. దేశ రాష్ట్ర రాజకీయాల మార్పుకు తగ్గట్లు ఇక్కడి పార్లమెంట్ సెగ్మెంట్ లోని ప్రజలు తీర్పు ఉంటుందన్న సెంటిమెంట్ తో అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావించి గెలుపు కోసం ప్రయత్నిస్తున్నాయి. టిఆర్ఎస్, బిజెపి, కాంగ్రేస్ ల నడుమే ప్రధాన పోటి ఉంటుండగా… ఎవరికి వారే గెలుపు పై ధీమాతో ఉన్నారు.
ఇక్కడి నుంచి గెలిచిన వారికి హస్తినాలో..
ఇక్కడ గెలిచిన వారు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతుండటం…. ఇక్కడి నుంచి గెలిచిన వారికి హస్తినాలో మంచి పలుకుబడి దక్కుతుండటంతో పాలమూరు (Palamuru District) బరిలో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. మహబూబ్ నగర్ పార్లమెంటు సెగ్మెంట్ లో ఏడు అసెంబ్లీ నియోజక వర్గాలున్నాయి. షాద్ నగర్, మక్తల్, కొడంగల్, మహబూబ్ నగర్, నారాయణపేట, జడ్చర్ల, దేవరకద్ర, నియోజక వర్గాలు ఈ పార్లమెంటు పరిధిలో ఉన్నాయి.ఈ పార్లమెంట్ సెగ్మెంట్ లో 16 లక్షల 75 వేల మంది ఓటర్లున్నారు. ఇక్కడి నుంచి గెలుపొంది పార్లమెంటులో అడుగుపెట్టిన వారంతా జాతీయ రాజకీయాల్లో పేరు ప్రఖ్యాతలు గడించిన వారే కావడం గమనించ దగ్గ విషయం.
ఉప ఎన్నికలతో కలిపి 17 సార్లు ఎన్నికలు…
1957 నుంచి ఇప్పటి వరకు జరిగిన ఉప ఎన్నికలతో కలిపి 17 సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో ఏడు సార్లు కాంగ్రెస్ పొందింది. ఈ పార్లమెంట్ నుండి నాలుగు సార్లు మల్లికార్జున్ గౌడ్ విజయం సాధించారు. చివరి సారిగా 2004లో కాంగ్రెస్ జెండా ఎగురవేసింది. మళ్లీ 20 ఏండ్ల తర్వాత తిరిగి పాలమూరు పార్లమెంట్ ను కైవసం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. జే రామేశ్వర్ రావు, మూడు పర్యాయాలు మరియు జైపాల్ రెడ్డి, జితేందర్ రెడ్డిలు రెండు పర్యాయాలు ఇక్కడి నుంచి గెలుపొంది పార్లమెంటులో అడుగు పెట్టగా…. 2009 లో కేసీఆర్ ఇక్కడి నుంచి గెలుపొంది తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించారు.
అధిష్టానం బరిలో సిట్టింగ్ ఎంపి మన్నె శ్రీనివాస్ రెడ్డి…
ఈ సారి ఎన్నికల్లో టిఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపి మన్నె శ్రీనివాస్ రెడ్డి ని అధిష్టానం బరిలో నిలపగా… బిజెపి నుంచి డికే అరుణ పోటీలో ఉన్నారు. ఇక కాంగ్రేస్ పార్టి నుంచి కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఏఐసిసి సెక్రటరీ చల్లా వంశీచంద్ రెడ్డి బరిలో వున్నారు… గత ఎన్నికల్లో పోటీ చేసిన నేతలే మరోసారి పోటీ పడుతున్నారు.ఇదిలా ఉంటే పాలమూరు (Palamuru District) సెంటిమెంట్ పై అన్ని రాజకీయ పార్టీలు కూడా ద్రుష్టి పెట్టాయి.ఇక్కడి నుంచి ఎంపిగా గెలిచిన వారందరు కేంద్రంలో చక్రం తిప్పిన వారే.స్థానిక ఎంపిగానే కేసీఆర్ రాష్ట సాధన ఆ తర్వాత రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయ్యారు. ఇక మాజీ ఎంపి అయిన జితేందర్ రెడ్డి కూడా లోక్ సభలో టీఆర్ ఎస్ పక్షనా ప్రతిపక్ష నేతగా గతంలో వ్యవహరించారు.
జాతీయ రాజకీయాల్లో కీ రోల్ పోషించిన వారు…
గతంలో ఎంపీలుగా గెలిచిన జైపాల్ రెడ్డి, మల్లిఖార్జున్ లు కేంద్ర మంత్రులుగా పనిచేసి జాతీయ రాజకీయాల్లో కీ రోల్ పోషించిన వారు కావడంతో, ఇక్కడ గెలిస్తే జాతీయ స్థాయిలో ఫోకస్ లభిస్తుందని గట్టిగా నమ్ముతున్నారు. బరిలో నిలుస్తున్న నేతలు. అందుకే ప్రతిష్టాత్మకంగా భావించి గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ బరిలో నిలిచిన ప్రధాన పార్టీలు ఎవరికి వారే గెలుపుపై లెక్కలు వేసుకుంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.ఈ పార్లమెంట్ పరిధిలోని ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు నియోజక వర్గాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్దులే గెలుపొందారు. వీరందరికి కలిపి 1,00,439 మెజార్టి ఉంది. అందుకే సునాయాసంగా గెలుపొందుతామనే ధీమాతో కాంగ్రెస్ పార్టీ ఉంది.
100 రోజుల్లో ఇచ్చిన హామీలను అమలు చేశామంటూ ప్రచారం…
మొన్నటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ పార్టీకి 6,11514, బీఆర్ఎస్ పార్టీకి 5,11 017, బిజెపి పార్టీకి 1,12,000 ఓట్లు నమోదు అయ్యాయి. దీంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు గెలుపే లక్ష్యంగా పని చేస్తున్నారు. సిఎం రేవంత్ రెడ్డి సొంత పార్లమెంట్ నియోజకవర్గం కావడంతో సవాల్ గా తీసుకున్న కాంగ్రెస్ నేతలు ప్రచారని విస్తృతంగా చేస్తున్నారు. కేవలం 100 రోజుల్లో ఇచ్చిన హామీలను అమలు చేశామంటూ ప్రచారం కొనసాగిస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎంపి కి టికెట్ ఇచ్చి రంగంలోకి దిగింది. కానీ సిట్టింగ్ ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి ఇప్పటి వరకు ఎన్నికల ప్రచారంలో యాక్టివ్ లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ మూడు లక్షలకు పైగా మెజార్టితో గెలిపించుకుంటామని, పాలమూరు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఈ సారి టిఆర్ఎస్ పార్టి అభ్యర్ది గెలుపొందితే అది ఆ పార్టికి నాలుగోసారి వరుసగా గెలుపొందినట్లుగా రికార్డు వుంటుంది.
బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ పై కాంగ్రెస్ ఆశలు…
2009, 2014, 2019 ఇప్పుడు ఎలాగైనా సిట్టింగ్ స్థానాని కైవసం చేసుకోవాలని ప్రయత్నం చేసిన ఎంపీగా మన్నే శ్రీనివాస్ రెడ్డి ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు సైతం పార్లమెంట్ లో ఎవరు ప్రచారం చేయకపోవడం బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ పై కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన కీలక నేతలు అంత ఇప్పటికే కాంగ్రెస్ గూటికి చేరారు. 2019 మే నెలలో జరిగిన 17వ లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన మన్నె శ్రీనివాస్ రెడ్డి మహబూబ్‌నగర్ ఎంపీగా విజయం సాధించారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి డి.కె అరుణపై 56,404 ఓట్ల మెజారిటీతో శ్రీనివాస్ రెడ్డి గెలుపొందారని తెలిసిందే.
బరిలో బిజెపి నుంచి మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ డికే అరుణ…
ఇక బిజెపి నుంచి మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్న డికే అరుణ బరిలో నిలుస్తున్నారు. గత ఎన్నికల్లో చివర్లో టికెట్ దక్కించుకొని గట్టి పోటీ ఇచ్చిన డీకే అరుణ ఈసారి ఎలాగైనా గెలువాలని కసరత్తు చేస్తోంది. ఇక్కడ ఎంపీగా గెలుస్తే కచ్చితంగా కేంద్రంలో మంచి పదవీ వస్తుందని, గెలుపే లక్ష్యం గా పని చేస్తోంది… మొన్నటి వరకు బిజెపి టికెట్ వస్తుందని ఆశించిన మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి బిజెపి పార్టీకి రాజీనామా చేయడంతో పార్లమెంట్ ఎన్నికల్లో డీకే అరుణనే కీలకపాత్ర పోషిస్తుంది… బిజెపి శ్రేణులు కూడా కొత్త జోష్ తో ఈ ఎన్నికలకు పోతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రేస్ పార్టిలో ఉన్నప్పుడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పరిచయాలు, తనతో పాటు కమలం గూటికి చేరిన అనుచరవర్గంతో పాటు హర్డ్ కోర్ బిజెపి క్యాడర్ కలిసొస్తుందని భావిస్తున్నారు.
అయోధ్యలో రామాలయ నిర్మాణం తమకు కలిసివస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు…
గతంలో ఎంపి గా పోటి చేసిన అనుభవం, బిజెపి అధిష్టానం కూడా ఈ సీట్ ను ప్రతిష్టాత్మకంగా భావిస్తుండటం గెలుపు పై అంచనాలు పెంచుతున్నట్లు చెప్పవచ్చు. 1999 ఎన్నికల్లోనే ఈ స్థానాన్ని తన ఖాతాలో వేసుకున్న బీజేపీ, 2019 ఎన్నికల్లో 3 లక్షలకు పైచిలుకు ఓట్లతో రెండోస్థానంలో నిలిచింది. ఈసారి మోడీ ఇమేజ్‌కు తోడు అయోధ్యలో రామాలయ నిర్మాణం తమకు కలిసివస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం పార్లమెంట్ ఎన్నికల్లో వుంటుందని కచ్చితంగా 7 అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు వున్నారు. దీంతో గత ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందిన వంశీచంద్ రెడ్డి అభ్యర్దిత్వాన్ని మరోసారి పార్టీ ఖరారు చేసిన హస్తం పార్టి అధిష్టానం.
పాలమూరు జిల్లా (Palamuru District)లో సాంప్రదాయ ఓటు బ్యాంకు…
కాంగ్రెస్ కంచుకోట గా పేరున్న పాలమూరు జిల్లా (Palamuru District) లో సాంప్రదాయ ఓటు బ్యాంకు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వుండటంతో ఈ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలే వస్తాయనే భావనతో కాంగ్రేస్ శ్రేణులు ముందుకు పోతున్నాయి. ఇటీవల ఆయా నియోజకవర్గాలలో వుండే ఇతర పార్టీలకు చెందిన కీలక నేతలంతా కాంగ్రెస్ పార్టీల్లో చేరుతుండటం కొంత వరకు గెలుపు పై ధీమా గా వుంది. హాట్ సీట్ గా మారిన పాలమూరు బరిలో ఎవరు విజేతగా నిలుస్తారో వేచి చూడాలి. ఓటరు తీర్పు ఎవరిని హస్తినకు పంపుతుందో , ఎవరిని ఇంటికి పరిమితం చేస్తుందా అని అంతా ఆసక్తిగా చూస్తున్నారు.
ఇది చదవండి : డీ మార్ట్ ఫుడ్ ప్రొడక్ట్స్ లో చచ్చిన ఎలుక కలకలం..
- ఆయుష్ విద్యార్థులకు తెలంగాణ సర్కార్ తీపికబురు.
తెలంగాణలో ఆయుష్ వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఆయుర్వేద, హోమియోపతి, యునాని, నాచురోపతి విభాగాల్లోని హౌస్ సర్జన్లు, పీజీ విద్యార్థుల స్టైఫండ్లను అల్లోపతి వైద్య విద్యార్థులతో సమానంగా పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో… - తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం.
తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, ఈ విజయాన్ని ఏ శక్తీ ఆపలేదని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే బీజేపీ అధిష్ఠానం దృష్టి పూర్తిగా తెలంగాణపైనే… - తెలంగాణ రైజింగ్ సమ్మిట్‌కు ఫిలిప్పీన్స్ కార్యదర్శికి ఆహ్వానం.
తెలంగాణను ప్రపంచ పెట్టుబడులు, వ్యవసాయ వాణిజ్యం, పారిశ్రామిక అవకాశాలకు ప్రధాన గమ్యస్థానంగా నిలిపే లక్ష్యంతో 2026 డిసెంబర్లో హైదరాబాద్‌లో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ సమ్మిట్‌కు హాజరుకావాలని ఫిలిప్పీన్స్ వ్యవసాయ శాఖ కార్యదర్శి ఫ్రాన్సిస్కో పి.టియు లారెల్ జూనియర్‌ను మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆహ్వానించారు.…
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: ఆ ఉమ్మడి జిల్లాలో రసవత్తరంగా మారిన రాజకీయం…
ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో భారీ ఎన్కౌంటర్.. 40 మంది మావోయిస్టుల మృతి..!
ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) దండకారణ్యంలో భారీ ఎన్కౌంటర్.. 40 మంది మావోయిస్టుల మృతి ! పక్కా సమాచారంతో కూంబింగ్…
ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) లోని బస్తర్ అడవుల్లో రక్తం ఏరులై పారింది…
పార్లమెంట్ ఎన్నికల వేళ ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) లోని బస్తర్ అడవుల్లో రక్తం ఏరులై పారింది. పచ్చని అడవులు ఎర్రని రక్తంతో ఎరుపెక్కాయి. బస్తర్ రీజియన్‌లోని కాంకేర్ జిల్లాలో మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య జరిగిన భారీ ఎన్కౌంటర్లో దాదాపు 40 మంది మావోయిస్టులు మరణించినట్లు సమాచారం.! ఇప్పటి వరకూ 29 మంది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇక భద్రతా దళాలకు చెందిన ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. మృతుల్లో ఇప్పటివరకు ముగ్గురిని గుర్తించారు. వారిలో ఇద్దరు తెలంగాణకు చెందిన వారిగా పోలీసులు చెబుతున్నారు. మృతుల్లో మరికొందరు తెలంగాణ వాసులు ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రాష్ట్రంలో అతిపెద్ద ఎన్ కౌంటర్…
కాగా మరో రెండు రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు ప్రారంభం కానుండగా ఆ రాష్ట్రంలో అతిపెద్ద ఎన్ కౌంటర్ చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఈ ఏడాదిలో 4 నెలల వ్యవధిలో వేర్వేరు ఎన్కౌంటర్లలో 79 మంది మావోలు మృతి చెందారు. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు బీఎస్ఎఫ్, డీఆర్ బలగాలు- మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 40 మంది మావోయిస్టులు మృతి చెంది ఉంటారని బస్తర్ ఐజీ పి సుందర్రాజ్, ఎస్పీ కళ్యాణ్ ఎలిసెల్లి రాత్రి వేర్వేరు ప్రకటనల్లో వెల్లడించారు. మృతుల్లో మావోయిస్టు అగ్రనేత, దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ సుగులూరి చిన్నన్న అలియాస్ విజయ్, అలియాస్ శంకర్ రావు ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు.
ఆయుధ సామగ్రిని స్వాధీనం చేసుకున్న పోలీసులు…
ఏపీలోని కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం వడ్ల రామపురం గ్రామానికి చెందిన ఆయనపై రూ. 25 లక్షల రివార్డు ఉంది. ఎన్ కౌంటర్ ఘటనాస్థలి నుంచి భారీ యెత్తున మారణాయుధాలు పట్టుబడ్డాయి. ఏకే – 47 లు, ఎస్ఎల్ఆర్, ఇన్సాస్ రైఫిళ్లు, కార్బైన్, 303 రైపిల్స్ వంటి ఇతర ఆయుధ సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. ఈ ఘటనలో బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ సహా ఇద్దరు జవాన్లకు కూడా గాయాలయ్యాయి. దండకారణ్యం స్పెషల్ జోన్ స్టేట్ మిలటరీ కమిషన్ ఇన్చార్జి రాంధర్ అలియాస్ మజ్జిదేవ్ కూడా మరణించినట్లు సమాచారం. గత పదిహేనేళ్లలో బస్తర్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లలో ఇదే అతి పెద్దదిగా పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
మాడ్ ప్రాంతంలో మావోయిస్టు నేతలు సమావేశం…
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మాడ్ ప్రాంతంలో మావోయిస్టు నేతలు సమావేశం అయ్యారన్న సమాచారంతో పోలీసు బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ సమావేశానికి సీపీఐ (మావోయిస్టు) బస్తర్ డివిజన్ నేతలు శంకర్, లలిత, రాజు తదితరులు హాజరవుతున్నట్లు తెలిసింది. దీంతో బీఎస్ఎఫ్, జిల్లా రిజర్వు గార్డు (డీఆర్టీ), రాష్ట్ర పోలీసులు, ఇతర భద్రతా దళాలు సంయుక్తంగా చోటేబేథియా పోలీస్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో యాంటీ మావోయిస్టు ఆపరేషన్ చేపట్టారు. ఈ ఎన్కౌంటర్ మృతుల్లో దండకారణ్యం అగ్రనేత మజ్జిదేవ్, ఆయన భార్య లలిత ఉన్నట్లు తెలుస్తోంది.
ఇది చదవండి : ఎమ్మెల్సీ కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా..!
- మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్.
రైల్వే వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల్లోని రద్దీ మార్గాలతో పాటు దేశవ్యాప్తంగా పలు మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ వివరాలను కేంద్ర రైల్వే శాఖ… - ఢిల్లీ పీడబ్ల్యూడీ ఇంజనీరింగ్ కేడర్‌కు కేంద్రం ఆమోదం.
పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ పరిధిలోని మంజూరైన ఇంజనీరింగ్ పోస్టులను సీపీడబ్ల్యూడీ కేడర్ నుంచి వేరు చేసే ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇకపై ఈ పోస్టులను స్వతంత్ర ఢిల్లీ పీడబ్ల్యూడీ ఇంజనీరింగ్ కేడర్‌గా నిర్వహించనున్నారు. ఢిల్లీని వేగంగా అభివృద్ధి చెందుతున్న,… - తమిళనాడు అసెంబ్లీలో సీఎం సైగపై వివాదం.
తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ చేసిన ఓ సైగ తీవ్ర రాజకీయ దుమారం రేపింది. మాజీ సీఎం ఎం.కె. స్టాలిన్‌ను ఉద్దేశించి విజయ్ మాట్లాడుతున్న సమయంలో తన కుడి అరచేతిని దవడకు ఆనించి చేసిన సైగపై డీఎంకే తీవ్ర అభ్యంతరం వ్యక్తం…
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో భారీ ఎన్కౌంటర్.. 40 మంది మావోయిస్టుల మృతి..!
కాలం చెల్లిన సిద్ధాంతాల కోసం ప్రాణాలు కోల్పోవద్దు – ములుగు జిల్లా ఎస్పీ డా శబరిష్ (SP Dr Sabreesh)…
ఎస్పీ డా శబరీష్ (SP Dr Sabreesh) : ప్రభుత్వ నిషేదిత CPI మావోయిస్టు పార్టీలో పని చేయుచున్న అజ్ఞాత మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసి పోలీస్ ఎదట లొంగిపోవాలని ములుగు పోలీస్ వారి విజ్ఞప్తి. నిషేధిత సిపిఐ మావోయిస్టు సిద్ధాంతాలు కాలం చెల్లినవని వారి భావజాలం ప్రజల్లో ప్రాముఖ్యం కోల్పోయిందని మావోయిస్టు సిద్ధాంతాలను ప్రజలు నమ్మడం లేదు. కొంతమంది అగ్ర నాయకులు కాలం చెల్లిన సిద్ధాంతాలతో సామాన్య ప్రజల జీవితానికి విఘాతం కల్పిస్తూ ఇన్ఫార్మర్ నేపంతో అమాయకపు ఆదివాసులను చంపుతూ, మందు పాతరాలు పేల్చుతూ, తెలంగాణ మరియు చతిస్గడ్ సరిహద్దుల్లో అమాయక ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తునారు.
లొంగిపోయిన మావోయిస్ట్ ల ఉపాధి మా భాద్యత..
తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం సాధించవచ్చు అనే అపోహ వదిలి తెలంగాణ ప్రభుత్వం ఎదుట లొంగిపోయి, జనజీవన స్రవంతిలో కలిసి వృద్ధాప్యంలో ఉన్న తమ తల్లిదండ్రులకు మరియు కుటుంబ సభ్యుల యొక్క బాధ్యత నేరవేర్చే వ్యక్తిగా ఉండాలని, ములుగు జిల్లా పోలీస్ వారు కోరుచున్నారు. ములుగు జిల్లా నుండి అజ్ఞాతంలో సిపిఐ మావోయిస్టు పార్టీలో పనిచేయుచున్న నాయకులు మరియు సభ్యులు ములుగు జిల్లా పోలీస్ ఎదుట లొంగిపోవాలి. లొంగిపోయిన వారికి వారి పేరు మీద ఉన్న నగదు రివార్డును మరియు జీవనోపాధి కోసం వారికి పునరావాసం కల్పించడానికి ప్రభుత్వం ద్వారా కృషిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేయుచున్నాము.
జనజీవన స్రవంతిలో కలవండి మీ కుటుంబ బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుకోండి..
సంప్రదించవలసిన నెంబర్లు :
ఎస్ పి ములుగు – 8712670100
ఓ ఎస్ డి ములుగు – 8712670101
ఏ ఎస్ పి ఏటూరునాగారం -8 712670104
డి ఎస్ పి ములుగు – 8712670103
ఎటువంటి భయాలకు లోను కావద్దు ధైర్యంగా లొంగిపోండి మీ సంరక్షణ – సంక్షేమం మా బాధ్యత. మీ కుటుంబంతో హాయిగా జీవించండి.
ఇది చదవండి : వివాదంలో చిక్కుకున్న మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి..
- ఆయుష్ విద్యార్థులకు తెలంగాణ సర్కార్ తీపికబురు.
తెలంగాణలో ఆయుష్ వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఆయుర్వేద, హోమియోపతి, యునాని, నాచురోపతి విభాగాల్లోని హౌస్ సర్జన్లు, పీజీ విద్యార్థుల స్టైఫండ్లను అల్లోపతి వైద్య విద్యార్థులతో సమానంగా పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో… - తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం.
తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, ఈ విజయాన్ని ఏ శక్తీ ఆపలేదని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే బీజేపీ అధిష్ఠానం దృష్టి పూర్తిగా తెలంగాణపైనే… - తెలంగాణ రైజింగ్ సమ్మిట్‌కు ఫిలిప్పీన్స్ కార్యదర్శికి ఆహ్వానం.
తెలంగాణను ప్రపంచ పెట్టుబడులు, వ్యవసాయ వాణిజ్యం, పారిశ్రామిక అవకాశాలకు ప్రధాన గమ్యస్థానంగా నిలిపే లక్ష్యంతో 2026 డిసెంబర్లో హైదరాబాద్‌లో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ సమ్మిట్‌కు హాజరుకావాలని ఫిలిప్పీన్స్ వ్యవసాయ శాఖ కార్యదర్శి ఫ్రాన్సిస్కో పి.టియు లారెల్ జూనియర్‌ను మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆహ్వానించారు.…
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: ఎస్పీ కీలక ప్రకటన… వనం వీడి జనంలోకి రండి
సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం డీ మార్ట్ (D Mart) లోని ఫుడ్ ప్రొడక్ట్ లో చచ్చిపోయిన ఎలుక కలకలం సృష్టించింది…
రామచంద్రాపురం పరిధిలోని డీమార్ట్ (D Mart) లో వస్తువులు కొనుగోలు చేసేందుకు వెళ్లిన ఓ కస్టమర్ పిల్లలు తినే స్నాక్స్ తీసుకునేందుకు ర్యాక్ వద్దకు వెళ్లగా చచ్చిపోయిన ఎలుక దర్శనమిచ్చింది. స్నాక్స్ ప్రొడక్ట్స్ తీసుకోగా అందులో నుంచి దుర్గంధం రావడంతో పరిశీలించిన కస్టమర్ కు క్షుణ్ణంగా పరిశీలించగా కుళ్ళిపోయిన ఎలుక కనిపించింది.దీంతో అవాక్కైనా సదరు కస్టమర్ సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు. ఫుడ్ ప్రోడక్ట్ లో ఎలుక రావడంతో పక్కనున్న మిగిలిన కస్టమర్లు సైతం ఆందోళనకు దిగి స్టోర్ సిబ్బందిని నిలదీశారు.
డీమార్ట్ స్టోర్ లో సిబ్బంది నిర్లక్ష్యం..
నిత్యావసర సరుకులు కొనడానికి అనేకమంది కస్టమర్లు డీమార్ట్ కు వస్తారని అటువంటి స్టోర్ లో ఇంత నిర్లక్ష్యంగా సిబ్బంది వ్యవహరించడం సరికాదని మండిపడ్డారు. తప్పు జరిగిందని, చూసుకోలేదని డీ మార్ట్ నిర్వాహకులు దాటవేసే ప్రయత్నం చేశారు. ఈ విషయం బయటకు, మీడియాకు చెప్పొద్దని సదరు కస్టమర్ ను బతిమాలడి బయటకు పొక్కనీయకుండా జాగ్రత్త పడ్డారు. వెంటనే ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈ విషయంలో కలుగజేసుకొని అన్ని ప్రొడక్టుల క్వాలిటీ ని పరిశీలించి నిర్లక్ష్యంగా ఉన్న డీమార్ట్ యాజమాన్యంపై చర్యలకు ఉపక్రమించాలని పలువురు కస్టమర్లు డిమాండ్ చేస్తున్నారు.
ఇది చదవండి : సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ప్రకటన..
- ఆయుష్ విద్యార్థులకు తెలంగాణ సర్కార్ తీపికబురు.
తెలంగాణలో ఆయుష్ వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఆయుర్వేద, హోమియోపతి, యునాని, నాచురోపతి విభాగాల్లోని హౌస్ సర్జన్లు, పీజీ విద్యార్థుల స్టైఫండ్లను అల్లోపతి వైద్య విద్యార్థులతో సమానంగా పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో… - తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం.
తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, ఈ విజయాన్ని ఏ శక్తీ ఆపలేదని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే బీజేపీ అధిష్ఠానం దృష్టి పూర్తిగా తెలంగాణపైనే… - తెలంగాణ రైజింగ్ సమ్మిట్‌కు ఫిలిప్పీన్స్ కార్యదర్శికి ఆహ్వానం.
తెలంగాణను ప్రపంచ పెట్టుబడులు, వ్యవసాయ వాణిజ్యం, పారిశ్రామిక అవకాశాలకు ప్రధాన గమ్యస్థానంగా నిలిపే లక్ష్యంతో 2026 డిసెంబర్లో హైదరాబాద్‌లో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ సమ్మిట్‌కు హాజరుకావాలని ఫిలిప్పీన్స్ వ్యవసాయ శాఖ కార్యదర్శి ఫ్రాన్సిస్కో పి.టియు లారెల్ జూనియర్‌ను మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆహ్వానించారు.…
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: డీ మార్ట్ ఫుడ్ ప్రొడక్ట్స్ లో చచ్చిన ఎలుక కలకలం..
శ్రీ రామనవమి (Sri Rama Navami) :
నంద్యాల జిల్లా శ్రీశైలంలో శ్రీ రామనవమి (Sri Rama Navami) సందర్భంగా శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం దేవస్థానం ఘనంగా నిర్వహించింది. దేవస్థానానికి అనుబంధ అలయమైన ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో ఉదయం నుండి శ్రీ సీతారామస్వామికి శ్రీ ప్రసన్నాంజనేయస్వామికి విశేష పూజలు నిర్వహించి పూజలనంతరం శ్రీ సీతారాముల కళ్యాణం కన్నులపండువగా నిర్వహించారు.
ఇది చదవండి : ఈ నెల 17న శ్రీరామనవమి తిరు కళ్యాణ మహోత్సవం
కళ్యాణోత్సవానికి ముందుగా లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ సంకల్పం ఫాటించి కళ్యాణోత్సవ కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతి పూజ, వృద్ధి అభ్యుదయాలను కాంక్షిస్తూ పుణ్యాహవాచనం, కంకణపూజ, యజ్ఞోపవీత పూజ, నూతన వస్త్ర సమర్పణ, వరపూజ, ప్రవర పఠన, మాంగల్య పూజ, శ్రీసీతాదేవికి మాంగల్య ధారణ, తలంబ్రాలు మొదలైన కార్యక్రమాలతో శాస్త్రోక్తకంగా సాంప్రదాయబద్ధంగా కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని దేవస్థానం అధికారులు, సిబ్బంది స్థానికులు భక్తులు తిలకించారు అనంతరం దేవస్థానం భక్తులకు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ తీర్థ ప్రసాదాలను అందజేశారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకున్న మంత్రి లోకేష్.
పల్నాడు జిల్లా పర్యటనలో భాగంగా నర్సరావుపేట సమీపంలోని ప్రముఖ కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆలయాన్ని మంత్రి నారా లోకేష్ సందర్శించారు. ఆలయ ప్రాంగణానికి చేరుకున్న మంత్రి లోకేష్‌కు వేదపండితులు, ఆలయ అధికారులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం శ్రీ… - శబరిమలలో తెలుగు భక్తుల తీవ్ర ఇబ్బందులు.
శబరిమల యాత్రలో తెలుగు భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాష్ట్ర గురుస్వాములు ఆవేదన వ్యక్తం చేశారు. భక్తుల సమస్యలపై విజయవాడలో గురుస్వాముల సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాశ్ రెడ్డి… - విశాఖ జిల్లా కొత్త గాజువాకలో శ్రీ సత్తెమ్మతల్లి పంగడ మహోత్సవాలు.
విశాఖ కొత్త గాజువాకలో శ్రీ సత్తెమ్మతల్లి పంగడ మహోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆగస్టు 28 నుంచి మూడు రోజుల పాటు ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఆగస్టు 30న సత్తెమ్మతల్లి ప్రధాన పండుగ నిర్వహించనున్నారు. పంచామృతాలు, పసుపు, కుంకుమ, సుగంధ ద్రవ్యాలతో అమ్మవారికి…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: శ్రీశైలంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు…
వేములవాడ (Vemulawada)..
తెలంగాణలోనే ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన వేములవాడ (Vemulawada) శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో శ్రీ సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. రాములోరి కళ్యాణం తిలకించడానికి దాదాపు 1 లక్షకు పైగా భక్తులు హజరయ్యారు. ఆలయ అర్చకులు వేద మంత్రోత్సవాల మధ్య 2 గంటల సేపు కళ్యాణం వైభవంగా జరిపించారు. దేవాలయం తరుపున ఆలయ ఈఓ కృష్ఱ ప్రసాద్, మున్సిపల్ తరుపున కమీషనర్ అన్వేష్ శ్రీ స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.
ఇది చదవండి : శ్రీ సీతారాముల కల్యాణానికి ముహూర్తం ఖరారు..
కల్యాణం తిలకించడానికి దేశం నలుమూలల నుండి శివపార్వతులు, జోగినీలు హజరయ్యారు. ఒక వైపు సీతారాముల కళ్యాణం జరుగుతుంటే మారో వైపు జోగినిలు, శివపార్వతులు ఒకరిపై ఒకరు తలంబ్రాలు పోసుకుంటూ శివుడిని వివాహం అడారు. దేశంలో మారెక్కడ లేని విధంగా ఇలా రాముడి కళ్యాణం సందర్భంగా శివుడిని జోగినిలు, శివపార్వతులు కళ్యాణం చేసుకోవడం ఇక్కడ అనవాయితీగా కోనసాగుతుంది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకున్న మంత్రి లోకేష్.
పల్నాడు జిల్లా పర్యటనలో భాగంగా నర్సరావుపేట సమీపంలోని ప్రముఖ కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆలయాన్ని మంత్రి నారా లోకేష్ సందర్శించారు. ఆలయ ప్రాంగణానికి చేరుకున్న మంత్రి లోకేష్‌కు వేదపండితులు, ఆలయ అధికారులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం శ్రీ… - శబరిమలలో తెలుగు భక్తుల తీవ్ర ఇబ్బందులు.
శబరిమల యాత్రలో తెలుగు భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాష్ట్ర గురుస్వాములు ఆవేదన వ్యక్తం చేశారు. భక్తుల సమస్యలపై విజయవాడలో గురుస్వాముల సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాశ్ రెడ్డి… - విశాఖ జిల్లా కొత్త గాజువాకలో శ్రీ సత్తెమ్మతల్లి పంగడ మహోత్సవాలు.
విశాఖ కొత్త గాజువాకలో శ్రీ సత్తెమ్మతల్లి పంగడ మహోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆగస్టు 28 నుంచి మూడు రోజుల పాటు ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఆగస్టు 30న సత్తెమ్మతల్లి ప్రధాన పండుగ నిర్వహించనున్నారు. పంచామృతాలు, పసుపు, కుంకుమ, సుగంధ ద్రవ్యాలతో అమ్మవారికి…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: రాజన్న సన్నిధిలో.. రాములోరి కల్యాణం..
కావటి మనోహర్ నాయుడు (Kavati Manohar Naidu) మీడియాతో మాట్లాడుతూ…
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చిలకలూరిపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కావటి శివ నాగ మనోహర్ నాయుడు (Kavati Manohar Naidu)
కావటి మనోహర్ నాయుడు (Kavati Manohar Naidu) మీడియాతో మాట్లాడుతూ… 2019 జగనన్న ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి నేటి వరకు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి అండదండగా ఉంటూ కష్టం అనే మాటని దరిచేరనీయకుండా ప్రతి ఒక్కరిని సొంత బిడ్డలా చేరదీస్తున్న ఏకైక నాయకుడు మన వైయస్ జగన్మోహన్ రెడ్డి అని చిలకలూరిపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కావటి శివ నాగ మనోహర్ నాయుడు పేర్కొన్నారు. సాగర్ నుంచి మంచినీళ్ళు చెరువులకు వస్తున్న సందర్భంగా కావటి మనోహర్ పార్టీ నాయకులతో కలిసి మంచినీళ్ళ చెరువులను సందర్శించారు. ఈ సందర్భంగా కావటి మీడియాతో మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేట ప్రజలు మంచినీళ్లకు ఇబ్బంది పడిన రోజు ఏనాడు లేదని కావటి తెలిపారు.
ఇప్పటికి ప్రత్తిపాటి పుల్లారావు అంటే చాలామందికి తెలియదు. గుడ్డి పత్తి అమ్ముకునే పుల్లారావు అంటే టక్కున గుర్తొస్తుంది…
మొన్న ఏదో ప్రత్తిపాటి పుల్లారావు మంచినీళ్ల చెరువులను సందర్శించి ఏదో మతిభ్రమించి మాట్లాడుతున్నాడే తప్ప అందులో వాస్తవం లేదని కావటి స్పష్టం చేశారు. పుల్లారావు ప్రజలను తప్పుదోవ పట్టించి వైసిపి ప్రభుత్వం మీద బురద జల్లాలని చూస్తున్నారని కావటి తెలిపారు. పుల్లారావు మంత్రిగా ఉన్న హయాంలో పేట ప్రజలు మంచినీళ్ల కోసం అనేక ఇబ్బందులు పడ్డారని రెండు, మూడు రోజులకు ఒకసారి కూడా మంచినీళ్లు వదిలిన సందర్భాలు చాలా ఉన్నాయని ఈ సందర్భంగా కావటి తెలియజేశారు. పుల్లారావు నాలుగున్నర సంవత్సరాలు పేట ప్రజలను వదిలి పెట్టి తన వ్యాపారాల మీద అక్రమ ఆస్తుల మీద దృష్టి పెట్టాడే తప్ప ప్రజలని పట్టించుకోలేదన్నారు. ఈరోజున ఏదో ఎలక్షన్ లు ఉన్నాయని ఆరు నెలల నుంచి తూతూ మంత్రంగా ప్రచారాలు చేసినంత మాత్రాన పుల్లారావు గెలిచే పరిస్థితి లేదని కావటి తెలియజేశారు. నిజానికి ప్రత్తిపాటి పుల్లారావు అంటే చాలామందికి తెలియదని గుడ్డి పత్తి అమ్ముకునే పుల్లారావు అంటే ప్రజలకు టక్కున గుర్తొస్తుందన్నారు.
పుల్లారావు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయి…
అది పుల్లారావు నీచమైన రాజకీయ జీవిత చరిత్ర అని కావటి, పుల్లారావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పుల్లారావు మాట్లాడితే కావటి మనోహర్, మరియు అనిల్ కుమార్ యాదవ్ స్థానికుడు కాదని పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నాడు. నిజానికి పుల్లారావు ఎక్కడి నుంచి వచ్చారో ఒక్కసారి చరిత్రని నెమరు వేసుకోమని తెలియజేశారు. నిజానికి పుల్లారావు కూడా ప్రకాశం జిల్లా నుంచి పేటకి బతుకుతెరువు కోసం వచ్చి గుడ్డి పత్తి అమ్ముకుంటూ అక్రమ ఆస్తుల కూడా పెట్టి రాజకీయంలోకి వచ్చాడే తప్ప నిజానికి పుల్లారావు కూడా స్థానికుడు కాదని ప్రకాశం జిల్లా నుంచి వచ్చాడని కావటి, పుల్లారావుపై మండిపడ్డారు. నిజానికి పుల్లారావు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు ఉన్నాయని కావటి చురకలు వేశారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో మరల జగనన్నే ముఖ్యమంత్రి అవుతాడని చిలకలూరిపేటలో మేమే గెలుస్తామని కావటి ధీమా వ్యక్తం చేశారు.
ఇది చదవండి : సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు రూటే సప’రేటు’…
- చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు.. లోకేశ్ నిరసన.
తెలుగుదేశం పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు అరెస్టు జరిగి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిరసన తెలిపారు. ‘నిజం గెలిచింది’ అనే నినాదంతో ఉండవల్లిలోని తన నివాసంలో 53 కొవ్వొత్తులు వెలిగించి నాటి… - సంక్షేమంపై మాట్లాడే నైతిక అర్హత వైసీపీకి లేదు: కొండపల్లి.
సంక్షేమం గురించి మాట్లాడే నైతిక అర్హత వైసీపీకి లేదని రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమలు, ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమన్నారు. ఎన్నికల హామీ మేరకు… - భూమికి సంపూర్ణ భద్రతే కూటమి ప్రభుత్వ లక్ష్యం.
సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన అనే మూడు మూల మంత్రాలతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సచివాలయానికే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ప్రజల మధ్య ఉంటూ వారి జీవితాల్లో వెలుగులు నింపడమే అసలైన సుపరిపాలన అని అన్నారు.…
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: వైసిపి పై బురద జల్లాలని చూస్తున్నారు – కావటి
నీటి యుద్ధం (Water war) : త్రాగునీరు కోసం రోడ్లు ఎక్కిన వెంకట నరసింహ పురం కాలనీ వాసులు…
నీటి యుద్ధం (Water war) : గన్నవరం మండలం కేసరపల్లి గ్రామ పంచాయతీ వెంకట నరసింహపురం కాలనీ వాసులు త్రాగునీరు కోసం రోడ్లు ఎక్కవలసిన పరిస్థితి నెలకొంది, గత 20 రోజుల నుండి కాలనీలో నీటి సమస్య ఉందని కేసరపల్లి సర్పంచ్ పంచాయతీ కార్యదర్శికి తెలియజేసిన కనీసం ఇటువైపు కన్నెత్తి చూడటం లేదని, మొక్కుబడిగా రోజుకు ఒక ట్రాక్టర్ ట్యాంకర్ పంపిస్తున్నారు ఇంటికి రెండు బకెట్లు నీళ్లు కూడా రావడం లేదు, మండుటెండలో నీళ్ల కోసం నాన్న ఇబ్బందులు పడుతున్నామని వెంకట నరసింహాపురం కాలనీవాసులు రోడ్లపైకి వచ్చి కేసరపల్లి సర్పంచ్ కార్యదర్శి ఇప్పటికైనా తమ గోడు విని తమకు త్రాగునీరు అందించాలని వేడుకుంటున్నారు.
ఇది చదవండి : కొవ్వూరు లో వింత ఘటన.. వేప చెట్టు నుంచి పాలు
కాలనీ వాసులు మాట్లాడుతూ….
నిత్యవసరమైన నీటి కోసం చాలా ఇబ్బందులు పడుతున్నాము రోడ్లు ఎక్కవలసిన పరిస్థితి వచ్చింది. ఎప్పుడో రాత్రి సమయంలో అరగంట మాత్రమే పంచాయతీ నీటి కుళాయిల ద్వారా ఒకప్పుడు వచ్చాయి, ఇప్పుడు అవి కూడా రావడం లేదు. పంచాయతీ నీళ్లు కోసం తెల్లవారుజామున 3 గంటల వరకు నిద్రలు మానుకుని ఎదురుచూపులు చూస్తున్నాము. మండుటెండల సైతం లెక్కచేయకుండా జనాలు నీళ్ల కోసం రోడ్ల వెంబడి తిరగవలసిన పరిస్థితి నెలకొంది. గత 20 రోజులుగా గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి కి చెప్పిన నీటి సమస్య తీర్చకుండా నిర్లక్ష్య వైఖరి గా వ్యవహరిస్తున్నారు. ఒక్కో డ్రమ్ము నీరు 25 రూపాయలు చెల్లించి బయట నుంచి కొనుక్కుని దాహార్తిని తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నాయకులు అధికారులు స్పందించి మా నీటి దాహార్తిని తీర్చాలని కేసరపల్లి శివారు వెంకట నరసింహ పురం కాలనీవాసులు వేడుకుంటున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు.. లోకేశ్ నిరసన.
తెలుగుదేశం పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు అరెస్టు జరిగి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిరసన తెలిపారు. ‘నిజం గెలిచింది’ అనే నినాదంతో ఉండవల్లిలోని తన నివాసంలో 53 కొవ్వొత్తులు వెలిగించి నాటి… - సంక్షేమంపై మాట్లాడే నైతిక అర్హత వైసీపీకి లేదు: కొండపల్లి.
సంక్షేమం గురించి మాట్లాడే నైతిక అర్హత వైసీపీకి లేదని రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమలు, ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమన్నారు. ఎన్నికల హామీ మేరకు… - భూమికి సంపూర్ణ భద్రతే కూటమి ప్రభుత్వ లక్ష్యం.
సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన అనే మూడు మూల మంత్రాలతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సచివాలయానికే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ప్రజల మధ్య ఉంటూ వారి జీవితాల్లో వెలుగులు నింపడమే అసలైన సుపరిపాలన అని అన్నారు.…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: మండుటెండలో నీటి యుద్ధం…
సుజనా చౌదరి (Sujana Chowdhary) :
విజయవాడ వెస్ట్ నుంచి పోటీ చేస్తున్న సుజనా చౌదరి (Sujana Chowdhary) గెలుపు దళిత బహుజనుల గెలుపు అవుతుందని అమరావతి దళిత బహుజన సేవ సమితి కన్వీనర్ రామకోటయ్య అన్నారు. అమరావతి రైతు నేతలు యుగంధర్, అమరావతి మహిళా నేత వరలక్ష్మి తో కలిసి మీడియా లో మాట్లాడారు. అమరావతి రైతుల కన్నీళ్ల ప్రవాహం లో జగన్ కొట్టుకుపోకతప్పదని రామకోటయ్య జోస్యం చెప్పారు. దళిత మేధావి డాక్టర్ సుధాకర్ నుండి కిరణ్ వరకూ మరణాలకు జగనే బాధ్యత వహించాలని అన్నారు.
ఇది చదవండి : సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు రూటే సప’రేటు’…
దళితుడైన సుబ్రహ్మణ్యం ని చంపి డోర్ డెలివరీ చేసిన నరహంతకుడు అనంతబాబుని పక్కనే పెట్టుకుని జగన్ తిరుగుతున్నారని, జగన్ దుర్మార్గుడనడానికి ఇదే నిదర్శనమని అన్నారు. అమరావతి రైతులకు అండగా నిలిచిన సుజనాని గెలిపించుకోవడం తమ బాధ్యతని అమరావతి మహిళా రైతు నేత వరలక్ష్మి చెప్పారు. పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి సుజనాతోనే సాధ్యమని అమరావతి రైతు నేత యుగంధర్ అన్నారు అమరావతి రైతులకు అండగా నిలిచిన సుజనాను గెలిపించుకోవడం తమ బాధ్యత అన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్.
పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన “ఎస్ ఆర్ కళ్యాణమండపం” డైరెక్టర్ శ్రీధర్ గాదె, శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్ ప్రొడక్షన్ నెం.3 సినిమా “ఎస్ఆర్ కళ్యాణమండపం” చిత్రంతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించి దర్శకుడిగా ప్రతిభ చాటుకున్న డైరెక్టర్ శ్రీధర్… - “15 ఏళ్ల నా కల నెరవేరింది.” ‘పంచనామా’ ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్.
“15 ఏళ్ల నా కల నెరవేరింది.. నా బిడ్డలా చూసుకున్నా..” ‘పంచనామా’ ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్ తెలుగు ప్రేక్షకులను అలరించేలా విభిన్నమైన, ఆసక్తికరమైన కథాంశాలతో ముందుకు సాగుతున్న జీ5 మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్‌ను అందుబాటులోకి తీసుకురాబోతుంది. అదే ‘పంచనామా’ సిరీస్.… - హైకూ’ టీజర్.. అందమైన కవితలాంటి ప్రేమ. కెమిస్ట్రీతో మెప్పిస్తోన్న టీజర్.
హైకూ’ టీజర్.. అందమైన కవితలాంటి ప్రేమ. కెమిస్ట్రీతో మెప్పిస్తోన్న టీజర్. విజన్ సినిమా హౌస్ బ్యానర్‌పై ఏగన్ హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘హైకూ’. ఈ మూవీ టీజర్‌ను ప్రముఖ రొమాంటిక్ హీరో హరీష్ కళ్యాణ్ రిలీజ్ చేశారు. కలర్‌ఫుల్ విజువల్స్,…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: సుజనా గెలుపు దళిత బహుజనుల గెలుపు…














