గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ కు తాడికొండ ఎన్నికల రిటర్నింగ్ అధికారి (ఆర్వో) ఎం. గంగరాజు నోటీసులు. ఈ నెల 25న తాడికొండ మండలం లాం గ్రామంలో నిర్వహించిన టీడీపీ ప్రచార సభలో పెమ్మసాని మాట్లాడుతూ సద్దాం హుస్సేన్ బంకర్లో దాక్కొని ఉంటే తీసుకొచ్చి కుక్కను కొట్టినట్లు కొట్టి చంపారని చెప్పారు. దీనిపై ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు షేక్ నాగుల్ మీరా వేర్వేరుగా గుంటూరు జిల్లా ఎస్పీతో పాటు తాడికొండ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. పెమ్మసాని చంద్రశేఖర్ ఓ వర్గం ఓట్లను చీల్చేందుకు ముస్లింల మనోభావాలను దెబ్బతీసేలా ఉద్దేశపూర్వకంగా అవా స్తవాలను ప్రచారం చేస్తున్నారని తమ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. వివరణ ఇవ్వాలంటూ పెమ్మసాని చంద్రశేఖర్ కు ఆర్వో నోటీసులు జారీ. దీనిపై చంద్రశేఖర్ శుక్రవారం సాయంత్రం తన వివరణను ఆర్వోకు పంపారు.
Prakash
ఆలయ ఈవో డి.పెద్దిరాజు(D. Peddiraja) సమావేశం..
శ్రీశైలం(Srisailam) దుకాణదారులతో ఈవో పెద్దిరాజు సమావేశం భక్తులతో మర్యాదగా మెలగాలిని సూచన. శ్రీశైలం దేవస్థానం(Srisailam Devasthanam) పరిధిలోని దుకాణాదారులతో ఆలయ ఈవో డి.పెద్దిరాజు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో స్థానిక సిఐ ప్రసాదరావు(CI Prasada Rao), ఎస్సై లక్ష్మణరావు(SSI Lakshmana Rao), దేవస్థానం రెవెన్యూ అధికారులు, సిబ్బంది స్థానిక దుకాణదారులు పాల్గొన్నారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఈ సందర్భంగా ఈవో పెద్దిరాజు మాట్లాడుతూ ఏప్రిల్ 6 నుంచి 10వ తేదీ వరకు ఉగాది మహోత్సవాలు జరగనున్నాయని ఈ నేపద్యంలో ఏప్రిల్ 1 నుంచే కర్ణాటక, మహారాష్ట్రలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో క్షేత్రానికి వచ్చే అవకాశం ఉన్నందన్నారు ఈ సందర్భంలో దుకాణాదారులు భక్తులతో మర్యాదగా మెలగాలని, సంయమనం పాటించాలని సూచించారు అలానే దుకాణాలలో విక్రయించే వస్తువులు, తినుబండారాలు తదితర వాటి ధరల పట్టికను హింది, ఇంగ్లీష్, కన్నడ, తెలుగు భాషలలో దుకాణాల వద్ద ఏర్పాటు చేయాలని ఆదేశించారు అదేవిధంగా హోటల్ నిర్వాహకులు శుచిశుభ్రతను విధిగా పాటించాలని,
ఎం. ఆర్. పి రేట్లకు విక్రయించాలని సూచించారు అనంతరం స్థానిక సీఐ ప్రసాదరావు మాట్లాడుతూ దుకాణాలలో పనిచేసే పనివారికి కూడా భక్తులతో ఎలా మెలగాలో నిర్వాహకులు అవగాహణ కల్పించాలని, పనివారి ఆధార్ ని కూడా సేకరించి పరిశీలించుకోవాలని అలానే దుకాణాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
ఇదిచదవండి: నారా భువనేశ్వరి కృష్ణా జిల్లా పర్యటన…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
మేమంతా సిద్ధం డే3
తేది:29-03-2024
స్థలం: కర్నూల్ జిల్లా
3వరోజు మేమంతా సిద్ధం యాత్ర(Bus Yatra Day -3).. జగన్ కు నిరాజనం పలుకుతున్న జనం
మంచి చేసిన మీ ప్రభుత్వానికి రక్షాబంధన్ కట్టండి: అక్కచెల్లమ్మలకు సీఎం జగన్(CM Jagan). సామాజిక న్యాయం చేసి వైయస్ఆర్సీపీ(YSRCP) ఒక సామాజిక ఇంధ్రధనుస్సుగా నిలిచింది. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మనకు, మాట తప్పటమే తెలిసిన చంద్రబాబు కుటమి మధ్య జరుగుతున్న ఈ యుద్దానికి మీరు సిద్ధమేనా. పొత్తులను, జిత్తులను, మోసాలను, అబద్ధాలను, కుట్రలను ఎదుర్కునేందుకు, పేదల భవిష్యతుకు అండగా నిలిచేందుకు నేను సిద్ధం. కర్నూలు జిల్లాలో సీఎం జగన్ బస్సుయాత్ర (BUS YATRA)3వ రోజుకు చేరుకుంది. ఎమ్మిగనూరులో భారీగా నిర్వహిస్తోన్న ‘మేమంతా సిద్ధం’ సభకు(SIDDHAM BUS YATRA DAY -3).. లక్షలాదిగా జనం తరలివచ్చారు. నేడు దిగ్విజయంగా సీఎం జగన్(CM Jagan) బస్సు యాత్ర కొనసాగింది. గూడూరు మండలం పెంచికలపాడు నుంచి కొత్తూరు, పాలకుర్తి మీదుగా కోడుమూరుకు.. కోడుమూరు నుంచి వర్కురు, వేముగొడు, పుట్టపాశం, హెచ్ కైరవాడి, గోనెగండ్ల, రాల్లదొడ్డి వరకు బస్సు యాత్ర సాగింది. రాల్లదొడ్డి శివారులో భోజన విరామం తీసుకున్నారు. అనంతరం ఎర్రకోట మీదుగా ఎమ్మిగనూరుకు బస్సుయాత్ర చేరింది. ఎమ్మిగనూరులో ‘మేమంతా సిద్ధం’ భారీ బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సీఎం జగన్ స్పీచ్ హైలెట్స్ | CM Jagan Speech
ఎమ్మిగనూరులో ఈ సభ ఎప్పటికి సువర్ణ ఆక్షరాలతో నిలిచిపోతుంది. నా రాయలసీమ గడ్డ మీద మన కర్నూల్ జిల్లాలో వాన బిందువులు ఒక్కటైనట్టు, బిందువు బిందువు చేసి సింధువైనట్టు జన సముద్రం కనిపిస్తోంది. నా వాళ్లందరు జెండాలు జత కట్టిన వారిని పేదల వ్యతిరేకులను ఒడించి మీ వాడిని మీ బిడ్డను గెలిపించటం కోసం రావటం నా పూర్వ జన్మ సుక్రుతం.
మే 13న కురుక్షేత్ర యుద్ధం జరుగుబోతుంది. పేదలు ఒక వైపున పెత్తందారులు ఒక వైపున. పెత్తందారులను ఒడించేందుకు, పేదల పక్షాన నిలబడేందుకు నేను సిద్ధం, మీరంతా సిద్ధమేనా!
ఈ పొత్తులను, జిత్తులను, మోసాలను, అబద్ధాలను, కుట్రలను ఎదుర్కునేందుకు, పేదల భవిష్యతుకు అండగా నిలిచేందుకు నేను సిద్ధం.
సిద్ధం, సిద్ధం అని చెబుతు లేచే చేయి, ప్రతి గుండె తమ ఇంట మంచి జరిగిందని, ఈ మంచి మేమంతా మద్ధతు పలుకుతామని ఇక్కడున్న ప్రతి చేయి చెబుతుంది.
రాష్ట్రంలో ఈ 58నెలల కాలంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. నేను చెప్పే విషయాలు ప్రతి ఇంటికి వెళ్లి ఈ మార్పులు గురించి చెప్పాలని కోరుతున్న.
ఈరోజు 10, 16 ఏళ్ల తర్వాత పిల్లాడి చదువులు తర్వాత ఆనాడి ప్రపంచంలో ఎలా ఉండాలని ఆలోచించి, వారి భవిష్యత్తుకోసం మంచి నిర్ణయాలు తీసుకుంటున్న ప్రభుత్వానికి ఏ పేద కుటుంబమైనా మద్ధతు పలకకుండా ఎందుకు ఉంటుంది.
గ్రాడ్యుయేట్ చేసిన ఉద్యోగం రావటంలేదని బాధపడుతున్నావారి గురించి బాగా తెలుసు.. అందుకు నిలబెట్టే చదువులు, ఉద్యోగాలు కల్పిస్తున్నాం. ఈరోజు బడులకు పంపే తల్లులను ప్రోత్సాహించేందుకు అమ్మఒడిని తీసుకువచ్చాం, నాడు- నేడు, ఇంగ్లీష్ మీడియం, క్లాసు రూంలలో ఐబీ ప్యానల్, డిజిటల్ బోధనలు, ట్యాబులు, విద్యా కానుక కిట్లు, గోరు ముద్ద తీసుకురావటం కానీ మన ప్రభుత్వంలోనే జరిగింది. పిల్లల పై ఇంత ధ్యాస పెట్టడం గతంలో జరిగిందా ఆలోచన చేయండి. గతంలో ఏ పాలకులు పిల్లలు చదువులు గురించి ఆలోచించలేదు, కారణం ఒటు హక్కు లేకపోవటం.
అలాంటి పరిస్థితుల నుంచి క్వాలిటీ చదువు అందించాలని, పిల్లల భవిష్యత్తు మారాలని విద్యారంగంలో సంస్కరణలు తీసుకవచ్చిన ప్రభుత్వం భారతదేశంలో మరోకటి లేదని గర్వంగా చెబుతున్నా.. ఈలాంటి సంస్కరణలకు మద్ధతు పలుకుతారా? కనీసం పిల్లల గురించి ఆలోచన చేయని చంద్రబాబు కూటమికి మద్దతు పలుకుతారా, కాబట్టే చెబుతున్న ఈ ఎన్నికల్లో కేవలం ఎమ్మెల్యే, ఎంపీగా ఎన్నుకునే ఒటు ఆ పిల్లల భవిష్యతు మారుతుంది, ఆ పిల్లల తల్లిదండ్రుల భవిష్యతు మారుతుంది. మీ పిల్లల భవిష్యతు కోసం యుద్ధం చేయటానికి నేను సిద్ధం, మీరంతా సిద్ధమేనా!
గత ప్రభుత్వాలు నా అక్కచెల్లెల కోసం, చిట్టితల్లుల కోసం, అవ్వతాతలకోసం ఏమి చేసిందా అని అడిగితే చెప్పుకోవటానికి ఒక్కటి కూడా లేదు, గత ప్రభుత్వాలు ఎంత దారుణంగా ఆలోచన చేశాయంటే, 100కి 30 మంది కూడా పదవ తరగతి పూర్తి చేసినవారు లేరు, మన రాష్ట్రంలో బాల్యవివాహాలు ఉన్న ఆపే పరిస్థితి లేదు, తల్లికి ఎన్నో ఆశలు ఉన్న పిల్లల భవిష్యత్తు నిర్ణయించే ఆదాయం తల్లి దగ్గర లేదంటే… ఈటువంటి పరిస్థుతులు ఉన్న పట్టించుకోని పాలకులు ఉన్నా లేనట్టే
రైతులు, గింజలు పండించటంలో రైతు పాత్ర, కూలీ పాత్ర, నా అక్కచెల్లమ్మల పాత్ర నా కాళ్లతో నేను చూశా… ఈరోజు పనివాళ్లు రోజు కూలీలుగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటు ఎంత కష్టంగా వారి బతుకు బండిని నడిపిస్తున్నారో నా పాదయాత్రలో చూశా.. కాబట్టే వారి శ్రమకు ఎం చేయాలి అని చెప్పి 58 నెలల పాలనలో అదే ఆలోచన ముందుకు అడుగులు వేసి ప్రతి పథకం తీసుకువచ్చాం, ఈ ఆలోచనలో నుంచి పుట్టింది చేదోడు, విద్యాదీవెన, నేతన్న నేస్తం, మత్య్సకార భరోసా, ఆసరా, సున్నా వడ్డీ, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, అన్నిటికి మించి ప్రభుత్వం ఇచ్చే ప్రయోజనాలు ఆ ఇంటి ఇల్లాలి చేతులోనే ఆ డబ్బులు ఏ ప్రభుత్వమైన పెట్టగలిగితే ఆ కుటుంబాలు బాగుపడతాయననే ఆలోచించి అడుగులు వేశాం. ఐదేళ్లు అమలు చేస్తున్న పథకాలు చూసి అడుగుతున్న అక్కచెల్లమ్మలను మీరందరు మీ సహోదరుడికి రాఖి కట్టండి, మీ ప్రభుత్వానికి రక్షాబంధన్ కట్టండి.
మహిళాసాధికారతనిస్తు, అక్కచెల్లమ్మలను నడిపిస్తా ఉన్న వారి భవిష్యత్తు కోసం రక్షాబంధన్ కట్టండి అని కోరుతున్న. ప్రతి అక్కచెల్లమ్మను కోరుతా ఉన్న, ఒక్కసారి మీ బ్యాంక్ దగ్గరకి వెళ్లి మీ ఆకౌంట్ 10ఏళ్ల స్టేట్మెంట్ అడగండి, చంద్రబాబు హయంలో ఒక్క రూపాయైనా వచ్చిందా గమినించండి అని కోరుతున్నా, మీ బిడ్డ హయంలో కేవలం 58 నెలల్లోనే రూ. 2.70లక్షల అందించాం, ప్రతి ఖాతాలో లక్షలు లక్షలు కనిపిస్తాయి.
ఎంపీ, ఎమ్మెల్యేలను ఎన్నుకునే ఎన్నిక కాదు, రాష్ట్రంలో 2.5కోట్ల మంది అక్కచెల్లమ్మల భవిష్యతు, వారి పిల్లల భవిష్యతు నిర్ణయించే ఎన్నికులు.
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుటుందని గట్టిన మనకు, రైత వ్యతిరేక కూటమికి జరగుతున్న సంగ్రమం ఇది. రైతు భరోసాగా ఈ 58నెలలో ప్రతి రైతన్న చేతిలో రూ.13000 ఇస్తు ఏకంగా రూ. 67500 ప్రతి రైతన్న చేతిలో పెట్టం, అదే చంద్రబాబు హయంలో రూ. 87వేల కోట్ల రుణమాఫీ పేరిట మోసం చేసిన ఆయన మనస్తత్వం ఎలా ఉంది, ప్రతి రైతన్న చేతిలో రూ. 67500 పెట్టిన మీ బిడ్డ ప్రభుత్వం ఎలా ఉంది ఆలోచన చేయండి.
రైతన్నను రాజుగానే చుశాం, రైతన్నను గుండెల్లో పెట్టుకుని పరిపాలన చేసిన రైతు పక్షపాత ప్రభుత్వం మనది, ప్రతి రైతు భుజం తట్టి మీ వెంట తోడుగా మేమున్నామని ప్రభుత్వానికి చెప్పాలని కోరుతున్నా.
రైతులను మోసం చేయటమే పనిగా పెట్టుకున్న పార్టీలకు, వ్యవసాయం దంగా అన్నపార్టీలకు మద్దుతు ఇస్తారా, రైతన్న ముఖంలో చిరునవ్వులు చూడాలని, వ్యవసాయం పండుగుగా మార్చాలని, మీ రైతు బిడ్డ మీ భూమిపుత్రుడికి మద్దతు పలుకుతారా.
సామాజిక న్యాయం చేస్తు, ఆణగారిన వర్గాలకు నేను ఉన్న భరోసా ఇచ్చిన ప్రభుత్వం, నా అక్కచెల్లమ్మల ఖాతాల్లో నేరుగా రూ.2.70 లక్షల కోట్లు అందించాం. ఇందులో 75శాతం నా ఎస్సీ, నాఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలకే అందించాం, వైయస్ఆర్సీపీ ఒక సామాజిక ఇంధ్రధనుస్సు.
గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లీష్ మీడియం వద్దని అడుకున్న వారికి బుద్ధి చెప్పండి, పేదలకు ఇళ్లు ఇస్తుంటే కులాల సమతుల్యతకి అడ్డంకి పడుతుందని ఏకంగా కోర్టుల్లో కేసులు వేసిన పార్టీలకు సమాధులు కట్టండి, ఎస్సీల్లో ఎవరైన పుట్టాలనుకుంటరా అన్న వాళ్లకి రాజకీయ భవిష్యత్తు లేకుండా తీర్పును ఇవ్వండి, బీసీల తోకలు కత్తిరిస్తానన్న బాబు తోకను, బాబును సమర్థించే అనేక తోకలను మరోసారి కత్తిరించండి, మైనార్టీల రిజర్వేషన్ను పణంగా పెట్టండమే కాకుండా, మైనార్టీల మనోభవాలతో గత 30 ఏళ్ల చలగాటం ఆడుతున్న బాబును ఏ మైనార్టీ వ్యక్తి అయినా సమర్థించవచ్చా అని అడుగుతున్న.
ఈ నాలుగు వర్గాలు నేను నా.. నా.. నా అని పిలుచుకునే వర్గాలు…
చంద్రబాబుకు నా అని పిలుచుకునే వర్గాలు మన రాష్ట్రంలో అయితే లేవు, హైదరాబాదు హైటెక్ సీటీ వద్ద పచ్చమీడియా, దత్తపుత్రుడు.. వీళ్లేవరు మన రాష్ట్రంలో ఉండరు. చంద్రబాబు నాయుడుకు నా.. నా.. నా.. అని పిలిచుకునేవాళ్లు మన రాష్ట్రంలో ఎవరు లేరు.. ఇవన్ని ఆలోచనచేయమని కోరుతున్న.
ఈ చంద్రబాబు అనే వ్యక్తికి విలువలు లేవు, విశ్వసనీయత లేదు… ఆయన పేరు చెబితే గుర్తుకువచ్చేది మాత్రం వెన్నుపోట్లు,మోసాలు.
చంద్రబాబు పేరు చెబితే 2014లో పంపించిన ముఖ్యమైన హామీల్లో ఒకటి రైతుల రుణమాఫీ పై సంతకం చేస్తా అన్నాడు, చేశాడా? రెండవది పొదుపు సంఘాల రుణమాఫీ చేస్తామని చెప్పాడు, చేశాడా? ఆడుబిడ్డ పుట్టిన వెంటనే రూ. 25వేల బ్యాంకులో డిపాజిట్ చేస్తాని అన్నాడు, చేశాడా? నిరుద్యోగ భృత్తి ఇస్తానని అన్నాడు.. చేశాడా? సింగపూర్ కి మించి చేస్తా అన్నాడు.. చేశాడా?
ప్రతి జిల్లాలో హైటెక్ సీటీ కడతానని హామీ ఇచ్చాడు, మీ జిల్లాలో ఎదైన నగరం ఉందా? వీరందరు కలిసి ఇచ్చిన హామిల్లో ఒక్కటైనా చేశాడా? కనీసం ప్రత్యేక హోదా ఇచ్చాడా? ఇవేమి చేయకపోగ మళ్లి ఎన్నికలు వచ్చేసరికి ఇదే కూటమి, ఇదే ముగ్గురితో కలిసి సూపర్ సీక్స్, సూపర్ సెవన్ అంట, ప్రతి ఇంటి కేజీ బంగారం అంట, ప్రతి ఇంటికి బెంజీ కారు అంట.
ఇలాంటి మోసాలనుంచి మన రాష్ట్ర ప్రజల భవిష్యతును కాపాడుకోవాలి.. ఈ యుద్దంలో నేను సిద్ధం.. మీరంతా సిద్ధమేనా! ఇచ్చన మాట నిలబెట్టుకున్న మనకు, మాట తప్పటమే చంద్రబాబు కుటమి మధ్య జరుగుతున్న ఈ యుద్దంలో విలువలకు, విశ్వసనీయతకు మద్దతు పలకటానికి మీరంతా సిద్ధమేనా!
జరగబోయే ఈ ఎన్నికల కురక్షేత్రంలో మీలోని ప్రతి ఒక్కరు స్టార్ క్యాంపెయినర్లుగా బయటకి రావాలి, ప్రతి ఒక్కరికి జగనన్న ప్రభుత్వంలో జరిగిన మంచి గురించి, పేదవాడికి రక్ష జగనన్నే అని, చంద్రబాబు మోసాలను నమ్మోవద్దని, ఆ ఇంట్లోని ప్రతి అక్కను, అవ్వను స్టార్ క్యాంపెయినర్లుగా బయటికి తీసుకురావాలి.
మంచి చేశాం.. మంచి చూపించి ప్రజల వద్దకు వెళ్తున్నాం, మంచి జరిగిన ప్రతి ఇంట్లో నుంచి మీకు ఒకవేళ మంచి జరిగి ఉంటే మీ బిడ్డకోసం స్టార్ క్యాంపెయినర్లగా బయటికి రండి. మంచి చేశాం కాబట్టే మన టార్గెట్ 175/75ఎమ్మెల్యే, 25/25ఎంపీ స్థానాలు తగ్గకుండా రావాలి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
టీడీపీ అధినేత చంద్రబాబు నెల్లూరు జిల్లా కావలిలో ప్రజాగళం సభలో పాల్గొన్నారు. నెల్లూరు లోక్ సభ స్థానం టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కావలి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య వెంకట కృష్ణారెడ్డి కూడా సభకు హాజరయ్యారు. ఈ సభలో చంద్రబాబు ప్రసంగిస్తూ, ప్రజల ఉత్సాహం చూస్తుంటే ఎన్డీయే గెలుపు ఖాయంగా కనిపిస్తోందని అన్నారు. వైసీపీ నేతలకు డిపాజిట్లు కూడా రావని ఎద్దేవా చేశారు.
ఇవాళ టీడీపీ 42వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నామని, ఎన్టీఆర్… టీడీపీని స్థాపించిన గొప్ప రోజు ఇది అని అభివర్ణించారు. ఈ 42 ఏళ్లలో తెలుగువారిని ప్రపంచం మొత్తం పరిచయం చేశామని చెప్పారు. అనేక విజయాలు సాధించామని, జాతీయ స్థాయిలో ప్రతిపక్షంగా పనిచేయడమే కాకుండా, ప్రభుత్వాల ఏర్పాటుతో ముందుకు పోయామని చంద్రబాబు వివరించారు. హైదరాబాద్ నగరాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి తెలుగుజాతికి తిరుగులేదని నిరూపించగలిగాం అని తెలిపారు.
నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా నారా భువనేశ్వరి కృష్ణా జిల్లాలో పర్యటించారు. ఆవనిగడ్డ నియోజకవర్గం ఘంటసాల మండలం తాడేపల్లి గ్రామంలో భువనేశ్వరి పర్యటించారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ వార్త విని బాధతో మరణించిన కొడాలి సుధాకర్ రావు కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. సుధాకర్ రావు చిత్రపటానికి నివాళులర్పించారు భువనేశ్వరి. చంద్రబాబు భరోసా పత్రాన్ని బాధిత కుటుంబానికి అందజేశారు. ఎన్టీ రామారావు పేద ప్రజల కోసం చేసినట్లే… చంద్రబాబు కూడా పేద ప్రజల అభివృద్ధి కోసం పాటుపడుతున్నారని అన్నారు. చంద్రబాబు విజన్ 20-20 అన్నప్పుడు కొందరు విమర్శించారని, కానీ ఇప్పుడు ఆయన కట్టిన ఐటి కంపెనీలు లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నాయని అన్నారు. ఐటి శాఖ మంత్రిగా లోకేష్ ఉన్నప్పుడు అనేక కంపెనీలు తీసుకువచ్చాడని, కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే బాధ కలుగుతోందని భువనేశ్వరి తెలిపారు.
మొదటి షో నుంచే ‘టిల్లు స్క్వేర్’ సినిమాకి బ్రహ్మరథం పడుతున్న ప్రేక్షకులకు కృతఙ్ఞతలు: చిత్ర బృందం
‘టిల్లు స్క్వేర్'(Tillu Square Review) వంద కోట్లు వసూలు చేస్తుంది : చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ
2022లో విడుదలై ఘన విజయం సాధించిన ‘డీజే టిల్లు’ చిత్రానికి సీక్వెల్ గా రూపొందిన చిత్రం ‘టిల్లు స్క్వేర్'(Tillu Square). స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. భారీ అంచనాలతో ‘టిల్లు స్క్వేర్’ సినిమా నేడు(మార్చి 29) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లలో నవ్వులు పూయిస్తూ మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ తెచ్చుకున్న ఈ సినిమా సంచలన వసూళ్ల దిశగా దూసుకుపోతోంది. ఈ విజయానందంలో తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించిన చిత్ర బృందం తమ సంతోషాన్ని ప్రేక్షకులతో పంచుకున్నారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఈ సందర్భంగా కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda) మాట్లాడుతూ..
” ముందుగా నేను నిర్మాత నాగవంశీ గారికి, చినబాబు గారికి, త్రివిక్రమ్ గారికి థాంక్స్ చెప్పాలి. నన్ను నమ్మి, ఇలాంటి సబ్జెక్టుని నమ్మి, మంచి బడ్జెట్ తో ‘డీజీ టిల్లు’ చిత్రాన్ని రూపొందించారు. ఆ సినిమా ఘన విజయం సాధించింది. ఆ తర్వాత సీక్వెల్ అవకాశం కూడా ఇచ్చారు. టిల్లు స్క్వేర్ కి థియేటర్లలో మంచి స్పందన లభిస్తుండటం ఆనందం కలిగిస్తోంది. విడుదలకు ముందే ఈ సినిమా అదిరిపోతుంది అని నాకు తెలుసు. కానీ విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి ఆ మాట వినాలని ఆగాను. ఇప్పుడు చెబుతున్నాను ఈ సినిమా అదిరిపోయింది. దీనికి కారణమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.” అన్నారు.
కథానాయిక అనుపమ పరమేశ్వరన్(Anupama) మాట్లాడుతూ..
“ఆనందంలో మాటలు కూడా రావడంలేదు. ఈ సినిమా ప్రయాణాన్ని నేను ఎప్పటికీ మరిచిపోలేను. ఈ చిత్రం చేసే సమయంలో ప్రతి క్షణం ఎంజాయ్ చేశాను. ఇప్పుడు సినిమాకి మంచి స్పందన లభిస్తోంది. నా పాత్రకు కూడా ప్రశంసలు దక్కుతున్నాయి. నేను మొదటిసారి ఇలాంటి పాత్ర పోషించాను. అయినప్పటికీ నేను పోషించిన లిల్లీ పాత్ర నాకు మొదటి నుంచి నమ్మకం ఉంది. ఆ నమ్మకం నిజమై, ఇప్పుడు నా పాత్రకు వస్తున్న స్పందన చూసి సంతోషంగా ఉంది” అన్నారు.
దర్శకుడు మల్లిక్ రామ్ మాట్లాడుతూ..
“మొదటి షోకే అన్ని ప్రాంతాల నుంచి మంచి స్పందన లభిస్తోంది. మేము ముందు నుంచి అనుకున్నట్టుగానే.. సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకు ప్రేక్షకులు ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నారు.” అన్నారు.
నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. “ఈ సినిమా వంద కోట్ల గ్రాస్ వసూలు చేస్తుందనే నమ్మకం ఉంది. సినిమాకి మంచి టాక్ వస్తోంది. మార్నింగ్ షోకి, మ్యాట్నీకి వసూళ్లలో గ్రోత్ కనిపిస్తుంది. ఉగాది, రంజాన్ పండగలు, వేసవి సెలవులు ఉండటంతో ఈ సినిమా వంద కోట్లు వసూలు చేస్తుందనేని నమ్ముతున్నాను.” అన్నారు.
ఈ కార్యక్రమంలో కళ్యాణ్ శంకర్, రవి ఆంథోనీ, ప్రణీత్ రెడ్డి తదితరులు పాల్గొని తమ సంతోషాన్ని పంచుకున్నారు.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
జగన్ (Jagan) ను ఎలాగైనా గద్దె దించాలన్న ఏకైక లక్ష్యంతో టీడీపీ, బీజేపీ, జనసేనలు ఏకమయ్యాయి..
ఎన్నికల వేళ… ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు కొత్త లొల్లి మొదలైంది. కాదేదీ ప్రచారానికి అనర్హం అన్నట్లుగా మారింది అక్కడి పార్టీల పరిస్థితి. జగన్ (Jagan) ను ఎలాగైనా గద్దె దించాలన్న ఏకైక లక్ష్యంతో టీడీపీ, బీజేపీ, జనసేనలు ఏకమయ్యాయి. ఇప్పుడు కూటమి ప్రధానమైన ఓ అంశాన్ని తెరపైకి తెచ్చాయి. జగన్ హయాంలో అవినీతిపై ఫిర్యాదుల వెల్లువెత్తిందనేది వారు లెవనెత్తిన తాజా అంశం. దానికి వారు కొన్ని గణాంకాలు వెలువరిస్తున్నారు. కొన్ని నెలల క్రితం జగన్ సర్కారు అవినీతిపై ఫిర్యాదుల కోసం టో్ల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసింది. దానికి నాటి నుంచి ఇప్పటి వరకు అవినీతిపై 8,03,612 ఫిర్యాదులు అందాయట. అంటే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 14400 ఆగకుండా మోగుతోందన్నమాట.
అవినీతిపై సర్వత్రా ఆందోళన..
ఇక మంత్రులు, వారి పేషీలపై 2 లక్షల 6 వేల ఫిర్యాదులు ఉన్నాయట. ఇక ఎమ్మెల్యేల అవినీతిపై వచ్చిన ఫిర్యాదుల సంఖ్య మామూలుగా లేదు. వారిపై ఏకంగా 4 లక్షల 39 వేల ఫిర్యాదులు అందాయి. దీంతో ఉన్నత స్థాయిలో అవినీతిపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. ఏసీబీ అధికారులు ఉన్నది కింది స్థాయి ఉద్యోగులపై దాడులకు మాత్రమేనా? వారిపైనే ఏసీబీని ప్రయోగిస్తారా? అన్న అనుమానాలు వస్తున్నాయి. అంటే మంత్రులు, వారి పేషీలపై వచ్చిన ఫిర్యాదులను పట్టించుకోరా? అధికార పార్టీ నాయకులపై ఫిర్యాదులను వదిలేస్తారా? అన్నది ప్రధానమైన సందేహం. మరి అలాంటప్పుడు తన పాలనలో ఒక్క రూపాయి అవినీతి లేదన్న సీఎం వైఎస్ జగన్ మాటల్లో నిజమెంత? ఫిర్యాదులపై ఏటా మీడియాకు చెప్పే ఏసీబీ కొన్నాళ్లుగా ఎందుకు మౌనం వహిస్తోంది? ఏపీలో అవినీతిపై అహ్మదాబాద్ ఐఐఎం ఇచ్చిన నివేదికలో ఏముంది? అన్నది ఇపుడు చర్చనీయాంశంగా మారిపోయింది.
ఇది చదవండి : కుందుల పై ఘాటుగా స్పందించిన బూరుగుపల్లి…
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
తెలుగుదేశం పార్టీ పెట్టి నేటికి 42 సంవత్సరాలు | TDP 42nd Foundation Day…
మన “అన్న” స్వర్గీయ నందమూరి తారకరామారావు తెలుగుదేశం పార్టీ పెట్టి నేటికి 42 సంవత్సరాలు. బడుగుబలహీన వర్గాలకు, పెదలపాలిట పెన్నిధి, రైతన్నలకు అన్నదాత, తెలుగింటి ఆడపడుచులకు అన్న, కార్మికులకు అండగా నిలిచిన మన “అన్న” స్వర్గీయ నందమూరి తారకరామారావు 1982 మార్చ్ 29 వ తేదీన మన తెలుగు జాతి ఆత్మగౌరవాణాన్ని కపాడనికి పునార్జింప చేయాలనీ గుర్తింపు తీయాలని, నేను తెలుగోడిని తెలుగు బిడ్డను తెలుగుదేశం ఒక రాజకీయ పార్టీని స్థాపించిన తెలుగు ముద్దుల బిడ్డ మన అన్న ఎన్.టి.ఆర్, తెలుగుదేశం(TDP) పార్టీ ద్వారా.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది. ప్రాంతాలువేరైన మనందరం ఒక్కటేనన్న. కుల, మాత, ప్రాంతాలకు అతీతముగా మన తెలుగు గడ్డను అభివృద్ధిచేసిన తెలుగు ముద్దుల బిడ్డ, తెలుగు మొనగాడు మన అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. మన తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని యావత్ భారతదేశ శిఖరాలపై పెట్టిన ఘనత మన అన్న ఎన్.టి.ఆర్. మన తెలుగు దేశం పార్టీ వీరసైన్య కార్యకర్తలకు, నాయకులకు, తెలుగుదేశం జెడా మోసిన మోస్తున్న అభిమానులకు అందరికి పేరుపెరున తెలుగుదేశం పార్టీ 42 వ వార్షికోత్సవం సందర్భముగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేస్తూ.
మీ….
నందమూరి రామకృష్ణ.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
డెబ్భయి అయిదేళ్ల వయసు వచ్చినా కడియం శ్రీహరి (Kadiam Srihari) కుట్రలు, కుతంత్రాలను మానుకోలేదు – దాస్యం వినయ్ భాస్కర్ (Vinay Bhaskar)
డెబ్భయి అయిదేళ్ల వయసు వచ్చినా కడియం శ్రీహరి (Kadiam Srihari) కుట్రలు, కుతంత్రాలను మానుకోలేదని బీఆర్ఎస్ నేత దాస్యం వినయ్ భాస్కర్ (Vinay Bhaskar) అన్నారు. వరంగల్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. గత ఎన్నికల్లో స్టేషన్ ఘన్పూర్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యను తప్పించి సీటు ఇచ్చినా విశ్వాసం లేదన్నారు. కడియం శ్రీహరి ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. కులాన్ని అడ్డం పెట్టుకని పబ్బం గడుపుతున్నారన్నారు. ఒక ప్యాకేజీ మాట్లాడుకుని రాత్రికి రాత్రి కాంగ్రెస్ పార్టీలోకి మారుతున్నారన్నారు.
కడియం శ్రీహరి ఒక నమ్మక ద్రోహి…
కడియం శ్రీహరి ఒక నమ్మక ద్రోహి అని అన్నారు. కడియం శ్రీహరి వల్ల ఎందరో నేతలు బలి పశువులయ్యారన్నారు. పార్టీ అగ్రనాయకత్వాన్ని నమ్మించి మోసం చేయడం కడియానికి వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు. గతంలో చంద్రబాబును బ్లాక్ మెయిల్ చేసి పదవులు పొందారన్నారు. ఇప్పుడు కూడా తన రాజకీయ భవిష్యత్ కోసం పదేళ్ల నుంచి తనను ఆదరించిన పార్టీని కాదని కాంగ్రెస్ లో చేరుతూ ప్రజాస్వామ్యాన్ని మంటగలుపుతున్నారంటూ వినయ్ భాస్కర్ కడియంపై ఫైర్ అయ్యారు.
ఇది చదవండి : ఓటు హక్కును వినియోగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
అమరావతి,
నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) కామెంట్స్
సీఎం ఎన్నికల ప్రచారంలో 130 సార్లు బటన్ నొక్కి నా ఒక్క రూపాయి అవినీతి జరగలేదని చెప్పడం హాస్యస్పదంగా ఉంది. రోజు మీడియా లో వస్తున్న అవినీతికి సమాధానం చెప్పాలి, అవినీతి నిరోధక శాఖ ఒక టోల్ ఫ్రీ నెంబర్ 14400, 8,03,612 ఫిర్యాదులు వచ్చాయి. 2,16,803 ఫిర్యాదులు మంత్రులు, పేశీల పై వచ్చాయి. 4,39,679 ఎమ్మెల్యే లపై వచ్చిన అవినీతి ఫిర్యాదులు వచ్చాయి. వీటిపై ఏం చర్యలు తీసుకున్నారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఏటా ఫిర్యాదులపై మీడియాకు చెప్పే అధికారులు గత కొంతకాలంగా వివరాలు చెప్పడం లేదు, సీఎం సమీక్ష సమావేశం లో ఏసీబీ డీజి ఎవరు అనే అడిగే స్థితిలో ఉన్నారు. ఉపాధ్యాయుల బదిలీల్లో కోట్ల రూపాయల కుంభ కోణం జరిగింది. డీజీపీ వీటిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు. ఇప్పటికైనా ఏసీబీ అధికారులు. ఎన్ని కేసులు వచ్చాయో వెల్లడించాలి. ఇంత అవినీతి జరిగితే ప్రజలకు అబద్ధాలు చెప్పడాన్ని ఖండిస్తున్నాం.
అధికారం మొత్తం కొంత మంది చేతుల్లోనే పవర్స్ ఉన్నాయి. ఈసీ దీనిపై దృష్టి సారించాలి. పవన్ కళ్యాణ్(Pavan Kalyan) 30 నుంచి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. వచ్చే నెల 10 వరకు మొదటి విడతలో నిర్వహించే ప్రచారంలో పాల్గొంటారు. తెనాలి, నెల్లిమర్ల, అనకాపల్లి, రాజోలు, రాజానగరం లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. ఏపీ లో జరిగిన అవినీతిపై అహ్మాడాబాద్ ఐఐఎం ఇచ్చిన నివేదికను బుట్ట దాఖలు చేసింది. తమ ప్రభుత్వం అధికారంలో కి రాగానే కుంభ కోనాలపై చర్యలు తీసుకుంటాం.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి