Sunday, September 13, 2026
News Navigation
Sunday, September 13, 2026
News Navigation

Breaking

Sunday, September 13, 2026
Home Andhra Pradesh జగన్‌ పై చంద్రబాబు ఓపెన్ ఛాలెంజ్

జగన్‌ పై చంద్రబాబు ఓపెన్ ఛాలెంజ్

by Satya
Chadrababu and jagan

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. జగన్ వీడియోను పెట్టి చర్చకు సిద్దమా అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. సామాజిక న్యాయానికి నిలువునా శిలువ వేసి.. బాదుడు పాలనతో ప్రజల రక్తం పీల్చేసి.. విధ్వంస పోకడలతో రాష్ట్ర భవిష్యత్‌ను కూల్చేసి.. ఇప్పుడు నువ్వు ర్యాంప్ వాక్ చేసి అబద్ధాలు చెబితే ప్రజలెలా నమ్ముతారు జగన్ రెడ్డీ?’ అంటూ ప్రశ్నించారు. ‘నీకు, నీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభం అయ్యింది.. ఇంకా 50 రోజులే. రెక్కలు ఊడిపోయిన ఫ్యాన్ ని విసిరిపారేయడానికి జనం సిద్ధంగా ఉన్నారు అంటూ మండిపడ్డారు. వరం ఇచ్చిన శివుడినే బూడిద చేయాలనుకున్న భస్మాసురుడి గతే జగన్‌కు పడుతుందన్నారు. బూటకపు ప్రసంగాలు కాదు.. అభివృద్ది పాలన ఎవరిదో.. విధ్వంసం ఎవరిదో జనం ముందు చర్చిద్దాం.. దమ్ముంటే తనతో బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు. ‘ప్లేస్, టైం.. నువ్వే చెప్పు. ఎక్కడికైనా వస్తా.. దేనిమీదైనా చర్చిస్తా. నువ్వు సిద్ధమా జగన్ రెడ్డీ!’అని ప్రశ్నించారు.

Read Also..

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.
    ఏపీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా పర్యటిస్తున్నారు. విజయవాడకు చేరుకున్న కేంద్రమంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో వైద్య మౌలిక వసతులను మరింత బలోపేతం చేసే దిశగా కీలక కార్యక్రమాలకు నడ్డా…
  • ఏపీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్‌.
    ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రెండు డీఏలను విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన డీఏలను సెప్టెంబరు నెల జీతంతో కలిపి చెల్లించాలని ఆదేశించింది. 2025 జనవరి 1 నుంచి 1.82 శాతం…
  • ఏపీకి భారీ వర్షసూచన.. 9 జిల్లాలకు అలర్ట్.
    ఏపీలో వాతావరణశాఖ భారీ వర్షాలపై హెచ్చరికలు జారీ చేసింది. రెండు రోజులపాటు తొమ్మిది జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. విశాఖ, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఆయా ప్రాంతాల్లో…

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: