బీఆర్ఎస్(BRS) సిద్దిపేట(Siddipeta) ఎమ్మెల్యే హరీష్ రావు(MLA Harish Rao)కు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రతి సవాల్ విసిరారు. అగస్ట్ 15వ తేదీలోగా రుణమాఫీ చేస్తే.. బీఆర్ఎస్ ను రద్దు చేసుకుంటావా? అంటూ సవాల్ విసిరారు. తాను మాటిస్తే ఎలా ఉంటుందో నీకంటే నీ మామ కేసీఆర్ కు బాగా తెలుసునని వ్యాఖ్యానించారు. మంగళవారం కొడంగల్‌లో కార్యకర్తల సమావేశంలో సీఎం పాల్గొన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ‘హరీశ్ రావు నాకు సవాల్ విసిరారు. పంద్రాగస్ట్ లోగా రుణమాఫీ చేయకుంటే రాజీనామా చేస్తావా? అని అడిగారు. మరి నేను రుణమాఫీ చేస్తే నువ్వు నీ పార్టీని రద్దు చేసుకుంటావా? నా సవాల్‌ను స్వీకరించు. భూమితలకిందులైనా… కేసీఆర్ ఫామ్ హౌస్(KCR Farm House)లో ఉరేసుకొని సచ్చినా తాను రుణమాఫీ చేస్తా.. ఆ సవాల్‌ను స్వీకరిస్తావా?’ అని ప్రతి సవాల్ విసిరారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- కొండా సురేఖకు బుజ్జగింపులు.తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షి నటరాజన్, మాజీ మంత్రి కొండా సురేఖకు ఫోన్ చేసి మాట్లాడారు. ఇటీవల పార్టీలో, రాష్ట్ర రాజకీయాల్లో చోటుచేసుకున్న పరిణామాలపై మీనాక్షి నటరాజన్ ఆరా తీసినట్లు తెలుస్తోంది.…
- ఫసల్ బీమా యోజన అమలుపై పాయల్ శంకర్ నిరసన.తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఫసల్ బీమా యోజన అమలుపై బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ వినూత్న నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను తెలంగాణలో కూడా అమలు చేయాలంటూ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు.…
- తెలంగాణలో ఆర్టిఫిషియల్ పనీర్‌పై నిషేధం.తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అనలాగ్, నాన్ డెయిరీ, ఆర్టిఫిషియల్ పనీర్‌పై ఏడాది పాటు నిషేధం విధించింది. ప్రజారోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీజీ సేఫ్ వెల్లడించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి