మేడ్చల్ జిల్లా పట్టణంలో రహస్య సమాచారం ఆధారంగా పోలీసులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించిన ఘటన వెలుగులోకి వచ్చింది. అక్రమ ఆయుధాలు కలిగి ఉండటం, అలాగే దేశ వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించి అనుమానాస్పదంగా ప్రవర్తిస్తున్నాడన్న ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.ప్రాథమిక విచారణలో నిందితుడు జయీద్ ఖాన్‌గా గుర్తించబడ్డాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గజియాబాద్‌కు చెందిన ఇతడు మేడ్చల్‌లోని ఓ ముబారక్ హోటల్‌లో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇతడు సోషల్ మీడియా వేదికగా అనుమానాస్పద వ్యక్తులతో సంబంధాలు కొనసాగిస్తున్నాడని పోలీసులు గుర్తించినట్లు తెలిపారు. ప్రత్యేకంగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కొన్ని గ్రూపులతో కాంటాక్ట్‌లో ఉండి, ఆయుధాల సేకరణపై ఆసక్తి చూపుతున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైనట్లు తెలుస్తోంది.
మేడ్చల్ జిల్లాలో రహస్య సమాచారం ఆధారంగా ఓ వ్యక్తి అరెస్ట్ …
68
previous post





Total views : 91124