Tuesday, June 2, 2026
News Navigation
Tuesday, June 2, 2026
News Navigation

Breaking

Tuesday, June 2, 2026
Home Crime అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఔషధ నియంత్రణ శాఖ తనిఖీలు..

అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఔషధ నియంత్రణ శాఖ తనిఖీలు..

by CVR NEWS
అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఔషధ నియంత్రణ శాఖ తనిఖీలు

అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో ఔషధ నియంత్రణ శాఖ అధికారుల తనిఖీలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. అధికారులు తనిఖీలకు వస్తున్నారన్న సమాచారం ముందుగానే లీక్ కావడంతో పట్టణంలోని పలువురు మెడికల్ షాపుల యజమానులు షాపులను మూసివేయడం అనుమానాలకు తావిస్తోంది. నిబంధనల ప్రకారం నడిచే మెడికల్ షాపులు అయితే తనిఖీలకు భయపడాల్సిన అవసరం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. గత తనిఖీలలో ఓ ప్రైవేట్ నర్సింగ్ హోమ్‌లో గుర్తించిన బ్లడ్ బ్యాగుల వ్యవహారం ఏమైందన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అసిస్టెంట్ డైరెక్టర్ వీర కుమార్ రెడ్డి, డ్రగ్ ఇన్‌స్పెక్టర్ కేశవరెడ్డి నేతృత్వంలో ఔషధ నియంత్రణ శాఖ అధికారులు తాడిపత్రిలో తనిఖీలు నిర్వహించారు. స్టేట్ లిమిట్స్ పరిధిలో ఉన్న మెడికల్ షాపుల సర్టిఫికెట్ల పరిశీలనలో భాగంగా ఈ తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. అయితే అధికారులు వస్తున్నారన్న సమాచారం ముందుగానే తెలిసిందో, లేక ఇతర కారణాలో తెలియదు కానీ.. పట్టణంలోని అనేక మెడికల్ షాపులు ఒక్కసారిగా షట్టర్లు దించేయడం చర్చకు దారితీసింది.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

019508
Total views : 90869

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.