Friday, August 28, 2026
News Navigation
Friday, August 28, 2026
News Navigation

Breaking

Friday, August 28, 2026
Home Crime పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్.

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్.

by CVR NEWS
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒంటరి మహిళలే లక్ష్యంగా చైన్ స్నాచింగ్‌లు, తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న పులపాకుల తులసి, కామాక్షి దుర్గాప్రసాద్‌లను శివాలయం బ్రిడ్జి వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఆదేశాలతో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు.. నిందితుల నుంచి రూ.3.25 లక్షల విలువైన 20 గ్రాముల బంగారు మంగళసూత్రం, 425 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. ప్రజలు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: