Friday, July 17, 2026
News Navigation
Friday, July 17, 2026
News Navigation

Breaking

Friday, July 17, 2026
Home Andhra Pradesh అన్నమయ్య జిల్లాలో అంతర్రాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్.

అన్నమయ్య జిల్లాలో అంతర్రాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్.

by CVR NEWS
అన్నమయ్య జిల్లాలో అంతర్రాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్

అన్నమయ్య జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు మరోసారి ఉక్కుపాదం మోపారు. రాయచోటిలోని పాత ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి కేసు వివరాలను వెల్లడించారు.ఈ నెల 7న రామాపురం మండలంలో గంజాయి తరలిస్తున్న గాలివీడు మండలానికి చెందిన కమలాకర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని విచారణలో అంతర్రాష్ట్ర గంజాయి ముఠా గుట్టు రట్టయిందని ఎస్పీ తెలిపారు.దీంతో బీహార్‌కు చెందిన ప్రకాష్, విశాఖపట్నానికి చెందిన బోడన్నా, రాయచోటికి చెందిన ఖాదర్‌బాషాలను రామాపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఒడిశా నుంచి అరకు మీదుగా గంజాయిని తీసుకొచ్చి అన్నమయ్య జిల్లాతో పాటు బెంగళూరులో విక్రయిస్తున్నట్లు విచారణలో తేలిందని ఎస్పీ వెల్లడించారు.
పోలీసుల కళ్లుగప్పేందుకు పోర్టర్ యాప్‌ను వినియోగిస్తూ కొనుగోలుదారులకు సమాచారం చేరవేసి గుట్టుచప్పుడు కాకుండా గంజాయి విక్రయాలు నిర్వహిస్తున్నట్లు దర్యాప్తులో బయటపడిందన్నారు. ఈ వ్యవహారంపై కర్ణాటక పోలీసుల నుంచి కూడా సమాచారం అందినట్లు తెలిపారు.నిందితుల వద్ద నుంచి సుమారు రూ.60 లక్షల విలువైన 6 కిలోల గంజాయి, ఐదు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు.అంతర్రాష్ట్ర గంజాయి ముఠాను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన లక్కిరెడ్డిపల్లె సర్కిల్ పోలీసు అధికారులు, సిబ్బందిని నగదు బహుమతులతో అభినందించారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

040820
Total views : 211862

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: