నాగాయలంక మండలం భావదేవరపల్లిలో కొడుకు తండ్రిని హత్య చేశాడు. గ్రామానికి చెందిన 25 ఏళ్ళ బండే పవన్ కళ్యాణ్ తన తండ్రి బండే హరిమోహనరావు (50) ని హత్య చేసి మృత దేహాన్ని మంచంపై ఉంచి తగలబెట్టాడు. శుక్రవారం రాత్రి ఏడున్నర సమయంలో చంపి మంచం మీద వేసి నిప్పంటించిచినట్లు సమాచారం, చుట్టుపక్కల వారు చూసి మంటను అదుపు వేశారు. ఆస్తి తగాదాలతో ఈ హత్య చేసి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. అవివాహితుడైన పవన్ కళ్యాణ్ తాపీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అవనిగడ్డ Ci ఎల్ .రమేష్ మాట్లాడుతూ ముద్దాయికి గతంలో కూడా నేర చరిత్ర ఉందని తెలిపారు. నిన్న రాత్రి డీజిల్ పోసి తగలబెట్టాడని ప్రాథమిక నిర్ధారణ లో తెలిపారు. ఈ కేసును పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Crime
కడప జిల్లా.. జమ్మలమడుగు నియోజకవర్గం పరిధిలోని ముద్దనూరు మండలం చింతకుంట గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి చెందగా 15 మంది త్రీవంగా గాయపడ్డారు. కొండాపురం నుంచి వేంపల్లి వెళ్తున్న రెండు పెళ్లి బస్సులు ఒకదాని వెనుక ఒకటి ఢీకొన్నాయి. దీంతో పెళ్లి బృందంలోని ఒక వ్యక్తి అక్కడికి అక్కడే మృతి చెందగా 15 మందికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆహార కల్తీలో హైదరాబాద్ యావత్ దేశంలో తొలి స్థానంలో నిలిచింది. నగరంలో ఆహార కల్తీ అధికంగా ఉందని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడైంది. 2022లో దేశ్యాప్తంగా 19 నగరాల్లో 291 కల్తీ ఆహారం కేసులు నమోదు కాగా ఒక్క హైదరాబాద్లోనే 246 కేసులు బయటపడ్డాయి. దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో హైదరాబాద్ వాటా 84 శాతంగా ఉందని ఎన్సీబీ గణాంకాలు చెబుతున్నాయి. కాగా, ఈ కేసుల్లో నిందితులపై ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
కరీంనగర్–వరంగల్ జాతీయ రహదారిపై శంకరపట్నం మండలం తాటికల్ వద్ద తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును ఎదురుగా దూసుకొచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. మృతులు భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Also..
గుర్తు తెలియని వాహనం ఢీకొని కామారెడ్డి జిల్లాలో చిరుత మృతి చెందింది. సదాశివనగర్ మండలం కల్వరాల్ అటవీ ప్రాంతంలో వాహనం ఢీకొట్టడంతో రోడ్డు దాటుతున్న చిరుతపులి అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు గమనించి ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అటవీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని చిరుతను పోస్ట్ మార్టం నిమిత్తం కామారెడ్డి జిల్లా రేంజ్ కార్యాలయానికి తరలించారు. మృతి చెందిన చిరుత సుమారు రెండు సంవత్సరాల వయస్సు గల ఆడ చిరుతగా గుర్తించినట్లు కామారెడ్డి ఫారెస్ట్ రేంజ్ అధికారి రమేష్ తెలిపారు. నీరు త్రాగడానికి చిరుత రోడ్డు దాటుతుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోందని తెలిపారు.
Read Also..
Read Also..
మద్యం మత్తులో ముగ్గురు యువకులు రాకేష్ అనే వ్యక్తి ని హత్య చేశారని వరంగల్ ఏసిపి బోనాల కిషన్ తెలిపారు. వరంగల్ నగరంలోని చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయం ముందు ఈనెల 5వ తేదీన రాత్రి చెందిన రాకేష్ అనే వ్యక్తి మరో మహిళతో వంటలు చేసేందుకు తొర్రూరు వెళ్తున్న క్రమంలో వరంగల్ గరీబ్ నగర్ కు చెందిన ముగ్గురు యువకులు శ్రీధర్, బన్నీ, ఇస్లావత్ ప్రవీణ్ రాత్రి ఆటోలో అటుగా వెళ్లి రాకేష్ తో ఉన్న మహిళను లైంగికంగా వేధించారు. దీంతో రాకేష్ ప్రతిఘటించడంతో ముగ్గురు యువకులు అతనిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దాడిని గమనించిన స్థానికులు రాకేష్ ను చికిత్స నిమిత్తం ఎంజీఎం హాస్పిటల్ కి తరలించారు. రాకేష్ 13వ తేది రాత్రి మృతి చెందాడు. రాకేష్ హత్యకు కారణమైన ముగ్గురిని అరెస్ట్ చేశామని వారి నుండి హత్యకు ఉపయోగించిన రాళ్లు సేకరించామని వారిని కోర్టులో హాజరు పర్చనున్నట్లు వరంగల్ ఏసిపి బోనాల కిషన్ తెలిపారు.
పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడలో రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జి మృతి చెందారు. ఏలూరు నుండి భీమవరం వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ ప్రయాణిస్తున్న కారుకు ఎదురుగా వస్తున్న కారు అదుపుతప్పి వీరు కారు ను ఢీకొనడంతో ప్రమాదానికి గురైనట్లు తెలుస్తుంది. ఘటన స్థలంలో ఎమ్మెల్సీ మృతిచెందగా సీసీకి, గన్మెన్ కి గాయాలయ్యాయి. భీమవరం వర్మ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించనున్నట్లు తెలుస్తుంది. జిల్లా కలెక్టర్, ఎస్పీ ఆసుపత్రికి చేరుకోనున్నారు.
Read Also..
ఏలూరు శివారు జాతీయ రహదారిపై దోపిడీలకు పాల్పడుతున్న ఐదుగురు యువకులు, ఇద్దరు మైనర్లను పెదపాడు పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో ఏలూరులోని రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద నిందితులను మీడియా ముందు ప్రవేశ పెట్టారు డీఎస్పీ అశోక్ కుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ రహదారి వెంబడి నిందితులు అనేక దారి దోపిడీలకు పాల్పడినట్లు తెలిపారు. వారి వద్ద నుండి 2 ఆటోలు, 2 బైక్ లు, 2వేల 200 నగదును రికవరీ చేసినట్లు వెల్లడించారు. రెండు రోజుల క్రితం కలపర్రు టోల్ ప్లాజా వద్ద రాత్రి సమయంలో రోడ్డు పక్కన ఆపి ఉన్న లారీ డ్రైవర్ను కత్తితో బెదిరించి దోపిడీకి పాల్పడ్డారని బాధితుడు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు.
ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం ఇంటేక్ వెల్ వద్ద తమ బంధువుల అంత్యక్రియలో భాగంగా గోదావరి స్నానానికి వెళ్లిన రాంశెట్టీ రాము (22) అనే యువకుడు ప్రమాదవశాత్తు గోదావరిలో గల్లంతు అయ్యాడు. దగ్గరలో ఉన్న స్నేహితులు పరుగెత్తి కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ లోతులోకి వెళ్లిపోయాడని స్నేహితులు చెప్తున్నారు. బంధువులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పడవల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం అయితే గజ ఈతగాళ్ల తో గాలింపు చర్యలు జరుగుతున్నాయి.