Monday, May 18, 2026
News Navigation
Monday, May 18, 2026
News Navigation

Breaking

Monday, May 18, 2026
Home Latest News ఫార్ములా-ఈ రేసు రద్దుకు కారణం ఇదే..!

ఫార్ములా-ఈ రేసు రద్దుకు కారణం ఇదే..!

by Rama
E- Race

హైదరాబాద్ లో వచ్చే నెల జరగాల్సిన ఫార్ములా-ఈ రేసు రద్దయిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడం వల్లే రేసును రద్దు చేసినట్టు నిర్వాహకులు వెల్లడించారు. రేసు రద్దుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ.. రేవంత్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇది నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న దుర్మార్గమైన, తిరోగమన నిర్ణయమని ఆయన అన్నారు. హైదరాబాద్ ఈ-ప్రిక్స్ వంటి ఈవెంట్ లు హైదరాబాద్ తో పాటు దేశం బ్రాండ్ ఇమేజ్ ను పెంచుతాయని చెప్పారు. ఇండియాకు ఈ-ప్రిక్స్ ని తీసుకురావడానికి తాము ఎంతో కృషి చేశామని, చాలా సమయాన్ని వెచ్చించామని తెలిపారు. హైదరాబాద్ ను పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చేందుకు కేసీఆర్ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని చెప్పారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉత్పత్తిదారులు, స్టార్టప్ లు హైదరాబాద్ ను పెట్టుబడులకు అనువైన ప్రదేశంగా గుర్తించాయని తెలిపారు. ఇందులో భాగంగానే తెలంగాణ మొబిలిటీ వ్యాలీని ఏర్పాటు చేశామని అన్నారు.

Read Also..

Advertisements

You may also like

Our Visitor

014243
Total views : 79608

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.