Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home Latest News జగ్గన్నపేట ప్రజలకు శుభవార్త – ఎమ్మెల్యే సీతక్క

జగ్గన్నపేట ప్రజలకు శుభవార్త – ఎమ్మెల్యే సీతక్క

by Satya
Mulugu MLA Sitakka

మంత్రి, ములుగు ఎమ్మెల్యే సీతక్క స్వగ్రామం జగ్గన్నపేట ప్రజలకు శుభవార్త. త్వరలోనే ఈ గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం అందుబాటులోకి రాబోతోంది. బస్సు నడిపేందుకు ఆ రూట్‌ను ఆర్టీసీ బుధవారం పరిశీలించింది. వరంగల్-2 డిపోకు చెందిన అధికారులు సర్వే నిర్వహించారు. త్వరలోనే బస్సు నడిపిస్తామని వరంగల్‌-2 డిపో మేనేజర్‌ సురేశ్‌ తెలిపారు. పత్తిపల్లి-పొట్లాపూర్‌ మార్గంలో బస్సు సర్వీసును అందుబాటులోకి తీసుకొస్తామని, ఈ మేరకు ఆ రూట్‌లో సర్వే పూర్తి చేశామని వివరించారు. కాగా మంత్రి సీతక్క సొంత గ్రామం జగ్గన్నపేట ములుగు జిల్లా ఉంది. ఈ గ్రామానికి రోడ్డు మార్గం ఉన్నప్పటికీ ఆర్టీసీ ప్రస్తుతం బస్సులు నడపటం లేదు. ‘మహాలక్ష్మి’ పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్న నేపథ్యంలో జగ్గన్నపేట గ్రామానికి బస్సులు నడపకపోవడంపై స్థానికంగా చర్చ జరిగింది. ఈ మేరకు మీడియాలో కథనాలు కూడా వచ్చాయి. ఈ విషయం ఆర్టీసీ అధికారుల దృష్టికి వెళ్లడంతో స్పందించారు. దీంతో ఎట్టకేలకు తమ గ్రామానికి బస్సు సౌకర్యం రాబోతోందని జగ్గన్నపేట గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read Also..

Read Also..

Advertisements

You may also like

Our Visitor

013955
Total views : 78685

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.