Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home National నా వయసు 83 ఏళ్లు.. అందుకే ఈ నిర్ణయం..!

నా వయసు 83 ఏళ్లు.. అందుకే ఈ నిర్ణయం..!

by Satya
Mallikarjuna Kharge

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే(Mallikarjuna Kharge) ఈసారి ఎన్నికల బరి నుంచి దూరం జరిగారు. 2009 ఎన్నికల్లో కర్ణాటకలోని గుల్బార్గా నుంచి లోక్‌సభకు ఎన్నికైన ఆయన గత ఎన్నికల్లో అదే స్థానం నుంచి ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని తెలిపారు. ఎందుకలా? అన్న ప్రశ్నకు తన వయసును ప్రస్తావించారు. తన వయసు ఇప్పుడు 83 సంవత్సరాలని, అందుకనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. అయితే, కార్యకర్తలు కనుక పోటీ చేయాల్సిందేనని పట్టుబడితే మాత్రం చెయ్యక తప్పదని పేర్కొన్నారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

సీనియర్లు పోటీ నుంచి తప్పుకుంటున్నారన్న వార్తల్లో నిజం లేదని, ఇప్పుడు తన వయసు 83 సంవత్సరాలని, అందుకనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. కొన్నిసార్లు ముందుండి నడిపిస్తే, మరికొన్ని సార్లు వెనక ఉండి నడిపించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. తమకు అందిన జాబితాలో ఒకే స్థానం నుంచి పోటీకి పదేసిమంది రెడీగా ఉన్నారని వివరించారు. బీజేపీ గ్యారెంటీలపై అడిగిన ప్రశ్నకు ఖర్గే బదులిస్తూ.. బీజేపీ తమ గ్యారెంటీలను చోరీ చేసిందని విమర్శించారు. కర్ణాటక ఎన్నికల్లో గ్యారెంటీలు ప్రారంభించి గెలిచామని, ఆ తర్వాత అవే గ్యారెంటీలతో తెలంగాణలోనూ విజయం సాధించామని గుర్తుచేశారు. ఇప్పడు మా ఈ గ్యారెంటీలను మోదీజీ చోరీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

ఇది చదవండి: సికింద్రాబాద్​-విశాఖ మధ్య రెండో వందే భారత్​ ఎక్స్​ప్రెస్


భోజ్‎శాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు
మధ్యప్రదేశ్‍లో భోజ్ శాల ఆలయ కేసులో కీలక తీర్పు వెలువడింది. వివాదాస్పద స్థలం ఆలయానికే చెందుతుందని …
జూన్ 21న నీట్ రీ ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు ఎన్‍టీఏ ప్రకటన..
దేశవ్యాప్తంగా వివాదాలకు కేంద్రబిందువైన నీట్ యూజీ 2026 పరీక్షపై కీలక అప్డేట్ వెలువడింది. ప్రశ్నపత్రం లీకేజీ, …
యూపీలో గాలివాన బీభత్సం..
యూపీలో గాలివాన సృష్టించిన బీభత్సంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. పలు ప్రాంతాల్లో జరిగిన వేర్వేరు …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

013883
Total views : 78287

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.