Sunday, June 14, 2026
News Navigation
Sunday, June 14, 2026
News Navigation

Breaking

Sunday, June 14, 2026
Home Health ఈ ఆహారం తింటే దగ్గు, జలుబు చిటికెలో మాయం

ఈ ఆహారం తింటే దగ్గు, జలుబు చిటికెలో మాయం

by Satya
Cough, cold

శీతాకాలంలో సీజనల్ వ్యాధులు రావడం చాలా కామన్. అయితే కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవడంద్వారా వాటి నుంచి బయటపడవచ్చని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. డ్రైఫ్రూట్స్ తినడం చాలా మంచిది. వీటిని తినడంవల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. అలాగే శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో ఖర్జూరం సహాయపడుతుంది. శీతాకాలంలో వీటివల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. కాల్షియం, మినరల్స్, ఐరన్, ఫాస్పరస్, అమినో యాసిడ్స్ వంటివి అధికంగా ఉంటాయి. ఖర్జూరం తింటే జలుబు, దగ్గు రావు. శీతాకాలంలో జలుబు, దగ్గు చేయడం సహజం. అయితే రోజుకు రెండుకానీ మూడుకానీ ఖర్జూరాలను పాలల్లో కలిపి తీసుకుంటే వీటినుంచి ఉపశమనం పొందొచ్చు. జీర్ణక్రియ కూడా ఆరోగ్యవంతంగా పనిచేస్తుంది. తరుచుగా మలబద్దకంతో బాధపడేవారు వీటిని తీసుకోవాలి. వీటిల్లో అధిక మొత్తంలో పీచు లభిస్తుంది. జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచడంలో తోడ్పడుతుంది. ఈ కాలంలో మోకాళ్ల నొప్పులు సర్వసాధారణమయ్యాయి. ఖర్జూరాన్ని ప్రతిరోజూ తీసుకోవడంద్వారా కొంత ప్రయోజనం పొందొచ్చు. ఖర్జూరంలో కాల్షియం, సెలీనియం, మాంగనీస్ మొదలైన పోషకాలుంటాయి. అంతేకాదు ఎముకలను దృఢంగా ఉంచేందుకు తోడ్పడుతుంది. అలాగే చర్మ సమస్యలు కూడా తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఖర్జూరం వల్ల ఇంకా ఎన్నో అనారోగ్యాలు నయమవుతాయి.

Advertisements

You may also like

Our Visitor

023314
Total views : 141750

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.