Friday, July 17, 2026
News Navigation
Friday, July 17, 2026
News Navigation

Breaking

Friday, July 17, 2026
Home International అమెరికాలో నమోదైన క్రిమినల్‌ కేసు నుంచి గౌతమ్‌ అదానీకి అతి త్వరలోనే విముక్తి లభించబోతున్నట్లు సమాచారం…

అమెరికాలో నమోదైన క్రిమినల్‌ కేసు నుంచి గౌతమ్‌ అదానీకి అతి త్వరలోనే విముక్తి లభించబోతున్నట్లు సమాచారం…

by CVR NEWS
అమెరికాలో నమోదైన క్రిమినల్‌ కేసు నుంచి గౌతమ్‌ అదానీకి అతి త్వరలోనే విముక్తి లభించబోతున్నట్లు సమాచారం.

అమెరికాలో నమోదైన క్రిమినల్‌ కేసు నుంచి గౌతమ్‌ అదానీకి అతి త్వరలోనే విముక్తి లభించబోతున్నట్లు సమాచారం. అదానీపై ఆరోపణలను అమెరికా న్యాయశాఖ ఈ వారంలోగా ఉపసంహరించుకోబోతోందని అంతర్జాతీయ పత్రికలు కథనాలు ప్రచురించాయి. యూఎస్‌ సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌ (యూఎస్ సెక్‌) కూడా అదానీ, ఇతరులపై 2024 నవంబరులో నమోదు చేసిన మోసం కేసును కూడా సెటిల్‌ చేసుకోనుందని తెలుస్తోంది. అయితే, అదానీ గ్రూప్‌పై సెక్‌ కొంత జరిమానా విధించే అవకాశాలు కన్పిస్తున్నాయి. అదానీ గ్రీన్‌ ఎనర్జీ నుంచి సౌర విద్యుత్‌ సరఫరా ఒప్పందాలు చేసుకునేందుకు ఏపీ సహా నాలుగు రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారులకు 25 కోట్ల డాలర్ల మేరకు లంచాలు ఇచ్చారనే ఆరోపణలపై అదానీ గ్రూప్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదానీ, సాగర్‌ అదానీ సహా 8 మందిపై అమెరికాలో కేసు నమోదైంది. లంచాల సొమ్ము పోగేసేందుకు అదానీ గ్రీన్‌ ఎనర్జీ తన ప్రాజెక్టుపై తప్పుడు సమాచారమిచ్చి అమెరికా ఇన్వెస్టర్ల నుంచి నిధులు సేకరించిందని ఫారిన్‌ కరప్ట్‌ ప్రాక్టీసెస్‌ చట్టం కింద కేసులు నమోదు చేసింది. ఆ కేసుల నుంచి ఇప్పుడు ఊరట లభించబోతున్నట్టు తెలుస్తోంది. అమెరికాలో భారీ పెట్టుబడి పెట్టేందుకు అదానీ సంస్థలు ముందుకొస్తున్నాయని వారి తరఫు న్యాయవాది ప్రతిపాదించడంతో ఈ పరిణామాలు చోటుచేసుకుంటున్నట్లు అంతర్జాతీయ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

Advertisements

You may also like

Our Visitor

040857
Total views : 212229

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: