Wednesday, September 16, 2026
News Navigation
Wednesday, September 16, 2026
News Navigation

Breaking

Wednesday, September 16, 2026
Home Telangana రేపు మూడు జిల్లాల్లో కేసీఆర్ పర్యటన..!

రేపు మూడు జిల్లాల్లో కేసీఆర్ పర్యటన..!

by Satya
KCR

జనగావ్, సూర్యాపేట, నల్గొండ జిల్లాలో కేసీఆర్(KCR) పర్యటన..

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్(BRS) అధినేత కేసీఆర్(KCR) రేపు పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. నీరు లేక ఎండిపోతున్న పొలాలను ఆయన పరిశీలించనున్నారు. అనంతరం, బాధిత రైతులతో సమావేశం కానున్నారు. జనగావ్, సూర్యాపేట, నల్గొండ జిల్లాలో కేసీఆర్ పర్యటిస్తారు. పలువురు కీలక నేతలు పార్టీని వీడుతున్న నేపథ్యంలో కేసీఆర్ పర్యటనకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. కాగా, లోక్‌సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రెటరీ కె. కేశవరావు, ఆయన కుమార్తె హైదరాబాద్(Hyderabad) మేయర్ విజయలక్ష్మి గద్వాల్ శుక్రవారం కాంగ్రెస్‌(Congress)లో చేరడంతో పార్టీకి గట్టి షాకిచ్చింది. మరో సీనియర్ నేత, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కడియం కావ్య(Kadiyam Kavya) కాంగ్రెస్ నేతలను కలవగా తమ పార్టీలో చేరాలంటూ వారు ఆహ్వానించారు. తన నిర్ణయాన్ని మరో రెండు రోజుల్లో ప్రకటిస్తానని కడియం శ్రీహరి పేర్కొన్నారు.

ఇది చదవండి: ఓటు హక్కును వినియోగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి

లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేది లేదని ఇటీవల కడియం కావ్య చెప్పిన తెలియజేసారు. ఇప్పటివరకూ బీఆర్ఎస్‌కు చెందిన మొత్తం ఐదుగురు సిట్టింగ్ ఎంపీలు, ఒక ఎమ్మెల్యేతో పాటు ఇతర నేతలను పార్టీకి దూరమయ్యారు. కాంగ్రెస్ లేదా బీజేపీలోకి చేరారు. నేతలు పార్టీని వీడుతుండటంపై కేటీఆర్ మండిపడ్డారు. ‘‘పార్టీని వీడుతున్నప్పుడు వారు విమర్శలు చేస్తున్నారు. కాబట్టి, నేను దీన్ని నేను వారి విజ్ఞతకే వదిలేస్తున్నా. అందరికీ కాలమే సమాధానం చెబుతుంది’’ అంటూ ఓ సమావేశంలో పార్టీ నేతలను ఉద్దేశించి ప్రసంగించారు. తాను వ్యక్తిగతంగా కార్యకర్తల బాగు కోసం పనిచేస్తానని అన్నారు. కవిత అరెస్టైన రోజున చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, మాజీ మంత్రి మహేందర్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరటంపై కూడా కేటీఆర్ మండిపడ్డారు. కవిత అరెస్టైన రోజు వారు నవ్వుతూ పార్టీ మారారని, బీఆర్ఎస్ కార్యకర్తలే వారికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో వాళ్లు వచ్చి కేసీఆర్ కాళ్లపై పడ్డా తాను పార్టీలోకి అనుమతించనని అన్నారు.

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.
హైదరాబాద్ ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా …
కొండా సురేఖకు బుజ్జగింపులు.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షి నటరాజన్, …
ఫసల్ బీమా యోజన అమలుపై పాయల్ శంకర్ నిరసన.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఫసల్ బీమా యోజన అమలుపై బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: