రైతుల్లో నమ్మకం, ధైర్యం కల్పించేలా వెంటనే పొగాకు కొనుగోళ్లు పెద్దఎత్తున జరపాలని, ఇందుకోసం వేలం ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పొగాకు కంపెనీలకు స్పష్టం చేశారు. ట్రేడర్లు కొనుగోళ్లు తగ్గించడం సరికాదని, కర్నాటకలో తలెత్తని సమస్య ఏపీలో ఎందుకు ఉత్పన్నం అవుతోందని సీఎం ప్రశ్నించారు. టొబాకో బోర్డు పనితీరుపైనా అసంతృప్తి వ్యక్తం చేశారు. రైతులను ఇబ్బందిపెట్టేలా నడుచుకుని కంపెనీలు గుడ్ విల్ పోగొట్టుకోవద్దని, కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రైతులు ప్రత్యామ్నాయ పంటలకు మళ్లితే… తలెత్తే పరిస్థితి గురించి పొగాకు కంపెనీలు ఆలోచన చేయాలన్నారు. సచివాలయంలో బుధవారం పొగాకు కొనుగోళ్ల ప్రస్తుత స్థితిపై అధికారులు, ట్రేడర్లతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. మొత్తం 28 కంపెనీలు సమర్పించిన ఇండెంట్ వివరాలు, ప్రస్తుతం జరిపిన కొనుగోళ్ల శాతాన్ని సమీక్షలో ముఖ్యమంత్రి పరిశీలించారు.
ఇండెంట్ ఇచ్చి కొనుగోలు చేయకుండా ప్రభుత్వానికి సహకరించకపోతే సహించేది లేదని చంద్రబాబు హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర కిలోకు 200 రూపాయలకు తగ్గకుండా, మొత్తం కొనుగోళ్లు జరిపితీరాలన్నారు. ముఖ్యంగా అతిపెద్ద మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీలు అయిన ఐటీసీ లిమిటెడ్, గాడ్ ఫ్రే ఫిలిప్స్ (ఐ) లిమిటెడ్, వీఎస్టీ ఇండస్ట్రీస్ 95.50 మిలియన్ కేజీల పంట కొనుగోళ్లకు ఇండెంట్ ఇవ్వగా… ఇప్పటివరకు కేవలం 17.6 మిలియన్ కేజీల పొగాకు మాత్రమే కొనుగోలు చేయడాన్ని తప్పుబట్టారు.
ఈ సీజన్లో ఐదవ సారి ఇదే అంశంపై సమీక్ష నిర్వహించాల్సి వచ్చిందంటే కంపెనీల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు.
రైతులు డిమాండ్‌కు మించి పొగాకు సాగు చేయడం ప్రస్తుత సమస్యకు కారణమని ట్రేడర్లు సీఎంకు వివరించారు. ఇప్పటికే అవసరానికి మించి కొనుగోళ్లు చేశామని… దానికి తోడు ఎగుమతులు కూడా తగ్గాయని తెలిపారు. అయినప్పటికీ కొనుగోళ్లు కొనసాగిస్తామని కంపెనీల ప్రతినిధులు వెల్లడించారు. పొగాకు బహిరంగ మార్కెట్ లేకపోవడం సమస్యను తీవ్రం చేశాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అలాగే కంపెనీలు 142 మిలియన్ కేజీలకు ఇండెంట్ ఇవ్వగా, రైతులు 232 మిలియన్ కేజీల పొగాకు ఉత్పత్తి చేశారన్నారు. దీంతో ధర పతనం కావడం, కొనుగోళ్లు లేకపోవడం జరిగిందని తెలిపారు.
Latest News
దేశంలోని కోట్ల మంది పీఎఫ్ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పీఎఫ్ విత్‌డ్రా ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ EPFOలో విప్లవాత్మక మార్పులను ప్రవేశపెట్టింది. ఇకపై ఎలాంటి ఆలస్యం లేకుండా రూ.5 లక్షల వరకు ఉండే పీఎఫ్ క్లెయిమ్‌లను ఆటో క్లెయిమ్ సెటిల్మెంట్ పద్ధతి ద్వారా ఆటోమేటిక్‌గా ఆమోదించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, అందుకు సంబంధించిన EPFO కొత్త డిపాజిట్ వ్యవస్థ నేటి నుంచే అధికారికంగా ప్రారంభమైంది.
కొత్తగా చేపట్టిన ఈ టెక్నికల్ మార్పుల వల్ల ఇక నుంచి పీఎఫ్ సేవలు శరవేగంగా సాగనున్నాయి. ఇది వరకు క్లెయిమ్ సెటిల్మెంట్కు వారాల తరబడి వేచి చూడాల్సి రాగా.. ఇకపై రోజుల్లోనే పని పూర్తి కానుంది. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్న ఖాతాదారులందరి పీఎఫ్ వివరాలను ఒకే కేంద్రీకృత డేటాబేస్ పరిధిలోకి తీసుకువచ్చారు. దీంతో ఉద్యోగులు దేశంలో ఎక్కడి నుంచైనా తమ పీఎఫ్ వివరాలను ఒకే చోట సులభంగా చూసుకోవచ్చు. జూలై 15 నాటికి ఖాతాల్లో జమ అయిన మొత్తానికి ప్రభుత్వం అందించే పీఎఫ్ వడ్డీ జమ చేసే ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది.
అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై మంత్రి నారాయణ కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ భవనాలు, రోడ్లు, ఎల్పీఎస్ లేఅవుట్లు తదితర ప్రాజెక్టుల పనులు ఎంతవరకు పూర్తయ్యాయో సంస్థల ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ప్రాజెక్టు పురోగతిని సమీక్షిస్తూ నిర్ణీత గడువులో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.ఈ సందర్భంగా రాజకీయ విమర్శలపై స్పందించిన మంత్రి నారాయణ… జగన్ చేస్తున్న “మావిగన్” రాజకీయ ఎత్తుగడలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. “మావిగన్ అంటే ఏ బస్సెక్కాలంటూ ప్రజలు నవ్వుకుంటున్నారు” అంటూ వ్యాఖ్యానించారు. ప్రజలకు పరిపాలన సులభతరం చేసేందుకు అన్ని ప్రభుత్వ వ్యవస్థలను ఒకేచోటకు తీసుకొస్తే, అవగాహన లేకుండా విమర్శలు చేస్తున్నారని అన్నారు.ఎవరెన్ని కుట్రలు పన్నినా అనుకున్న సమయానికే అమరావతి తొలి దశ పనులు పూర్తవుతాయని మంత్రి స్పష్టం చేశారు.
ఇంగ్లండ్ చేతిలో ఇది ఘోర పరాజయం. ఓటమి ఒక్కటే కాదు, ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ భారత జట్టు తరఫున పరుగుల తేడాతో జరిగిన అతిపెద్ద ఓటమికి నాయకత్వం వహించిన కెప్టెన్‌గా ఒక అనవసర రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.
డగౌట్లో అభిషేక్ శర్మ తన నిరాశను దాచుకోలేక తలను వెనక్కి వాల్చి, చేతులతో కళ్లను కప్పుకుంటూ కూర్చున్న దృశ్యం కనిపించింది. అతని ఓపెనింగ్ భాగస్వామి వైభవ్ కూడా ఆశ్చర్యంతో పైకి చూస్తూ కనిపించాడు.
భారత ఇన్నింగ్స్ మొత్తం ఇదే కథను చెప్పింది. బ్యాటర్లు దూకుడుగా షాట్లు ఆడారు, బంతిని అద్భుతంగా టైమ్ చేశారు. కానీ దురదృష్టవశాత్తూ, ఎక్కువసార్లు బంతి నేరుగా ఫీల్డర్ల చేతుల్లోకే వెళ్లింది.
ప్రారంభంలోనే వికెట్లు కోల్పోయినా, భారత బ్యాటర్లు తమ దూకుడు తగ్గించడానికి సిద్ధంగా లేరు. ఓడిపోవాల్సి వచ్చినా దూకుడుగానే ఆడుతూ ఓడిపోవాలనే ధోరణిని కొనసాగించారు. అయితే, టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవని భారత జట్టుకు ఇలాంటి ప్రదర్శన రావడం మరింత నిరాశ కలిగించే విషయం.
ఫిఫా వరల్డ్ కప్-2026లో భాగంగా అర్జెంటినా, ఈజిప్ట్ జట్ల మధ్య జరిగిన ఉత్కంఠభరిత పోరును తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులతో కలిసి వీక్షించారు.హైదరాబాద్ శిల్పకళా వేదికలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భారీ ఎల్ఈడీ స్క్రీన్‌పై సంక్షేమ పాఠశాలల విద్యార్థులతో కలిసి మ్యాచ్‌ను తిలకించారు. మ్యాచ్ ప్రారంభం నుంచి ముగింపు వరకు విద్యార్థుల కేరింతలు, చప్పట్లతో వేదిక సందడిగా మారింది.ఇటీవల ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ హైదరాబాద్ పర్యటనతో రాష్ట్రంలో ఫుట్‌బాల్‌పై ఆసక్తి మరింత పెరిగిన నేపథ్యంలో ఈ ప్రత్యేక వీక్షణ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.అట్లాంటాలో జరిగిన ఈ ఉత్కంఠభరిత మ్యాచ్‌లో అర్జెంటినా 3-2 గోల్స్ తేడాతో ఈజిప్ట్‌పై విజయం సాధించింది. చివరి నిమిషం వరకు మ్యాచ్ హోరాహోరీగా సాగడంతో విద్యార్థులు ఉత్సాహంగా మ్యాచ్‌ను ఆస్వాదించారు.గత డిసెంబర్లో మెస్సీ హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో అభిమానులను అలరించి, యువతలో క్రీడాస్ఫూర్తిని నింపిన విషయం తెలిసిందే. అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ విద్యార్థులకు ప్రపంచ స్థాయి క్రీడా అనుభూతిని అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రత్యేక వీక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
రుతుపవనాల ప్రభావంతో హర్యానాలోని గురుగ్రామ్‌లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా నగరంలోని పలు ప్రాంతాలు నీటమునిగిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.వర్షాల ప్రభావంతో ఢిల్లీ-జైపూర్ జాతీయ రహదారి ఎన్‌హెచ్-48పై నర్సింగ్‌పూర్ ప్రాంతంలో రహదారి ఒక్కసారిగా కుంగిపోవడంతో భారీ గుంత ఏర్పడింది. దీంతో ఐఎఫ్ఎఫ్సీఓ చౌక్ నుంచి నర్సింగ్‌పూర్ వరకు దాదాపు 8 నుంచి 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. వేలాది వాహనాలు గంటల తరబడి నిలిచిపోయాయి.
హైవే దెబ్బతిన్న వెంటనే జిల్లా యంత్రాంగం, ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమై జైపూర్ వైపు వెళ్లే వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లించారు. ఘటనకు సంబంధించిన వీడియోలు, రహదారి కుంగిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.గురుగ్రామ్‌లోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా రహదారులు కుంగిపోయాయి. ఒకచోట గుంతలో ఎస్యూవీ వాహనం ముందు చక్రాలు ఇరుక్కుపోగా, జిల్లా కలెక్టర్ నివాసం, రాష్ట్ర మంత్రి నివాసం సమీపంలో కూడా రోడ్లు దెబ్బతినడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
మరోవైపు నగరంలోని ప్రధాన రహదారులపై భారీగా వరద నీరు నిలిచిపోవడంతో కార్లు, బస్సులు, లారీలు నెమ్మదిగా ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ తీవ్రంగా స్తంభించడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు.పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక అడ్వైజరీ జారీ చేశారు. ఢిల్లీ నుంచి జైపూర్ వెళ్లే వాహనదారులు ఎన్‌హెచ్-48లో ప్రభావిత ప్రాంతాన్ని నివారించాలని, రాజీవ్ చౌక్, సదర్న్ పెరిఫెరల్ రోడ్, హీరో హోండా చౌక్, ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే వంటి ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని సూచించారు. దెబ్బతిన్న రహదారికి మరమ్మతులు కొనసాగుతున్నాయని, ప్రజలు ట్రాఫిక్ సూచనలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
దాదా- ది సౌరవ్ గంగూలీ స్టోరీ’ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్..ప్రపంచ వ్యాప్తంగా మే 14, 2027న సినిమా భారీ విడుదల.
లెజెండ్రీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ పుట్టినరోజు సందర్భంగా ‘దాదా – ది సౌరవ్ గంగూలీ స్టోరీ’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. బాలీవుడ్ స్టార్ రాజ్‌కుమార్ రావ్ టైటిల్ పాత్రలో నటిస్తున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు ఈ రోజు మరింత ప్రత్యేకంగా మారింది. ఇదే సమయంలో ఈ సినిమాను 2027, మే 14న లాంగ్ హాలిడే వీకెండ్ సందర్భంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
అధికారికంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లో 2002లో ఇంగ్లాండ్‌పై భారత్ సాధించిన చారిత్రాత్మక నాట్‌వెస్ట్ ట్రోఫీ విజయం తర్వాత లార్డ్స్ బాల్కనీలో సౌరవ్ గంగూలీ జెర్సీ ఊపిన ఐకానిక్ మూమెంట్‌ను రాజ్‌కుమార్ రావ్‌తో సినిమాటిక్‌గా రీక్రియేట్ చేసినట్లు చూపించారు. ఈ సెలబ్రేషన్‌ను భారత క్రికెట్లో గంగూలీ నాయకత్వంలో ప్రారంభమైన కొత్త యుగానికి ప్రతీకగా భావిస్తారు. ఆత్మవిశ్వాసం, ధైర్యం, నమ్మకానికి చిరస్థాయిగా నిలిచే చిహ్నంగా ఇప్పటికీ ఆ క్షణాలు గుర్తులుగా మిగిలాయి.
‘దాదా- ది సౌరవ్ గంగూలీ’ సినిమా క్రికెట్ ఆట ఆడిన వ్యక్తి మాత్రమే కాకుండా దానిని మార్చిన మనిషి అసాధారణ ప్రయాణాన్ని చూపిస్తుంది. ఒక ప్రతిభావంతుడైన యువ క్రికెటర్‌గా ప్రారంభమై భారతదేశంలో అత్యంత ప్రభావశీలమైన కెప్టెన్లలో ఒకరిగా ఎదిగిన గంగూలీ ప్రయాణాన్ని ఈ చిత్రం ఆవిష్కరిస్తుంది. పట్టుదల, పోరాడే శక్తి, నమ్మకం వంటి లక్షణాలు భారత క్రికెట్‌ను ఎలా కొత్తగా మలిచాయో, ఒక తరం మొత్తానికి ఎలా ప్రేరణగా నిలిచాయో ఈ సినిమా ద్వారా చూపించనున్నారు.
‘దాదా- ది సౌరవ్ గంగూలీ’ సినిమాకు విక్రమాదిత్య మోత్వానె దర్శకత్వం వహిస్తున్నారు. లవ్ రంజన్, అంకూర్ గార్గ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టీ-సిరీస్, డీబీఎల్ సమర్పణలో, లవ్ ఫిల్మ్స్ నిర్మాణంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2027, మే 14న థియేటర్లలో భారీ ఎత్తున విడుదల కానుంది.
అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలో రాజకీయ వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు నమోదైంది. జనసేన పార్టీ నాయకులు కొత్తకోట పోలీస్ స్టేషన్లో జడ శ్రవణ్ కుమార్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. జనసేన పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఆధారాలను పోలీసులకు అందించారు. ఈ వ్యాఖ్యలపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పార్టీ ఇంచార్జ్ పీవీఎస్ఎన్ రాజు కోరారు. రాజకీయాల్లో అనుచిత భాషకు అడ్డుకట్ట వేయాలని ఆయన అన్నారు.
తెలంగాణలో మహిళలు, చిన్నారుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని నాచారంలో 20 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన బాలామృతం ప్లాంట్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడిన సీఎం.. మహిళల సాధికారత, పిల్లల ఆరోగ్యం, విద్య, పోషకాహారం, సంక్షేమ కార్యక్రమాలపై ప్రభుత్వం అమలు చేస్తున్న పలు కీలక కార్యక్రమాలను వివరించారు. నాచారంలో ప్రారంభమైన బాలామృతం ప్లాంట్ భవిష్యత్తులో తెలంగాణ అవసరాలను తీర్చడమే కాకుండా మరో నాలుగు నుంచి ఐదు రాష్ట్రాలకు కూడా పోషకాహార ఉత్పత్తులను సరఫరా చేసే స్థాయికి ఎదుగుతుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి దివంగత ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ఆలోచనలే పునాది అని పేర్కొంటూ, చిన్న స్థాయిలో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఇప్పుడు ఆధునిక పరిశ్రమగా అభివృద్ధి చెందిందన్నారు.
కనిపించకుండా పోయిన చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం పోలీసులు నిరంతరం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ కేసును అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని ఎనిమిది ప్రత్యేక బృందాలతో వివిధ ప్రాంతాల్లో దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో చిన్నారి తల్లి భవాని మీడియాతో మాట్లాడుతూ, కేసు దర్యాప్తుపై తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ప్రజలను కోరారు. చిన్నారి ఆచూకీపై ఎవరికైనా సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. దర్యాప్తు చేస్తున్న పోలీసులకు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు.




Total views : 196357