Wednesday, July 22, 2026
News Navigation
Wednesday, July 22, 2026
News Navigation

Breaking

Wednesday, July 22, 2026
Home Andhra Pradesh అవినీతిపరులను అడ్డుకుందాం.. నారా భువనేశ్వరి

అవినీతిపరులను అడ్డుకుందాం.. నారా భువనేశ్వరి

by Satya
Nara Bhuvaneshwari


రాష్ట్రాన్ని కాపాడుకోవాలని పార్టీ కార్యకర్తలకు నారా భువనేశ్వరి(Nara Bhuvaneshwari)..

రాష్ట్రం(State)లో తిష్ఠవేసిన అవినీతిపరులను రాయలసీమ(Rayalaseema) ప్రజలు పౌరుషంగా అడ్డుకోవాలని, వారి చేతిలో నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని పార్టీ కార్యకర్తలకు చంద్రబాబు(Chandrababu) సతీమణి నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. రాయచోటి నియోజకవర్గంలో ‘నిజం గెలవాలి’ పర్యటన సందర్భంగా కార్యకర్తలకు ఈ మేరకు ఆమె దిశానిర్దేశం చేశారు. చంద్రబాబు పాలనలో ‘సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్’గా పేరు పొందిన ఏపీ నేడు అప్పుల ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) అయ్యిందని అన్నారు. దేశంలో రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని వైసీపీ ప్రభుత్వం నిలబెట్టిందని మండిపడ్డారు. గతంలో ఏపీలో ఉన్న పరిశ్రమలన్నీ పక్కనున్న రాష్ట్రాలకు తరలి వెళ్లిపోయాయని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

దేశంలోనే రాజధాని లేని ఏకైక రాష్ట్రంగా ఏపీని మార్చారు..

‘‘యువతకు ఉద్యోగావకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. టీడీపీ పాలనలో ఏపీకి పెట్టుబడులు వస్తే నేడు ఆ కంపెనీలు ఏపీని వదిలి పారిపోతున్నాయి. రాష్ట్ర సచివాలయాన్ని సహా తాకట్టు పెట్టి, అప్పులు తెచ్చి ఆ అప్పులను మన నెత్తిమీద వేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులను గత 5 ఏళ్లుగా అనేక ఇబ్బందులకు గురిచేశారు. దేశంలోనే రాజధాని లేని ఏకైక రాష్ట్రంగా ఏపీని మార్చారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు రాయలసీమ కార్యకర్తలు పౌరుషంగా బయటకు రావాలి’’ అని నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు నడుం బిగించాలని, ఎవరు ఎదురొచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొని పోరాడాలని టీడీపీ శ్రేణులకు ఆమె సూచించారు. తెలుగుదేశం జెండాను ఎగరేయాలన్నారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

‘‘చంద్రబాబు ఏం చేస్తారో అవే చెప్తారు. 2024లో మన ప్రభుత్వం వచ్చిన వెంటనే యువతకు 20లక్షల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఇవ్వడానికి చంద్రబాబు సిద్ధంగా ఉన్నారు. నిరుద్యోగులకు నెలకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి, రైతులకు సంవత్సరానికి రూ.20వేలు పెట్టుబడి సాయం, 18సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500, చదువుకునే ప్రతి విద్యార్థికి సంవత్సరానికి రూ.15వేలు, మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సదుపాయం అందిస్తామని చంద్రబాబు చెప్పారు. మహిళలు కూడా చంద్రబాబు అక్రమ అరెస్టు సమయంలో అలుపెరుగని పోరాటం చేశారు. పోలీసులు ఇబ్బందులు పెట్టినా ఎక్కడా వెనకడుగు వేయకుండా మా కుటుంబానికి అండగా నిలిచారు. ప్రతి ఒక్కరికీ మేం రుణపడి ఉంటాం. వచ్చే ఎన్నికల్లో మహిళలు కూడా తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేయాలి’’ అని భువనేశ్వరి కోరారు.

ఇది చదవండి: డ్రగ్స్ స్వాధీనం పై చంద్రబాబు విస్మయం వ్యక్తం..!


నంద్యాల జిల్లా ఆత్మకూరులో పులి, పులికూనలు హల్చల్.
నంద్యాల జిల్లా, ఆత్మకూరు అటవీ డివిజన్‌లో నాలుగు పులి కూనలు హల్‌చల్ చేశాయి. నల్లకాల్వ గ్రామానికి …
అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఎమ్మెల్యే సమీక్ష.
అనంతపురం నగర ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుద్ధ్యం, వైద్య సేవల మెరుగుదలపై కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. …
కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం.
రాష్ట్రంలో నమోదవుతున్న కోవిడ్ కేసుల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాల …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

042284
Total views : 223764

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: