బీఆర్ఎస్(BRS) పై కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) పూర్తి స్థాయిలో దృష్టి..
గ్రేటర్ హైదరాబాద్(Hyderabad) పరిధిలోని బీఆర్ఎస్ కీలక నేతలపై కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్(Nagender) తో పాటు పలువురు నేతలు కాంగ్రెస్ గూటికి చేరారు. మరికొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారబోతున్నారనే వార్త పొలిటికల్ సర్కిల్(Political circle) లో వైరల్ అవుతోంది. తాజాగా నగర మేయర్, బీఆర్ఎస్ పార్టీ(BRS Party) కీలక నేత కె.కేశవరావు(K. Kesha Rao) కుమార్తె గద్వాల్ విజయలక్ష్మి కాంగ్రెస్(Congress) లో చేరబోతున్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
దీపాదాస్ మున్షీతో విజయలక్ష్మి(Vijayalakshmi) భేటీ..
కొన్ని రోజుల క్రితమే సీఎం రేవంత్(CM Revanth)ను విజయలక్ష్మి కలిశారు. కాంగ్రెస్ పార్టీ(Congress party) రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీ దీపాదాస్ మున్షీతో విజయలక్ష్మి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఖైరతాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్(Congress) నేత రోహిణ్ రెడ్డి(Rohin Reddy) కూడా వీరితో పాటు ఉన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో, విజయలక్ష్మి కాంగ్రెస్(Congress) లో చేరబోతున్నారనే ప్రచారానికి మరింత బలం చేకూరినట్టయింది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: మనుషులపాలిట రాక్షసుడిగా మారిన డాక్టర్…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి