Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home Telangana టీఎస్పీఎస్సీ కేసులో లింకులు మిస్సింగ్..

టీఎస్పీఎస్సీ కేసులో లింకులు మిస్సింగ్..

by Rama
SP Rangnadh

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో అక్రమాలపై సిట్ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసుపై సిట్ అడిషనల్ కమిషనర్ రంగనాథ్ మాట్లాడారు. టీఎస్పీఎస్సీ కేసులో కొన్ని లింకులు మిస్సయ్యాయని తెలిపారు. ఈ వ్యవహారంలో ఎవరు ఏం చేశారు? ఎవరి పాత్ర ఎంత వరకు ఉంది? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉందని అన్నారు. ప్రస్తుతం తమ దర్యాప్తు ఈ అంశాల చుట్టూ తిరుగుతోందని పేర్కొన్నారు. త్వరలోనే మరిన్ని వివరాలతో ముందుకు వస్తామని అడిషనల్ కమిషనర్ తెలిపారు. టీఎస్పీఎస్సీ కేసులో ఇప్పటివరకు 109 మందిని అరెస్ట్ చేశామని, ఈ కేసులో లోతైన దర్యాప్తు జరుగుతోందని, ఇంకా మరికొందరిని అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని స్పష్టం చేశారు.

Read Also..

Advertisements

You may also like

Our Visitor

013932
Total views : 78503

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.