Sunday, May 31, 2026
News Navigation
Sunday, May 31, 2026
News Navigation

Breaking

Sunday, May 31, 2026
Home National భారత క్రికెటర్లకు నేడు మోదీ సన్మానం

భారత క్రికెటర్లకు నేడు మోదీ సన్మానం

by Satya
భారత క్రికెటర్లకు నేడు మోదీ సన్మానం

టీ20 ప్రపంచకప్ గెలుపుతో యావత్ దేశం గర్వపడేలా చేసిన టీమిండియా. అభిమానులకు మరో సర్‌ప్రైజ్ ఇచ్చింది. నేడు సాయంత్రం నిర్వహించనున్న విక్టరీ పరేడ్‌లో పాల్గొనాలంటూ అభిమానులను ఆహ్వానించింది. భారత క్రికెటర్లకు నేడు మోదీ సన్మానం చేయనున్నారు. అనంతరం టీం సభ్యులందరూ ముంబై చేరుకుంటారు. ఆ తరువాత విజయోత్సవాల్లో పాల్గొనేందుకు వాంఖడే చేరుకుంటారు. ఈ క్రమంలో ఓపెన్ బస్ కవాతు చేద్దామని నిర్ణయించారు. పరేడ్‌లో పాల్గొనేందుకు రావాలంటూ అభిమానులను టీమిండియా రథసారధి రోహిత్ శర్మ ఆహ్వానించాడు.

ఈ ప్రత్యేక క్షణాల్ని మీ అందరితో కలిసి ఆస్వాదించాలనుకుంటున్నాం. జులై 4 సాయంత్రం 5 గంటలకు మెరీన్ డ్రైవ్ నుంచి వాంఖడే స్టేడియం వరకూ జరిగే పరేడ్‌లో మనందరం పాల్గొని భారత్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుందాం అని రోహిత్ శర్మ ఎక్స్ లో పోస్టు పెట్టాడు. బీసీసీఐ సెక్రెటరీ జైషా కూడా ఈ మేరకు అభిమానులకు ఆహ్వానం పంపించారు. ముంబైలోని నారీమన్ పాయింట్ నుంచి వాంఖడే వరకూ ఓపెన్ బస్ పరేడ్ ఏర్పాటు చేశారు. స్టేడియంలో ఏర్పాటు చేసిన విజయోత్సవ కార్యక్రమంలో జై షా టీమిండియా సభ్యులకు 125 కోట్ల నగదు బహుమతిని పంపిణీ చేస్తారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

018619
Total views : 89030

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.