Tuesday, June 2, 2026
News Navigation
Tuesday, June 2, 2026
News Navigation

Breaking

Tuesday, June 2, 2026
Home Andhra Pradesh జగన్‌ ప్రభుత్వం పై మండిపడ్డ నారా లోకేష్

జగన్‌ ప్రభుత్వం పై మండిపడ్డ నారా లోకేష్

by Satya
Nara Lokesh

మూడు రాజధానుల పేరుతో జగన్‌ ప్రభుత్వం మూడు ముక్కలాట ఆడుతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. మరో రెండు నెలల్లో తెలుగుదేశం – జనసేన ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. అనకాపల్లి జిల్లా మాడుగులలో నిర్వహించిన ‘శంఖారావం’ సభలో నారా లోకేష్ మాట్లాడారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ జరగకుండా చూసే బాధ్యత తనదేనన్నారు. ఐదేళ్లుగా యువతకు ఉద్యోగ అవకాశాలు లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖకు పెద్ద ఎత్తున ఐటీ పరిశ్రమలు తీసుకొస్తామని భరోసా ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ – జనసేనను గెలిపించండి.. అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామన్నారు. పార్టీలో సీనియర్లు, జూనియర్లను గౌరవిస్తానని, అయితే పనిచేసేవాళ్లనే ప్రోత్సహిస్తాని తెలిపారు. ప్రజల్లో ఉండేవారిని వెతుక్కుంటూ వచ్చి నామినేటెడ్‌ పోస్టులు ఇస్తామని లోకేష్ స్పష్టం చేశారు.

Read Also..

Follow us on : Facebook, Instagram & YouTube.

  • ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.
    ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిన తోట సాయి వినీల్ కు పాఠశాల చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి…
  • జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.
    ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు.అమరావతిలో జనసేన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సేనా గళం పేరుతో…
  • గుంటూరు జిల్లా తాడేపల్లిలో 92 ఎకరాల భూ వివాదం.
    కోట్ల రూపాయల విలువైన భూములను కాజేసేందుకు భారీ కుట్ర జరిగిందంటూ గుంటూరు జిల్లా తాడేపల్లిలో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సోదరుడు రామకృష్ణ తమకు భారీ మొత్తంలో డబ్బులు, అపార్ట్‌మెంట్లలో ప్లాట్లు ఇస్తామని హామీ ఇచ్చి…

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

019505
Total views : 90858

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.