Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home National విష్ణు దియో సాయిని సీఎంగా ఎంపిక చేసిన బీజేపీ

విష్ణు దియో సాయిని సీఎంగా ఎంపిక చేసిన బీజేపీ

by Satya
Vishnu Deo Sai as CM

ఛత్తీస్‌గఢ్‌లోని ప్రముఖ గిరిజన నేత విష్ణు దియో సాయిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ ఎంపిక చేసింది. 54 మంది ఎమ్మెల్యేలతో జరిగిన పార్టీ శాసనసభా పక్ష నేతలసమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రానికి ఓ గిరిజన నేతను సీఎం చేయాలన్న మోదీ సంకల్పం ప్రకారం సీఎం ఎంపిక జరిగిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వివాదరహితుడిగా పేరున్న విష్ణుదియో సాయి, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2020-22 మధ్యకాలంలో రాష్ట్ర పార్టీ ప్రెసిడెంట్‌గా సేవలందించారు. పార్టీ నిర్వహణపై మంచి పట్టున్న వ్యక్తిగా పేరుపొందారు. బీజేపీ నేషనల్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్‌గా కూడా పనిచేసిన ఆయనను ప్రధాని నరేంద్ర మోదీ 2014లో జూనియర్ మినిస్టర్‌గా నియమించారు. విష్ణు దియో సాయిను సీఎం చేసే అవకాశం ఉందని ఎన్నికల సమయంలోనే హోం మంత్రి అమిత్ షా సంకేతాలిచ్చారు. కుంకురి నియోజకవర్గంలో ప్రచారం సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ మీరు సాయిని ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే మేము ఆయనను ఇంకా పెద్ద వ్యక్తిని చేస్తాం అని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో గిరిజనులకు బీజేపీ ఫేవరెట్‌గా మారింది. మునుపెన్నడూ చూడని రీతిలో గిరిజన ప్రాబల్యం అధికంగా ఉన్న సుర్గుజా ప్రాంతంలో ఉన్న 14 సీట్లు, బస్తర్ ప్రాంతంలోని 12 సీట్లు గెలుచుకుంది. దీంతో, విష్ణు దియో సాయికి సీఎం కుర్చీ దక్కింది.

Advertisements

You may also like

Our Visitor

013953
Total views : 78653

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.