Wednesday, September 16, 2026
News Navigation
Wednesday, September 16, 2026
News Navigation

Breaking

Wednesday, September 16, 2026
Home Andhra Pradesh కే రిడ్జ్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ప్రారంభం..

కే రిడ్జ్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ప్రారంభం..

by Prakash
Former Vice President Venkaiah Naidu

పల్నాడు జిల్లా, నరసరావుపేటలో కే రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రారంభించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ఈ సందర్భంగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ ఇంగ్లీష్ నేర్చుకోండి కానీ తెలుగుని మరిచిపోవద్దని ప్రతి మనిషి ప్రతి రోజు తెలుగులో మాట్లాడితే బాగుంటుందిని ప్రతి వ్యక్తికి మొదటి దైవం కన్న తల్లిదండ్రులే అనేది గుర్తించాలి అన్నారు. మాతృ భాషను మొదట చదువుకోని తర్వాత ఇంగ్లీష్ భాష పై మక్కువ పెట్టుకోవాలి ఏదీ ప్రజలకు ఫీగా ఇవ్వకూడదు ప్రజలకు విద్యా, వైద్యం మాత్రమే ఫీగా ఇవ్వాలి అన్నారు. ఏ ప్రభుత్వాలు అయినా సరే పోటాపోటీగా ఉచితాలు ఇవ్వడం మంచి పద్ధతి కాదని మంచి ఆరోగ్యం కోసం ప్రతిరోజూ ఎదో ఒక వ్యాయామం తప్పకుండా చేయాలి మనం పోయిన తర్వాత మనల్ని నలుగురు గుర్తుంచుకోవాలి అంటే కచ్చితంగా మంచి పనులు చేయాలి, శారీరకంగా దృడంగా ఉంటేనే మానసికంగా దృడంగా ఉంటారు అన్నారు. ప్రతిరోజూ యోగ చేయడం అలవర్చుకోవాలి మనదేశంలో ఉన్నన్ని రుచులు దేశంలో మరెక్కడా లేవు, ఇంట్లో వంట రూము, పూజ రూము తప్పకుండా ఉండాలి అన్నారు. ఇటీవల ప్రజలు ఫాస్టు ఫుడ్ కల్చర్ కి బాగా అలవాటు పడుతున్నారు అని తెలియజేశారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: