రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్-రష్యా వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించేందుకు భారత్ సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు.ఉక్రెయిన్ వివాదానికి వీలైనంత త్వరగా, శాంతియుత పరిష్కారానికి మద్దతు ఇస్తానని మోదీ పునరుద్ఘాటించారు. శాంతి పునరుద్దరణకు సహకారం అందించేందుకు భారత్ సదా సంసిద్దంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
రష్యా – ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న ఘర్షణ అంశంపై తాను నిరంతరం పుతిన్ తో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నానని తెలిపారు. తాను గతంలో చెప్పినట్టుగా సమస్యలను శాంతియుత విధానంలో పరిష్కరించుకోవాలని భావిస్తున్నామని, శాంతి, స్థిరత్వం స్థాపనకు తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని తెలిపారు. రాబోయే కాలంలో కూడా సాధ్యమైన అన్ని సహకారాలు అందించడానికి భారత్ సిద్ధంగా ఉందని అధ్యక్షుడు పుతిన్‌కు ప్రధాని మోడీ చెప్పారు. గత మూడు నెలల వ్యవధిలో తాను రెండవసారి రష్యాలో పర్యటించడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత మెరుగుపడతాయని ప్రధాని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.ఏపీ రాజధాని అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వర్ణాంధ్ర–2047 థీమ్‌తో రాయపూడిలోని పరేడ్ గ్రౌండ్ వేదికగా జరిగిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.సీడ్ యాక్సెస్ రోడ్డు…
- ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ.దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోటపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేశ చరిత్రలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ‘వందేమాతరం’ గేయాన్ని పూర్తిస్థాయిలో ఆలపించడం…
- టీవీ ఛానెళ్లలో యాడ్స్ పరిమితి రద్దు చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం.టీవీ ఛానెళ్లలో ప్రసారం అయ్యే యాడ్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టెలివిజన్ ఛానెళ్లలో ప్రతి గంటకు గరిష్టంగా 12 నిమిషాల వాణిజ్య ప్రకటనల ప్రసారానికే పరిమితం చేస్తూ రెండు దశాబ్దాల క్రితం విధించిన నిబంధనను తొలగిస్తూ కేంద్ర…
- ఇండోనేషియాలోని ఫ్లోర్స్ తీర ప్రాంతంలో భారీ భూకంపం.ఇండోనేషియాలోని ఫ్లోర్స్ తీర ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.7గా నమోదైందని, ఫ్లోరెస్ ప్రాంతంలోని ఎండే నగరానికి 68 కి.మీ దూరంలో, 10 కి.మీ లోతులో భూకంప కేంద్రం నమోదైందని అంతర్జాతీయ భూభౌతిక కేంద్రాలు…
- నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద తీపి కబురు .తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద తీపి కబురు చెప్పింది. పోలీస్, ఎక్సైజ్, ఫారెస్ట్ తదితర యూనిఫాం సర్వీసుల ఉద్యోగ నియామకాల్లో గరిష్ట వయోపరిమితిని మరో రెండేళ్ల పాటు పెంచుతూ శుక్రవారం కీలక నిర్ణయం…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి