Wednesday, March 11, 2026
News Navigation
Home Sports నాలుగో విజయంతో ముందుకు వెళుతున్న రాజస్థాన్..

నాలుగో విజయంతో ముందుకు వెళుతున్న రాజస్థాన్..

by Satya
Rajasthan Royals

ఐపీఎల్-17(IPL-17)లో రాజస్థాన్ రాయల్స్‌(Rajasthan Royals)కు ఎదురులేకుండా పోయింది. మైదానంలో అడుగుపెడితే విజయమే అన్నట్టుగా ఆ జట్టు దూకుడు కొనసాగుతోంది. లక్నో వేదికగా శనివారం జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ను 3 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లక్నో 5 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్(76), దీపక్ హుడా(50) సత్తాచాటారు.

Follow us on : FacebookInstagramYouTube & Google News

అనంతరం లక్ష్యాన్ని రాజస్థాన్ అలవోకగా ఛేదించింది. 19 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. కెప్టెన్ శాంసన్(71 నాటౌట్), ధ్రువ్ జురెల్(52 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీలతో జట్టును విజయతీరాలకు చేర్చారు. ఈ సీజన్‌లో రాజస్థాన్ చేతిలో ఓడటం లక్నోకు ఇది రెండోసారి. రాజస్థాన్‌కు వరుసగా ఇది నాలుగో గెలుపు. మొత్తంగా 8వది. దీంతో ఆ జట్టు 16 పాయింట్లతో ప్లే ఆఫ్స్ బెర్త్‌ను దాదాపు ఖరారు చేసుకుంది.


  • భారత క్రికెట్ జట్టు మరోసారి చరిత్రను తిరగరాసింది.
    ధనాధన్‌ క్రికెట్‌ పండుగ ముగిసింది. కోట్లాది మంది భారతీయుల కల నెరవేరింది. నరేంద్ర మోడీ స్టేడియం సాక్షిగా టీమ్‌ఇండియా మరోసారి విశ్వవిజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన సూర్యకుమార్ సేన, ఐసీసీ టీ20 ప్రపంచకప్‌-2026 ట్రోఫీని…
  • టీ20 వరల్డ్ కప్ ఫైనల్ కు టీమిండియా. చివరి వరకు పోరాడిన ఇంగ్లాండ్ బ్యాటర్లు.
    ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ 2026 రెండో సెమీఫైనల్లో పరుగుల వరద పారింది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఈ హైస్కోరింగ్ సమరంలో ఇంగ్లండ్ పై భారత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించి…
  • దుబాయ్ లో చిక్కుకున్న పీవీ సింధు
    పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో దుబాయ్‌లో చిక్కుకుపోయిన భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు ఎట్టకేలకు భారత్‌ చేరుకున్నారు. ఈ విషయాన్ని సింధు ‘ఎక్స్‌’లో వెల్లడించారు. ఓ మ్యాచ్‌ ఆడేందుకు వెళ్లిన పీవీ సిందు..యుద్ధం కారణంగా రెండ్రోజుల నుంచి దుబాయ్‌లోనే చిక్కుకుపోయారు. అక్కడ…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.