Tuesday, June 2, 2026
News Navigation
Tuesday, June 2, 2026
News Navigation

Breaking

Tuesday, June 2, 2026
Home National కొటక్‌ మహీంద్రా బ్యాంకుకు RBI బిగ్ షాక్‌..!

కొటక్‌ మహీంద్రా బ్యాంకుకు RBI బిగ్ షాక్‌..!

by Satya
Kotak Mahindra Bank

కొటక్‌ మహీంద్రా బ్యాంకు(Kotak Mahindra Bank)కు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(Reserve Bank of India) షాక్‌ ఇచ్చింది. ఆన్‌లైన్‌(Online), మొబైల్‌ బ్యాకింగ్‌(Mobile Backing) మార్గాల ద్వారా కొత్త కస్టమర్లను చేర్చుకోవడంపై ఆంక్షలు విధించింది. అదే సమయంలో క్రెడిట్‌కార్డు(Credit card)ల జారీని తక్షణం నిలిపివేయాలని ఆదేశించింది. ప్రస్తుతం ఉన్న క్రెడిట్‌కార్డులతో పాటు ఖాతాదారులకు సేవలు యథావిధిగా కొనసాగించవచ్చని ఆర్‌బీఐ చెప్పింది. కొటక్ మహీంద్రా బ్యాంక్ ఐటీ రిస్క్ మేనేజ్‌మెంట్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్‌లో లోపాలను గుర్తించిన తర్వాత చర్యలు చేపట్టినట్లు ఆర్‌బీఐ పేర్కొంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఐటీ ఆడిట్‌లో గుర్తించిన లోపాల ఆధారంగా చర్యలు తీసుకున్నట్లు ఆర్‌బీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. ఆయా లోపాలు, సమస్యలను పరిష్కరించడంలో బ్యాంక్ విఫలమైందని ఆర్‌బీఐ పేర్కొంది.

ఇది చదవండి: ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోదీ..

బ్యాంక్‌ ఐటీ ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్, ప్యాచ్ అండ్ ఛేంజ్ మేనేజ్‌మెంట్, యూజర్ యాక్సెస్ మేనేజ్‌మెంట్, వెండర్ రిస్క్ మేనేజ్‌మెంట్, డేటా సెక్యూరిటీ, డేటా లీక్‌లను ప్రివెన్షన్‌లో స్ట్రాటజీ లోపభూయిష్టంగా ఉందని ఆర్‌బీఐ ప్రకటనలో పేర్కొంది. బ్యాంకు ఐటీ రిస్క్‌, ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ గవర్నెన్స్‌ విషయంలో రెండు సంవత్సరాలు మార్గదర్శకాలు పాటించలేదని తెలిపింది. ఈ క్రమంలో బ్యాంకుపై చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్‌బీఐ పేర్కొంది. ఇకపై బ్యాంకు ఆన్‌లైన్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌ ఛానెల్స్‌ ద్వారా కొత్త కస్టమర్లను చేర్చుకోవడంతో పాటు కొత్త క్రెడిట్‌ కార్డులను జారీ చేయడం నిలిపివేయాలని ఆదేశించినట్లు పేర్కొంది. అయితే, ప్రస్తుతం ఉన్న క్రెడిట్‌ కార్డు వినియోగదారులతో పాటు ఇతర వినియోగదారులకు గతంలో మాదిరిగానే సేవలు అందించవచ్చని ఆర్‌బీఐ ప్రకటనలో స్పష్టం చేసింది.

Follow us on : FacebookInstagram, YouTube & Google News


  • ఛార్‍థామ్ యాత్రలో తీవ్ర ట్రాఫిక్ జామ్ …
    ఉత్తరాఖండ్‌లో చార్‌ధామ్ యాత్రకు భక్తులు పోటెత్తడంతో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. చార్‌ధామ్‌ యాత్రలో భాగంగా బద్రీనాథ్‌ వెళుతున్న భక్తులు భారీ ట్రాఫిక్‌జామ్‌ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారాంతపు సెలవులు, యాత్రికుల రద్దీ భారీగా పెరగడంతో కేదార్‌నాథ్ , జోషిమఠ్, గోవింద్‌…
  • రాజస్థాన్‌లో రాకాసి ఇసుక తుపాను బీభత్సం..
    రాజస్థాన్‌లో రాకాసి ఇసుక తుపాను బీభత్సం సృష్టించింది. చురు జిల్లాలో ఇసుక తుపాన్‌తో పాటు భారీ వర్షంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. చురు, బికనేర్‌, శ్రీగంగానగర్‌లో అరగంట పాటు ఇసుక తుపాన్‌ అల్లకల్లోలం సృష్టించింది. ఇసుక తుపాను వీధులను కమ్మేసింది.…
  • సీబీఎస్‌ఈ రీవాల్యుయేషన్‌ పోర్టల్‌పై సైబర్‌ దాడి..
    సీబీఎస్‌ఈ రీవాల్యుయేషన్‌ ప్రక్రియలో సైబర్‌ దాడి కలకలం రేపింది. రీవాల్యుయేషన్‌ ఫీజుల చెల్లింపులకు ఉపయోగిస్తున్న పోర్టల్‌ పేమెంట్‌ సిస్టమ్‌పై హ్యాకర్లు దాడి చేసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. ఇటీవల సీబీఎస్‌ఈ 12వ తరగతి…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి

Advertisements

You may also like

Our Visitor

019436
Total views : 90713

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.