ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజినల్ రింగ్ రోడ్డు వరకు కనెక్టివిటీ ఉండేలా రోడ్డు మ్యాప్ సిద్ధం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఆయన ఫ్యూచర్ సిటీ అభివృద్ధి ప్రణాళికలపై సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా శంషాబాద్ విమానాశ్రయం నుంచి రీజినల్ రింగ్ రోడ్డు వరకు కనెక్టివిటీ రూట్ మ్యాప్‌ను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అయితే ఔటర్ నుంచి రీజినల్ రింగ్ రోడ్డు వరకూ కనెక్టివిటీ ఉండేలా చూడాలన్నారు. ఫ్యూచర్ సిటీలో రేడియల్ రోడ్లను అభివృద్ధి చేసేలా ప్రణాళికలు ఉండాలన్నారు.
అలాగే, రోడ్డు, మెట్రో మార్గాల భూసేకరణ, ఇతర అంశాలపై సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు. ఫ్యూచర్ సిటీకి సంబంధించి పూర్తిస్థాయి ప్రణాళికలు, రూట్ మ్యాప్ సిద్ధం చేసి యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలన్నారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో క్రీడా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. హకీంపేట లేదా గచ్చిబౌలిలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీకి ప్రతిపాదించారు. స్పోర్ట్స్ మెడిసిన్, స్పోర్ట్స్ సైన్స్ సహా దాదాపు డజనుకు పైగా కోర్సులు ప్రవేశపెట్టాలని భావిస్తోంది.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిన తోట సాయి వినీల్ కు పాఠశాల చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి…
- హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార పార్టీ నాయకుడు పిల్లల తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన వీడియో వైరల్ అయింది. తల్లిదండ్రులపై దాడి చేయడమే కాకుండా తన అధికార బలంతో…
- జనసేన అధినేత పవన్‌కల్యాణ్ సంచలన నిర్ణయం.ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు.అమరావతిలో జనసేన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సేనా గళం పేరుతో…
- అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో విషాదం.అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో పెళ్లి సంబరాలు విషాదంగా మారాయి. వివాహం జరిగిన కొద్ది గంటల్లోనే వరుడు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. జార్జియాలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. కేరళ…
- శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులు సందడి నెలకొంది. వేసవి సెలవులు కావడంతో భక్తులు భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి పోటెత్తారు. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో అలంకార దర్శనానికి అనుమతినిచ్చారు. ముందుగా ఆన్లైన్లో బుక్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 90661