Thursday, June 18, 2026
News Navigation
Thursday, June 18, 2026
News Navigation

Breaking

Thursday, June 18, 2026
Home Latest News ఎంపీ ఆఫీసులో రైతు దీక్షకు దిగిన సంజయ్…

ఎంపీ ఆఫీసులో రైతు దీక్షకు దిగిన సంజయ్…

by Satya
Sanjay started a farmer initiation in MP office...

కరీంనగర్‌లోని ఎంపీ ఆఫీసులో ‘రైతు దీక్ష’కు దిగారు బండి సంజయ్. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అమలుకు సాధ్యం కానీ, అనేక హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం గుప్పించిందని విమర్శించారు. అధికారంలోకి వచ్చాక అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని అన్నారు. ముఖ్యంగా ఆరు గ్యారంటీలు అంటూ నమ్మించి మోసం చేశారని మండిపడ్డారు. అకాల వర్షాల కారణంగా పంటనష్టం జరిగినా పట్టించుకోక పోవడం దారుణమన్నారు. నష్టపోయిన రైతులకు ఎకరానికి 20 వేల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫసల్ బీమాను కూడా అమలు చేయకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని గుర్తుచేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌లతో ప్రజలు విసిగిపోయారని అన్నారు. మోడీకి ఓటేయాలని దేశం మొత్తం ఎదురుచూస్తోందని, రాష్ట్రంలో కూడా మెజార్టీ సీట్లు సాధిస్తామని బండి ధీమా వ్యక్తం చేశారు.

Advertisements

You may also like

Our Visitor

025430
Total views : 147270

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.