రైతురుణ మాఫీని త్వరలోనే అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం రెడీ అవుతోందిరైతు భరోసా స్కీమ్ కు మంత్రివర్గ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సబ్ కమిటీ చైర్మన్ గా వ్యవహరిస్తుండగా..మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావును సభ్యులుగా నియమించింది. ఈ కమిటీ రైతు భరోసా స్కీంకు సంబంధించిన గైడ్ లైన్స్ ను సిద్ధం చేసి ప్రభుత్వానికి అందిస్తుంది. ఇక బీఆర్ఎస్ సర్కార్ రైతు బంధు కింద ఎకరానికి 10వేల రూపాయలు పెట్టుబడి సాయం కింద అందించగా రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం ఏడాదికొ ఒక్కోఎకరానికి 15వేల సాయం అందిస్తామని చెబుతోంది. అయితే ఎన్నికల్లో ఇచ్చిన హామీని అధికారంలోకి రాగానే రైతు భరోసా అమలు చేయాల్సి ఉండగా రైతు బంధు పథకంలో ఎన్నో అవకతవకలు జరిగినట్లు ప్రభుత్వం చెబుతోంది. ఈ అవకతవకలన్నింటినీ పరిగణలోనికి తీసుకుని పకడ్బందీగా గైడ్ లైన్స్ రూపొందించేందుకు ప్రభుత్వం తాజాగా కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఈ సబ్ కమిటీ ఇచ్చే విధివిధానాలను మాత్రమే పరిగణలోనికి తీసుకోకుండా..వాటిని అసెంబ్లీలో చర్చకు పెట్టి వాటిపై ఆయా పార్టీల నుంచి కూడా సలహాలు సూచనలు తీసుకుంటామని సీఎం రేవంత్ తెలిపారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రేపు మరోసారి ముంబైకి వెళ్లనున్నారు. కొంతకాలంగా రొటేటర్ కఫ్ గాయంతో బాధపడుతున్న ఆయన..భుజాలకు సంబంధించిన చికిత్స చేయించుకోనున్నారు. రెండు భుజాల కండరాలు దెబ్బతినడంతో ఇబ్బంది పడుతున్న పవన్ కల్యాణ్..ముంబై హాస్పిటల్‌లో ఇప్పటికే వైద్య పరీక్షలు…
- హెచ్-1బీ, పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.అమెరికాలో హెచ్-1బీ, పర్మ్ వర్క్ వీసాల జారీలో జరుగుతున్న అక్రమాలపై ట్రంప్ ప్రభుత్వం భారీ దర్యాప్తు చేపట్టింది. అమెరికా కార్మిక శాఖ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆంథోనీ డి’ఎస్పోసిటో వెల్లడించిన వివరాల ప్రకారం.. వీసా మోసాలపై ఇప్పటికే డజన్ల కొద్దీ సమ్మన్లు, సబ్‌పోనాలు…
- అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో కీలక అడుగు పడుతోంది. ఇప్పటికే కేంద్ర కార్యాలయాలు, బ్యాంకులు, హోటల్స్, విద్యా సంస్థలతో రూపుదిద్దుకుంటున్న రాజధాని ప్రాంతానికి ఇప్పుడు హైటెక్ స్కై కనెక్టివిటీ కూడా అందుబాటులోకి రానుంది. ఉండవల్లి సమీపంలో ఆధునిక సదుపాయాలతో హెలిపోర్ట్…
- భారత్-ఆస్ట్రేలియా సీఈఓలతో ప్రధాని మోదీ కీలక భేటీ.భారత్-ఆస్ట్రేలియా మధ్య ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథనీ అల్బనీస్‌తో కలిసి ఇరు దేశాల ప్రముఖ సీఈఓలు, వ్యాపార దిగ్గజాలతో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల…
- చెన్నై ఎగ్మూర్‌లోని ఆస్పత్రుల్లో సీఎం విజయ్ ఆకస్మిక తనిఖీలు.తమిళనాడు సీఎం విజయ్ పాలనలో తన మార్క్ చూపిస్తున్నారు. అవినీతి లేని పాలన అందిస్తానని చెబుతున్న విజయ్..ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఆధారాలతో సహా అవినీతి అధికారుల సమాచారం అందిస్తే వారిపై చర్యలు తీసుకుంటానని ప్రకటించిన ముఖ్యమంత్రి..తాజాగా ప్రభుత్వాస్పత్రుల్లో ఆకస్మిక…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 196506