బీజేపీ, బీఆర్ఎస్పై భువనగిరి లోక్సభ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను అడ్డుకునేలా ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా, లండన్ పర్యటనపై బీజేపీ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడారని ఎంపీ విమర్శించారు. అమెరికా పర్యటనలో హార్వర్డ్ యూనివర్సిటీ, ఎంఐటీ, వర్జీనియా టెక్ యూనివర్సిటీ ప్రొఫెసర్లతో సీఎం భేటీ అయి తెలంగాణలో ఇంజనీరింగ్ విద్య నాణ్యత, విద్యార్థుల స్కిల్ డెవలప్మెంట్ తదితర అంశాలపై చర్చించారని తెలిపారు. తెలంగాణ విద్యార్థులను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతోనే సీఎం విదేశీ పర్యటన చేపట్టారని చామల కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అయితే సీఎం పర్యటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, ఎంపీలు ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు తొలుత అవాస్తవాలు మాట్లాడారని, వాస్తవాలు తెలుసుకున్న తర్వాత తమ వ్యాఖ్యలను మార్చుకున్నారని విమర్శించారు.
#చామలకిరణ్కుమార్రెడ్డి #భువనగిరిఎంపీ #కేసీఆర్ #బీఆర్ఎస్ #తెలంగాణరాజకీయాలు #తెలంగాణ #కాంగ్రెస్ #రాజకీయవిమర్శలు #BhuvanagiriMP #KCR #BRS #TelanganaPolitics #Congress #Telangana
కేసిఆర్ తన కుటుంబం తప్ప తెలంగాణలో ఎవరూ బాగుపడవద్దని భావిస్తున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఉద్యమ సమయంలో తన కుటుంబం రాజకీయాల్లోకి రాదని చెప్పిన కేసీఆర్.. 1600 మంది బలిదానాలతో వచ్చిన తెలంగాణలో తన కుటుంబంలోనే ఐదు పదవులు ఇచ్చుకున్నారని విమర్శించారు. కేటీఆర్ అమెరికా నుంచి వచ్చి నేరుగా మంత్రి అయ్యారని, హరీష్ రావు ఎమ్మెల్యే కాకముందే మంత్రి అయ్యారని గుర్తుచేశారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఐదుగురు సోదరులకు ఎలాంటి పదవులు ఇచ్చుకోలేదని, అందరిలాగే దరఖాస్తు చేసుకుంటేనే ఆయన సోదరునికి భూమి కేటాయించారని స్పష్టం చేశారు. కాళేశ్వరంలో దండుకోవాలన్న ఆలోచనతోనే బీఆర్ఎస్ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పట్టించుకోలేదని, ఆ పార్టీకి దీనిపై మాట్లాడే అర్హతే లేదన్నారు. కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు తన దోస్తుల కంపెనీలకు ఏ విధంగా భూములు కట్టబెట్టారో తమకు అన్నీ తెలుసని, కుటుంబంలో పంపకాలు తేడా రావడం వల్లే కవిత కొత్త పార్టీ పెట్టారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికైనా కేటీఆర్ తన పిచ్చి మాటలు బంద్ చేయాలని ఎంపీ చామల కిరణ్ రెడ్డి హితవు పలికారు.