ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం మామిడిగూడెంలో కంటైనర్ పాఠశాలను మంత్రి సీతక్క ప్రారంభించారు.సింగరేణి సీఎస్ఆర్ నిధులు రూ.15 లక్షలతో ఏర్పాటు చేసిన కంటైనర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను మంత్రి ప్రారంభించారు.జిల్లా కలెక్టర్ హేమంత్ సహదేవరావుతో కలిసి విద్యార్థులతో మాట్లాడిన సీతక్క.. వారికి ఏకరూప దుస్తులు, షూస్ పంపిణీ చేశారు.విద్యార్థులతో కలిసి అల్పాహారం చేసిన మంత్రి.. మారుమూల గిరిజన ప్రాంతాల్లో మెరుగైన విద్యా సౌకర్యాల కోసం చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
Tag: