ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రోడ్లు బాగోలేవని వచ్చే ఎన్నికల్లో వైసీపీని వద్దనుకోవద్దని ఆయన అన్నారు. రోడ్ల వల్ల జీవన ప్రమాణాలు పెరుగుతాయా? అని ఆయన ప్రశ్నించారు. చెన్నై, కర్నూలు రాష్ట్ర రాజధానులుగా ఉన్నప్పుడు ఉత్తరాంధ్ర ప్రజలు అక్కడకు వెళ్లడానికి రెండు రోజులు పట్టేదని చెప్పారు. విశాఖ కంటే గొప్ప అర్హతలు ఉన్న రాజధాని ఏపీలో లేదని అన్నారు. విశాఖ రాజధాని వల్ల జీవన ప్రమాణాలు పెరుగుతాయని చెప్పారు. దేశంలోని ప్రతి రాష్ట్రంలో విద్యుత్తు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయని… మన కంటే ధరలు తక్కువ ఉన్న రాష్ట్రం ఏదో చెప్పాలని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ చేసిన ఉపయోగం లేని పనులు ఏమిటో టీడీపీ నేతలు చెప్పలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. సామాజిక సాధికార యాత్రలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ap politics
ఏపీ సర్కారు కనిగిరి రిజర్వాయర్ రైతులకు తీపి కబురు అందించింది. ఆయకట్టుకు నీరు విడుదల చేసింది. నెల్లూరు జిల్లా కోవూరు శాసనసభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నీటిని విడుదల చేశారు. పెన్నాడెల్టాకు 2 లక్షల ఎకరాలకు సాగురు అందిస్తామన్నారు. బుచ్చి, కోవూరు, కొడవలూరు, విడవలూరు మండలాలలోని 26 వేల ఎకరాలకు నీరు అందుతుందన్నారు. జగన్ ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వమన్నారు. ఇటీవలిఐఎబి సమావేశంలో టిడిపి నాయకులు అనవసర రాద్ధాంతం చేశారని ఎమ్మెల్యే విమర్శించారు. రైతుల పట్ల దొంగ ప్రేమ ప్రదర్శించారని ఆరోపించారు. టిడిపి వాళ్లకు ఇన్నాళ్లూ కనబడని ప్రేమ ఎన్నికలు వస్తున్నాయనగా పుట్టికొచ్చిందన్నారు.
వైసీపీ అక్రమాలపై టిడిపి నాయకులు తిరుపతి కలెక్టర్ ను కలిశారు.
భూకబ్జాలు, అక్రమ మైన్స్, దొంగ ఓట్ల వ్యవహారాన్ని కలెక్టర్ దృష్టికి టిడిపి నాయకులు
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీసుకెళ్లారు.వైసిపి ఎమ్మెల్యేలు, మంత్రులకు… ప్రభుత్వ అధికారులు వత్తాసు పలుకుతున్నారని ఫిర్యాదు చేశారు.కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వైసీపీ నేతలు దోచుకుంటున్నారని మండిపడ్డారు. వైసిపి నేతల అక్రమాలపై ఆందోళనలు చేస్తున్న టిడిపి నేతలపై అక్రమ కేసులను పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తిరుపతి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వేల దొంగ ఓటర్లను సృష్టించడమే కాకుండా….చనిపోయిన వారి ఓట్లను తీసివేయకుండా కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. కలెక్టర్ 15 రోజుల్లో స్పందించకుంటే… న్యాయస్థానాన్ని ఆశ్రయించి…వైసిపి నేతలు అక్రమంగా సంపాదించిన ప్రతి రూపాయిని ప్రజలు ముందు పెడతామని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు.
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 21 డివిజన్ లో ఉన్న రోడ్లపై మరమ్మత్తులు చేయాలని డిమాండ్ చేశారు నిత్యం రద్దీగా ఉండే బిఆర్టిఎస్ రోడ్ లోని పలుచోట్ల రోడ్లను మరమ్మత్తు చేయాలని డిమాండ్ చేశారు నిత్యం ఈ రోడ్లో ప్రయాణించే వాహనాలు రోడ్డు ప్రమాదాలు గురై ఎందరో ప్రజలు ప్రాణాలు బలి తీసుకుంటున్నారని తెలిపారు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే విష్ణు ఇప్పటికైనా కళ్ళు తెరిచి రోడ్లను మర మత్తులు చేసేంతవరకు మా పోరాటం ఆగదని తెలిపారు
ఈ కార్యక్రమంలో టిడిపి నుంచి రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు జనసేన నుంచి పోలిశెట్టి రవి సెంట్రల్ కోఆర్డినేటర్ తదితరులు పాల్గొన్నారు
వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రారంభించి నేటికీ ఆరేళ్ళు పూర్తయిన సందర్భంగా అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణములోని వైఎస్సార్ సర్కిల్ లో దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి గారి విగ్రహానికి పూలమాలలేసి కేక్ కటింగ్ చేసి నివాళులు అర్పించిన వైస్సార్సీపీ టౌన్ ప్రెసిడెంట్ సయ్యద్ జావీద్ ఖాద్రి పాల్గొన్న వైసీపీ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బాబయ్య పెద్ద ఎత్తున పాల్గొన్న వైస్సార్సీపీ పార్టీ కార్యకర్తలు, నాయకులు అభిమానులు.
గుంటూరులో టీడీపీ నేతల ఓట్ల తొలగింపు ప్రక్రియ కలకలం రేపుతోంది. తమ ఓట్లను వైసీపీ నేతలు తొలగించారని టీడీపీ కార్పొరేటర్లు మునిసిపల్ అధికారులకు పిర్యాదు చేశామన్నారు. ఇరవై ఏళ్లగా తన ఓటు గుంటూరులో ఉందని.. దానిని వైసీపీ నేతలు తొలగించారని కార్పొరేటర్ కోటేశ్వర రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు స్పందించకుంటే ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. పశ్చిమ నియోజకవర్గం టీడీపీకి కంచుకోట కాబట్టి ఇక్కడ వెయ్యి ఓట్లు తొలగించటం.. ప్రజాస్వామ్యంలో నియంత పాలన అవుతుందని కార్పొరేటర్ బుజ్జి అవేదన వ్యక్తం చేశారు. పఫామ్ 7 తో టీడీపీ ఓట్లు తొలగించిన వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కృష్ణాజిల్లా గుడివాడ పెద్ద కాలవ సెంటర్లో వినూత్న నిరసన చేపట్టారు. సీఎం జగన్ ఫ్లెక్సీ కు చెప్పుల దండ వేసి, దళిత మహిళ నేత అసిలేటి నిర్మల పిండ ప్రదానం చేశారు. దళితబిడ్డ అని చెప్పుకునే సీఎం జగన్, రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులను ఖండించనందుకు ఈ నిరసన చేపట్టారు. దళితులపై మూత్ర విసర్జన చేసినా.. స్పందించలేదని సీఎం జగన్ కి పశువుల అశుద్ధంతో పిండ ప్రదానం చేస్తున్నానని నిర్మల వీడియోలో తెలిపారు. దళిత బిడ్డగా, సోదరుడిగా, మేన మామగా సీఎం జగన్ చచ్చిపోయాడని అందుకే నేడు పిండ ప్రధానం చేస్తున్నట్లు నిర్మల సోషల్ మీడియా ద్వారా చెప్పారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ సీఎం జగన్ నోరు విప్పాలని టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా డిమాండ్ చేశారు.తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యల వీడియోను ఎక్స్ వేదికగా షేర్ చేశారు. సీఎం జగన్ గత నాలుగున్నరేళ్లుగా రాష్ట్రంలోని రోడ్ల గురించి పట్టించుకోలేదని టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా విమర్శించారు. జగన్ పాలనపై తెలంగాణ సీఎం, మంత్రులు కూడా హేళన చేస్తున్నారన్నారు. రాష్ట్రం పరువును జగన్ రోడ్డున పడేశారని అన్నారు. ప్రజల అవస్థలను జగన్ పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ప్రతిపక్షాలపై ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు.
ఏపీ హైకోర్టులో కోడికత్తి కేసు విచారణ జరిగింది. ఈ కేసులో నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావు బెయిల్ కోరుతూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని ఎన్ఐఏను ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 6కు వాయిదా వేసింది. దీంతో ఏపీ హైకోర్టు శ్రీనివాసరావు బెయిల్ పిటిషన్పై విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఎన్ఐఏ ఈ కేసుకు సంబంధించి కౌంటర్ దాఖలు చేశారు. దీంతో తదుపరి విచారణను హైకోర్టు ఈనెల 15కు వాయిదా వేసింది. ఈ కేసులో నిందితుడు శ్రీనివాసరావు తరఫున న్యాయవాది సలీం వాదనలు వినిపిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు శ్రీనివాసరావుకు బెయిల్ రాలేదు. కోడికత్తి ఘటన జరిగినప్పటి నుంచి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులోనే ఉన్నాడు. దీంతో కుటుంబ సభ్యులు సైతం శ్రీనివాసరావుకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతున్నారు. ఈ మేరకు సీజేఐకు సైతం లేఖ రాసిన సంగతి తెలిసిందే.
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తాజాగా బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిపై మరోసారి సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. నమ్మకద్రోహం పురంధేశ్వరి వ్యక్తిత్వంలోనే ఉందని దుయ్యబట్టారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరుతూ విలువల్లేని రాజకీయాలకు చిరునామాగా పురంధేశ్వరి మారారని మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలై ఉండీ టీడీపీకి సేవ చేస్తున్నారని దుయ్యబట్టారు. పురంధేశ్వరి, ఆమె భర్త చంద్రబాబు పల్లకీ మోస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణకు చెందిన ‘అన్న టీడీపీ’కి కొంత కాలం గౌరవ అధ్యక్షురాలిగా ఉండి ఆ పార్టీ ఎన్నికల్లో పరాజయం పాలయ్యాక కాంగ్రెస్లో చేరారంటూ మండిపడ్డారు.
ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో బహునేర్పరి.. పురంధేశ్వరి అంటూ సెటైర్లు వేశారు. ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉంటూ ఇంకో వైపు టీడీపీకి అనధికార గౌరవ అధ్యక్షురాలుగా కొనసాగడం అనైతికమని సాయిరెడ్డి అన్నారు. తండ్రిని కాంగ్రెస్ పార్టీ అవమాన పరిచిందనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నంత కాలం అంటకాగిందని ఆరోపించారు.






Total views : 90781