బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బయటకు వస్తే తమ అస్త్రాలు బయటకు తీస్తామని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు. కేసీఆర్ ఏం చేసినా తమ ప్రభుత్వానికి ఏమీ కాదన్నారు. తమతో 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారన్న కేసీఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఆయన మాటలకు తాము అగస్ట్లో సమాధానం చెబుతామన్నారు. అసలు ఎవరి ఎమ్మెల్యేలు ఎవరితో టచ్‌లో ఉన్నారో త్వరలో తెలుస్తుందన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్లో ముగ్గురు, బీజేపీలో ఇద్దరు మాత్రమే లీడర్లు ఉన్నారని ఎద్దేవా చేశారు. కానీ తమ పార్టీలో లీడర్లకు కొదవ లేదన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ గ్రాఫ్ పడిపోతోందని విమర్శించారు. అందుకే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి అమిత్ షాలకు నిద్రపట్టడం లేదన్నారు. తామే దేశభక్తులమని బీజేపీ నేతలు డబ్బా కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ నేతలు గ్రాఫిక్స్ హీరోలని జగ్గారెడ్డి ధ్వజమెత్తారు.
Bjp
(అనకాపల్లి జిల్లా)
పరవాడ మండలం తాడి గ్రామంలో పెందుర్తి NDA కూటమి అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు(Panchkarla Ramesh Babu) విస్తృత ప్రచారం చేశారు. గ్రామస్తులు, మహిళలు పంచకర్ల రమేష్ బాబు ను ఆప్యాయంగా పలకరిస్తూ హారతులతో వీర తిలకం దిద్ది ఆహ్వానించారు. ఈ ప్రచారంలో బాగంగా పంచకర్ల రమేష్ బాబుకి జన సైనికులు, మహిళలు, టీడీపీ శ్రేణులు, భాజపా శ్రేణులు, మరియు పంచకర్ల అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఒక ఎమ్మెల్యేగా తాడి గ్రామస్తులకు అండగా నిలబడాల్సింది పోయి, చిన్న తరలింపు ప్రయత్నం కూడా చేయలేదన్నారు. ఈ ఎమ్మెల్యేని ముఖ్యమంత్రిని ఈ ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రం భరించిందనీ అన్నారు. తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే సంవత్సరంలోపు తాడి గ్రామ తరలింపు జరగడం ఖాయం. అన్ని న్యాయపరమైన చిక్కులను అధిగమించి ఏదైతే స్ట్రక్చర్ కాంపౌండ్ దగ్గర నుంచి మంచి ఏరియాలో బ్రహ్మాండమైన కాలనీ నిర్మిస్థాం. గ్రామ ప్రజలకు పొల్యూషన్ లేని జీవితాన్ని ఇవ్వడమే ముఖ్యఉద్దేశ్యం.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఐదు సంవత్సరాలు రాక్షస పాలన చూసాం- పంచకర్ల రమేష్ బాబు| Panchkarla Ramesh Babu
ఉద్యోగ ఉపాధి అవకాశాన్ని తాడి ప్రజలకు ఇవ్వటానికి మేము కంకణ బద్దలమై ఉన్నాం. ఐదు సంవత్సరాలు ఒక దుర్మార్గపు రాక్షస పరిపాలన మనం చూసాం. ఏమన్నా అంటే ప్రతి ఎలక్షన్‌కి ఒక డ్రామా వేయటం సరసాధారణం. గత ఎలక్షన్ లో కోడి కత్తి కేసు, బాబాయిని తెలుగుదేశం పార్టీ చంపించిందని, మరి మొన్నటి మొన్న విజయవాడలో రాయి భౌన్స్ అయి ఇద్దరికి తగిలిందంట. లైట్లు తీసి ఎమ్మెల్యే ముఖ్యమంత్రి నువ్వు నన్ను కొట్టు నేను నిన్ను కొడతానని చెప్పి కొట్టించుకుని చిన్న గీత గీయించుకుని తెలుగుదేశం దాడి అని చెప్పుకునే దుర్మార్గపు రాజకీయం నడుస్తుందన్నారు. అంతకుముందు కార్లు బద్దలు కొట్టి, స్టేజీలు బద్దలు కొట్టి, బస్సుల మీద రాళ్లు వేసి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మీద దాడి, అది వైఎస్ఆర్సీపీ దాడి కాదా అన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని అన్నారు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- తెలంగాణ లో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే -మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు.కరీంనగర్ గడ్డ బిజెపి అడ్డాగా బండి సంజయ్ నిలబెట్టారని, ఇటీవల జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బిజెపి విజయం సాధించడంలో బండి సంజయ్ పట్టుదల, కరీంనగర్ బిజెపి శ్రేణుల కసి తోనే బల్దియా పై కాషాయ జెండా ఎగిరిందనీ, ఇలాంటి ఫలితం…
- హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గంలో అడుగుపడిన ‘రుద్రమ’ బ్రాండ్.గ్రామీణ మహిళల ఆర్థిక ఆత్మగౌరవానికి పరకాల నియోజకవర్గం సరికొత్త వేదికైంది. మహిళలను వ్యాపారవేత్తలుగా మార్చేందుకు, వారి ఆర్థిక సాధికారతే లక్ష్యంగా దామెర మండలం ల్యాదేళ్ల గ్రామంలో సరికొత్త అధ్యాయం మొదలైంది. మహిళా శక్తి వారోత్సవాల్లో భాగంగా ఇక్కడ ‘పరకాల స్కిల్ డెవలప్మెంట్…
- అప్పులు కావు,మీ వ్యాపారాలకు పెట్టుబడులు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ద్వారా అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ అన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సభ్యులకు ప్రభుత్వ సహకారంతో బ్యాంకుల ద్వారా మంజూరైన 2…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: NDA కూటమి అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు విస్తృత ప్రచారం
సిరిసిల్ల నేత కార్మికుల బకాయిల చెల్లింపుల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.50 కోట్లు విడుదల చేయడంపట్ల బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమాదేవి, జిల్లా అధ్యక్షులు ప్రతాప రామక్రిష్ణ, ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి, పార్లమెంట్ కో కన్వీనర్ ఆడెపు రవీందర్ హర్షం వ్యక్తం చేశారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ పోరాట ఫలితంగానే రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చిందన్నారు. ఈ మేరకు ఆయా నేతలు ఒక ప్రకటన విడుదల చేశారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
బతుకమ్మ చీరలను ఉత్పత్తి చేసిన యజమానులకు సైతం ప్రభుత్వం నుండి సక్రమంగా పేమెంట్లు రాకపోవడంతో దాదాపు రూ.270 కోట్ల మేరకు బకాయిలు పేరుకుపోయాయని, మిగిలిన బకాయిలను సైతం పూర్తిగా చెల్లించాలని డిమాండ్ చేశారు. దీంతోపాటు ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా కొత్త ఆర్డర్లను ఇచ్చి నేత కార్మికులకు పూర్తి స్థాయిలో ఉపాధి కల్పించాలని కోరారు. వీటితోపాటు పవర్ లూం కార్ఖానాలకు గత 30 సంవత్సరాల నుండి 50 శాతం సబ్సిడీతో అందిస్తున్న విద్యుత్ ను పునరుద్దరించాలని, కార్మికులకు ఇవ్వాల్సిన 10 శాతం యార్న్ సబ్సిడీని వెంటనే అందించి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను సంక్షోభం నుండి అధిగమించేలా అన్ని చర్యలు తీసుకోవాలని మనవి. వీటిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించని పక్షంలో బీజేపీ పక్షాన మళ్లీ ఉద్యమాన్ని ఉధ్రుతం చేస్తామని హెచ్చరించారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- తెలంగాణ లో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే -మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు.కరీంనగర్ గడ్డ బిజెపి అడ్డాగా బండి సంజయ్ నిలబెట్టారని, ఇటీవల జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బిజెపి విజయం సాధించడంలో బండి సంజయ్ పట్టుదల, కరీంనగర్ బిజెపి శ్రేణుల కసి తోనే బల్దియా పై కాషాయ జెండా ఎగిరిందనీ, ఇలాంటి ఫలితం…
- హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గంలో అడుగుపడిన ‘రుద్రమ’ బ్రాండ్.గ్రామీణ మహిళల ఆర్థిక ఆత్మగౌరవానికి పరకాల నియోజకవర్గం సరికొత్త వేదికైంది. మహిళలను వ్యాపారవేత్తలుగా మార్చేందుకు, వారి ఆర్థిక సాధికారతే లక్ష్యంగా దామెర మండలం ల్యాదేళ్ల గ్రామంలో సరికొత్త అధ్యాయం మొదలైంది. మహిళా శక్తి వారోత్సవాల్లో భాగంగా ఇక్కడ ‘పరకాల స్కిల్ డెవలప్మెంట్…
- అప్పులు కావు,మీ వ్యాపారాలకు పెట్టుబడులు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ద్వారా అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ అన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సభ్యులకు ప్రభుత్వ సహకారంతో బ్యాంకుల ద్వారా మంజూరైన 2…
గుంటూరు పొగాకు నోట్లో ఉంటె ఏమి గూట్లో ఉంటె ఏమి సామెత లాగా, ఎంపి గా మిథున్ రెడ్డి ఉంటె ఏమి లేకుంటే ఏమి అని భావించుకునే స్థితికి ప్రజలు వచ్చారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి, రాయచోటి ఎన్నికల అసెంబ్లీ ఇంచార్జి నాగోతు రమేష్ నాయుడు (Nagothu Ramesh Naidu) విమర్శించారు. అన్నమయ్య జిల్లా రాయచోటి లో భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో భాజపా జిల్లా అధికార మీడియా ప్రతినిధి పాలగిరి శ్రీనివాస రాజు, సీనియర్ నాయకులూ అరమాటి శివగంగి రెడ్డి, అసెంబ్లీ కన్వినర్ తో పాటు అసెంబ్లీ భాజపా నాయకులు శ్రేణులు తో కలిసి వారు పాల్గొన్నారు. అనంతరం మీడియా సమావేశంలో వైసిపి ప్రభుత్వం పై ద్వజమెత్తిన నాగోతు రమేష్ నాయుడు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు జగన్ మోహన్ రెడ్డి అధికారంలో కి వచ్చిన ఆరు నెలల్లోనే గాలేరు నగిరి, హంద్రీ నీవా ప్రాజెక్ట్ లతో పాటు ఇతర సాగునీటి ప్రాజెక్ట్ లు పూర్తి చేస్తామన్న సిఎం జగన్ మోహన్ రెడ్డి తెగిపోయిన అన్నమయ్య, పించా జలాశయాల పునరుద్దరించే దిశగా అడుగులే వేయలేదని ఆరోపించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఈ ప్రాంతాన్ని హార్టికల్చలర్ హబ్ గా చేసి ధరల స్థిర కరణ నిధిని ఏర్పాటు చేస్తామన్నారు ఇప్పటికి చేయలేదన్నారు. రాయలసీమలో పరిశ్రమలకు మానవ వనరులకు భూములు అనుకూలంగా ఉన్నప్పటికీ పరిశ్రమలను ఏర్పాటు చేయడంలో జగన్ ప్రబుత్వం విపలం అయ్యిందన్నారు. ఓ ప్రజాప్రతినిధిగా, సొంత జిల్లా నుండి సిఎం గా ఉన్న జగన్ మోహన్ రెడ్డి ఈ ప్రాంత ప్రజలను పూర్తిగా నిర్లక్ష్యం చేసారని ద్వజమేత్తారు. నెంబర్ 2 అనే చెప్పుకునే ఎంపి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి లోక్ సభ ప్యానెల్ స్పీకరగా పని చేస్తున్న ఆయనకు డిల్లీలో పెద్ద లాబింగే ఉన్నప్పటికీ లిక్కర్ వ్యాపారానికో, తన పరిశ్రమలను పెంపొందించుకోవాడానికో, కాంట్రాక్టర్లు కోట్లకు పెంచుకునేందుకు ఉపయోగించుకున్నారే తప్ప ప్రజలకు తను ఏమాత్రం ఉపయోగపడలేదన్నారు.
రెండు సార్లు అత్యదికమైనటువంటి మేజార్టీతో రాజంపేట పార్లమెంట్ నుంచి గెలిచినా నవయువకుడు, ఇదే ప్రాంతానికి చెందిన ముఖ్యమంత్రి కుడా నవయువకుడే కాని ఈ ఇద్దరు కుడా ఈ ప్రాంతానికి రు ఏమి చేశారు అనే దానికి బహిరంగంగా చర్చకు సిద్దమా అని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుందన్నారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ముడన్నర ఏండ్లుగా ఉన్న కాలంలో జరిగిన అభివృద్దిని.. ఈ ఇదేండ్లలో మీరు సొంతంగా ఎందుకు అభివృద్ధి చేయల పొయ్యారని విమర్శించారు. కిరణ్ కుమార్ రెడ్డి హయంలో జరిగిన్ అభివృద్ధికి మీరు చేసిన అభివృద్దికి మీరు చర్చకు వచ్చిన మేము సిద్దమేనని హెచ్చరించారు.ప్రజాప్రతినిధులు గెలిచినా తరువాత ప్రజలకు మొండి చేయి చూపించారని ఆరోపించారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కుల మత, పార్టీలకతీతంగా, కూటమి భారతీయ జనతా పార్టీ తరపున రాజంపేట పార్లమెంట అభ్యర్ధిని కిరణ్ కుమార్ రెడ్డి ని గెలిపించు కునేందుకు సిద్దంగా ఉన్నారన్నారు. కేంద్రంలో నరేద్ర మోడీ రాక తద్యం.. ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు సత్యం… ఈ ప్రాంతంలో నూటికి నూరు శాతం అభివృద్ధి జరిగి తీరుందన్న ధీమాను వ్యక్తం చేశారు.
కిరణ్ కుమార్ రెడ్డి ఎక్కడ పర్యటించిన అద్బుతమైన స్పందన ఉందన్నారు. అయోధ్యలో ఎవిధమినటువంటి చిన్న పాటి ఘర్షణలు లేకుండా ఈ దేశంలో నున్నటువంటి అందరి మతాల సహకారం తీసుకోని ఆలయం ను నిర్మింప జేయడమే కాకుండా అన్ని మతాల వాళ్ళను కుడా ఉత్సవాలలో పాల్గొనే విధంగా ఏర్పాటు చేసిన ప్రధాని మోడిని నిర్ణయం పట్ల ప్రతి ఒక్కరు హర్షిస్తున్నారని కొమియాడారు. రాబోవు ఎన్నికలల్లో నరేంద్ర మోడీ గారి పట్ల సానుకూలత ,డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ అభివృద్దిలో మరింత వేగం పెరుగుతుందని ఆశభావన్ని వ్యక్తం చేశారు. కృత్రిమంగా రాయచోటి, కోడూరు, రాజంపేట కరువు విలయతాండవం చేయడానికి ఇసుక మాఫియానే కారణం కాదా అని వారు ప్రశ్నించారు. ఎట్లో ఇసుకను ఇష్టం వచ్చినట్లు ఇతర రాష్ట్రానికి టిప్పర్ ను 2,40,౦౦౦ రూపాయలకు తరలిచ్చి బ్లాక్ లో అమ్ముకోవడం కారణంగా భూమిలో నిటి శతం తగ్గిపొయ్యి బోర్లలో వెయ్యి అడుగులు వేసిన నీరు పడిన దుస్థితికి వైసిపి ప్రజాప్రతినిధులు తీసుకువచ్చారని వారు ద్వజమెత్తారు. వీటన్నింటికి కుడా ఓటు తోనే బుద్ది చెప్పాలని ప్రజలు నిశ్చయించుకున్నట్లు వారు తెలియజేశారు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
బీజేపీ తరఫున రఘునందన్ రావు(Raghunandan Rao) నామినేషన్ దాఖలు..
తెలంగాణ(Telangana)లో నామినేషన్లు(Nominations) జోరందుకున్నాయి. మెదక్ పార్లమెంటు స్థానానికి బీజేపీ(BJP) తరఫున రఘునందన్ రావు నామినేషన్ దాఖలు చేశారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయం నుంచి ఆయన ఊరేగింపుగా వెళ్లారు. రిటర్నింగ్ అధికారి, మెదక్ జిల్లా కలెక్టర్ కూడా అయిన రాహుల్ రాజుకు తన అభ్యర్థిత్వ పత్రాలను అందజేశారు. ప్రధాని మోదీ చేసిన అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయని రఘునందన్ రావు ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికలలో తెలంగాణలో బీజేపీ తన సత్తా నిరూపిస్తామని చెప్పారు. ప్రజలు సత్యం వైపు ఉండాలని కోరారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ షురూ…
- తెలంగాణ లో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే -మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు.
- హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గంలో అడుగుపడిన ‘రుద్రమ’ బ్రాండ్.
- అప్పులు కావు,మీ వ్యాపారాలకు పెట్టుబడులు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గత పదేళ్లలో తెలంగాణ(Telangana) రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 10 లక్షల కోట్ల రూపాయలు కేటాయించిందని కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ పార్లమెంట్(Secunderabad Parliament) బీజేపీ(BJP) అభ్యర్థి కిషన్‌రెడ్డి(Kishan Reddy) తెలిపారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనపై ఇప్పటి వరకు ఒక్క అవినీతి మచ్చ కూడా లేదన్నారు. ఎవరినీ బెదిరించలేదని, ఎవరిపైనా పక్షపాత ధోరణితో వ్యవహరించలేదని చెప్పారు.
ఇది చదవండి: ఆ ఉమ్మడి జిల్లాలో రసవత్తరంగా మారిన రాజకీయం…
తనపై కొందరు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, అలాంటి వారికి ప్రజలు గతంలోనే బుద్ధి చెప్పారన్నారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి అభివృద్ధి కోసం పని చేశానని భావిస్తేనే ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. మరోసారి గెలిపించి ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించాలని కోరారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- తెలంగాణ లో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే -మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు.
- హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గంలో అడుగుపడిన ‘రుద్రమ’ బ్రాండ్.
- అప్పులు కావు,మీ వ్యాపారాలకు పెట్టుబడులు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆ ఉమ్మడి జిల్లా ఏది …ఆ హార్ట్ సీట్ గా మారిన పార్లమెంటు స్థానం ఏది…
లోక్ సభ ఎన్నికలు వేళ ఆ ఉమ్మడి జిల్లాలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఉమ్మడి జిల్లాలో ఉన్న ఓ పార్లమెంట్ సెగ్మెంట్ నుండి హ్యాట్రిక్ కొట్టిన బి ఆర్ యెస్ మరో విజయం సాధించాలని భావిస్తుంటే, రాష్ట్రంలో అధికారం సాధించి దూకుడు మీదున్న కాంగ్రెస్ ఈ సారి విజయం మాదే అంటూ ప్రచారం చేస్తున్నారు. కేంద్రంలో మరోసారి బిజెపి పార్టీ అధికారంలోకి రావాలంటే ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో నన్ను గెలిపియ్యాలంటూ బిజెపి అభ్యర్థి కోరుతున్నారు. మూడు ప్రధాన పార్టీలు ఎలాగైనా తమ పట్టును నిలుపుకునేందుకు అస్త్రాలు సిద్దం చేసుకుంటున్నాయి. ఇంతకు ఆ ఉమ్మడి జిల్లా ఏది… ఆ హార్ట్ సీట్ గా మారిన పార్లమెంటు స్థానం ఏదో ఇప్పుడు చూద్దాం.
పాలమూరు జిల్లా (Palamuru District) : ఉమ్మడి జిల్లాలో రెండు పార్లమెంట్ సెగ్మెంట్లు…
ఉమ్మడి పాలమూరు జిల్లా (Palamuru District) కాంగ్రెస్ పార్టీకి కంచుకోట గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో 14 నియోజకవర్గాలకు గాను 12 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఉమ్మడి జిల్లాలో రెండు పార్లమెంట్ సెగ్మెంట్లు ఉన్నాయి. అవి మహబూబ్ నగర్ మరియు నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానాలు.. అయితే మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ అన్ని రాజకీయ పార్టీలకు హాట్ సీట్ గా మారింది. దేశ రాష్ట్ర రాజకీయాల మార్పుకు తగ్గట్లు ఇక్కడి పార్లమెంట్ సెగ్మెంట్ లోని ప్రజలు తీర్పు ఉంటుందన్న సెంటిమెంట్ తో అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావించి గెలుపు కోసం ప్రయత్నిస్తున్నాయి. టిఆర్ఎస్, బిజెపి, కాంగ్రేస్ ల నడుమే ప్రధాన పోటి ఉంటుండగా… ఎవరికి వారే గెలుపు పై ధీమాతో ఉన్నారు.
ఇక్కడి నుంచి గెలిచిన వారికి హస్తినాలో..
ఇక్కడ గెలిచిన వారు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతుండటం…. ఇక్కడి నుంచి గెలిచిన వారికి హస్తినాలో మంచి పలుకుబడి దక్కుతుండటంతో పాలమూరు (Palamuru District) బరిలో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. మహబూబ్ నగర్ పార్లమెంటు సెగ్మెంట్ లో ఏడు అసెంబ్లీ నియోజక వర్గాలున్నాయి. షాద్ నగర్, మక్తల్, కొడంగల్, మహబూబ్ నగర్, నారాయణపేట, జడ్చర్ల, దేవరకద్ర, నియోజక వర్గాలు ఈ పార్లమెంటు పరిధిలో ఉన్నాయి.ఈ పార్లమెంట్ సెగ్మెంట్ లో 16 లక్షల 75 వేల మంది ఓటర్లున్నారు. ఇక్కడి నుంచి గెలుపొంది పార్లమెంటులో అడుగుపెట్టిన వారంతా జాతీయ రాజకీయాల్లో పేరు ప్రఖ్యాతలు గడించిన వారే కావడం గమనించ దగ్గ విషయం.
ఉప ఎన్నికలతో కలిపి 17 సార్లు ఎన్నికలు…
1957 నుంచి ఇప్పటి వరకు జరిగిన ఉప ఎన్నికలతో కలిపి 17 సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో ఏడు సార్లు కాంగ్రెస్ పొందింది. ఈ పార్లమెంట్ నుండి నాలుగు సార్లు మల్లికార్జున్ గౌడ్ విజయం సాధించారు. చివరి సారిగా 2004లో కాంగ్రెస్ జెండా ఎగురవేసింది. మళ్లీ 20 ఏండ్ల తర్వాత తిరిగి పాలమూరు పార్లమెంట్ ను కైవసం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. జే రామేశ్వర్ రావు, మూడు పర్యాయాలు మరియు జైపాల్ రెడ్డి, జితేందర్ రెడ్డిలు రెండు పర్యాయాలు ఇక్కడి నుంచి గెలుపొంది పార్లమెంటులో అడుగు పెట్టగా…. 2009 లో కేసీఆర్ ఇక్కడి నుంచి గెలుపొంది తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించారు.
అధిష్టానం బరిలో సిట్టింగ్ ఎంపి మన్నె శ్రీనివాస్ రెడ్డి…
ఈ సారి ఎన్నికల్లో టిఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపి మన్నె శ్రీనివాస్ రెడ్డి ని అధిష్టానం బరిలో నిలపగా… బిజెపి నుంచి డికే అరుణ పోటీలో ఉన్నారు. ఇక కాంగ్రేస్ పార్టి నుంచి కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఏఐసిసి సెక్రటరీ చల్లా వంశీచంద్ రెడ్డి బరిలో వున్నారు… గత ఎన్నికల్లో పోటీ చేసిన నేతలే మరోసారి పోటీ పడుతున్నారు.ఇదిలా ఉంటే పాలమూరు (Palamuru District) సెంటిమెంట్ పై అన్ని రాజకీయ పార్టీలు కూడా ద్రుష్టి పెట్టాయి.ఇక్కడి నుంచి ఎంపిగా గెలిచిన వారందరు కేంద్రంలో చక్రం తిప్పిన వారే.స్థానిక ఎంపిగానే కేసీఆర్ రాష్ట సాధన ఆ తర్వాత రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయ్యారు. ఇక మాజీ ఎంపి అయిన జితేందర్ రెడ్డి కూడా లోక్ సభలో టీఆర్ ఎస్ పక్షనా ప్రతిపక్ష నేతగా గతంలో వ్యవహరించారు.
జాతీయ రాజకీయాల్లో కీ రోల్ పోషించిన వారు…
గతంలో ఎంపీలుగా గెలిచిన జైపాల్ రెడ్డి, మల్లిఖార్జున్ లు కేంద్ర మంత్రులుగా పనిచేసి జాతీయ రాజకీయాల్లో కీ రోల్ పోషించిన వారు కావడంతో, ఇక్కడ గెలిస్తే జాతీయ స్థాయిలో ఫోకస్ లభిస్తుందని గట్టిగా నమ్ముతున్నారు. బరిలో నిలుస్తున్న నేతలు. అందుకే ప్రతిష్టాత్మకంగా భావించి గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ బరిలో నిలిచిన ప్రధాన పార్టీలు ఎవరికి వారే గెలుపుపై లెక్కలు వేసుకుంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.ఈ పార్లమెంట్ పరిధిలోని ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు నియోజక వర్గాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్దులే గెలుపొందారు. వీరందరికి కలిపి 1,00,439 మెజార్టి ఉంది. అందుకే సునాయాసంగా గెలుపొందుతామనే ధీమాతో కాంగ్రెస్ పార్టీ ఉంది.
100 రోజుల్లో ఇచ్చిన హామీలను అమలు చేశామంటూ ప్రచారం…
మొన్నటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ పార్టీకి 6,11514, బీఆర్ఎస్ పార్టీకి 5,11 017, బిజెపి పార్టీకి 1,12,000 ఓట్లు నమోదు అయ్యాయి. దీంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు గెలుపే లక్ష్యంగా పని చేస్తున్నారు. సిఎం రేవంత్ రెడ్డి సొంత పార్లమెంట్ నియోజకవర్గం కావడంతో సవాల్ గా తీసుకున్న కాంగ్రెస్ నేతలు ప్రచారని విస్తృతంగా చేస్తున్నారు. కేవలం 100 రోజుల్లో ఇచ్చిన హామీలను అమలు చేశామంటూ ప్రచారం కొనసాగిస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎంపి కి టికెట్ ఇచ్చి రంగంలోకి దిగింది. కానీ సిట్టింగ్ ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి ఇప్పటి వరకు ఎన్నికల ప్రచారంలో యాక్టివ్ లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ మూడు లక్షలకు పైగా మెజార్టితో గెలిపించుకుంటామని, పాలమూరు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఈ సారి టిఆర్ఎస్ పార్టి అభ్యర్ది గెలుపొందితే అది ఆ పార్టికి నాలుగోసారి వరుసగా గెలుపొందినట్లుగా రికార్డు వుంటుంది.
బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ పై కాంగ్రెస్ ఆశలు…
2009, 2014, 2019 ఇప్పుడు ఎలాగైనా సిట్టింగ్ స్థానాని కైవసం చేసుకోవాలని ప్రయత్నం చేసిన ఎంపీగా మన్నే శ్రీనివాస్ రెడ్డి ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు సైతం పార్లమెంట్ లో ఎవరు ప్రచారం చేయకపోవడం బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ పై కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన కీలక నేతలు అంత ఇప్పటికే కాంగ్రెస్ గూటికి చేరారు. 2019 మే నెలలో జరిగిన 17వ లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన మన్నె శ్రీనివాస్ రెడ్డి మహబూబ్‌నగర్ ఎంపీగా విజయం సాధించారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి డి.కె అరుణపై 56,404 ఓట్ల మెజారిటీతో శ్రీనివాస్ రెడ్డి గెలుపొందారని తెలిసిందే.
బరిలో బిజెపి నుంచి మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ డికే అరుణ…
ఇక బిజెపి నుంచి మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్న డికే అరుణ బరిలో నిలుస్తున్నారు. గత ఎన్నికల్లో చివర్లో టికెట్ దక్కించుకొని గట్టి పోటీ ఇచ్చిన డీకే అరుణ ఈసారి ఎలాగైనా గెలువాలని కసరత్తు చేస్తోంది. ఇక్కడ ఎంపీగా గెలుస్తే కచ్చితంగా కేంద్రంలో మంచి పదవీ వస్తుందని, గెలుపే లక్ష్యం గా పని చేస్తోంది… మొన్నటి వరకు బిజెపి టికెట్ వస్తుందని ఆశించిన మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి బిజెపి పార్టీకి రాజీనామా చేయడంతో పార్లమెంట్ ఎన్నికల్లో డీకే అరుణనే కీలకపాత్ర పోషిస్తుంది… బిజెపి శ్రేణులు కూడా కొత్త జోష్ తో ఈ ఎన్నికలకు పోతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రేస్ పార్టిలో ఉన్నప్పుడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పరిచయాలు, తనతో పాటు కమలం గూటికి చేరిన అనుచరవర్గంతో పాటు హర్డ్ కోర్ బిజెపి క్యాడర్ కలిసొస్తుందని భావిస్తున్నారు.
అయోధ్యలో రామాలయ నిర్మాణం తమకు కలిసివస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు…
గతంలో ఎంపి గా పోటి చేసిన అనుభవం, బిజెపి అధిష్టానం కూడా ఈ సీట్ ను ప్రతిష్టాత్మకంగా భావిస్తుండటం గెలుపు పై అంచనాలు పెంచుతున్నట్లు చెప్పవచ్చు. 1999 ఎన్నికల్లోనే ఈ స్థానాన్ని తన ఖాతాలో వేసుకున్న బీజేపీ, 2019 ఎన్నికల్లో 3 లక్షలకు పైచిలుకు ఓట్లతో రెండోస్థానంలో నిలిచింది. ఈసారి మోడీ ఇమేజ్‌కు తోడు అయోధ్యలో రామాలయ నిర్మాణం తమకు కలిసివస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం పార్లమెంట్ ఎన్నికల్లో వుంటుందని కచ్చితంగా 7 అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు వున్నారు. దీంతో గత ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందిన వంశీచంద్ రెడ్డి అభ్యర్దిత్వాన్ని మరోసారి పార్టీ ఖరారు చేసిన హస్తం పార్టి అధిష్టానం.
పాలమూరు జిల్లా (Palamuru District)లో సాంప్రదాయ ఓటు బ్యాంకు…
కాంగ్రెస్ కంచుకోట గా పేరున్న పాలమూరు జిల్లా (Palamuru District) లో సాంప్రదాయ ఓటు బ్యాంకు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వుండటంతో ఈ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలే వస్తాయనే భావనతో కాంగ్రేస్ శ్రేణులు ముందుకు పోతున్నాయి. ఇటీవల ఆయా నియోజకవర్గాలలో వుండే ఇతర పార్టీలకు చెందిన కీలక నేతలంతా కాంగ్రెస్ పార్టీల్లో చేరుతుండటం కొంత వరకు గెలుపు పై ధీమా గా వుంది. హాట్ సీట్ గా మారిన పాలమూరు బరిలో ఎవరు విజేతగా నిలుస్తారో వేచి చూడాలి. ఓటరు తీర్పు ఎవరిని హస్తినకు పంపుతుందో , ఎవరిని ఇంటికి పరిమితం చేస్తుందా అని అంతా ఆసక్తిగా చూస్తున్నారు.
ఇది చదవండి : డీ మార్ట్ ఫుడ్ ప్రొడక్ట్స్ లో చచ్చిన ఎలుక కలకలం..
- తెలంగాణ లో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే -మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు.
కరీంనగర్ గడ్డ బిజెపి అడ్డాగా బండి సంజయ్ నిలబెట్టారని, ఇటీవల జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బిజెపి విజయం సాధించడంలో బండి సంజయ్ పట్టుదల, కరీంనగర్ బిజెపి శ్రేణుల కసి తోనే బల్దియా పై కాషాయ జెండా ఎగిరిందనీ, ఇలాంటి ఫలితం… - హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గంలో అడుగుపడిన ‘రుద్రమ’ బ్రాండ్.
గ్రామీణ మహిళల ఆర్థిక ఆత్మగౌరవానికి పరకాల నియోజకవర్గం సరికొత్త వేదికైంది. మహిళలను వ్యాపారవేత్తలుగా మార్చేందుకు, వారి ఆర్థిక సాధికారతే లక్ష్యంగా దామెర మండలం ల్యాదేళ్ల గ్రామంలో సరికొత్త అధ్యాయం మొదలైంది. మహిళా శక్తి వారోత్సవాల్లో భాగంగా ఇక్కడ ‘పరకాల స్కిల్ డెవలప్మెంట్… - అప్పులు కావు,మీ వ్యాపారాలకు పెట్టుబడులు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ద్వారా అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ అన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సభ్యులకు ప్రభుత్వ సహకారంతో బ్యాంకుల ద్వారా మంజూరైన 2…
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: ఆ ఉమ్మడి జిల్లాలో రసవత్తరంగా మారిన రాజకీయం…
ఏపీ(AP)లో హోరా హోరీగా సాగుతున్న సమరంలో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కు పెద్ద ఊరట లభించింది. పవన్ కే కాదు మొత్తంగా టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికే బిగ్ రిలీఫ్(Big Relief) అని చెప్పొచ్చు. ఇంతకాలం సరైన గుర్తు లేక.. తాత్కాలికంగా ఉన్న గుర్తు గాలిలో వేలాడుతూ అయోమయంలో ఉన్న పవన్ కళ్యాణ్ కు ఏపీ హైకోర్టు ఆదేశాలు కాస్తంత కాదు భారీగానే రిలీఫ్ ఇచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే కొత్త ఊపిరులు ఊదిందని చెప్పొచ్చు. ఎందుకంటే జనసేన పార్టీకి పర్మనెంట్ గుర్తు ఇంతవరకు లేదు. కేంద్ర ఎన్నికల నిబంధనల ప్రకారం ఈసీ గుర్తింపు ఉన్న పార్టీలకే పర్మనెంట్ గుర్తు కేటాయిస్తారు. జనసేన ఇప్పటి వరకు ఈసీ వద్ద రిజిస్టర్ అయిన పార్టీయే తప్ప ఈసీ గుర్తించిన పార్టీ మాత్రం కాదు. అందుకే ఆ పార్టీ గుర్తు ప్రతి ఎన్నికల సమయంలోనూ వివాదాస్పదమవుతోంది. జనసైనికుల్లో భయాన్ని పెంచుతోంది.
ఇది చదవండి: అన్నమాచార్య విశ్వ విద్యాలయం ఎదురుగా నిరసన కార్యక్రమం..
పవన్ కళ్యాణ్ లో లేని ఆందోళన రేకెత్తిస్తోంది. వాస్తవానికి పవన్ కళ్యాణ్ గాజు గ్లాసు గుర్తును ఇష్టపడుతున్నారు. దాన్నే నమ్ముకున్నారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా గాజు గ్లాస్ గుర్తు తమకే కేటాయించాలని ఆయన ఈసీని అభ్యర్థించారు కూడా. అయితే, రిజిస్టర్డ్ పార్టీ మాత్రమే కావడంతో పక్కా గుర్తు ఎలా ఇస్తారన్న వివాదం చెలరేగింది. దీనిపై పవన్ ప్రత్యర్థులు కొందరు ఈసీ ముందుకు వెళ్లారు. గాజు గ్లాస్ గుర్తు తమకే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. ఈ దశలో కోర్టు తీర్పుపైనే సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది. ఈ తరుణంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో పవన్ హమ్మయ్య అనుకున్నారు. గాజు గ్లాస్ గుర్తు కేవలం జనసేనకే ఇవ్వాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు బంపర్ ఆఫర్ .
- అత్యంత ప్రతిష్ఠాత్మకం ఏపీలో యోగాంధ్ర-2026.
- రాష్ట్ర ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తోందన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి ..
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక(Secunderabad Cantonment By-Election)కు సంబంధించిన బీజేపీ(BJP) తరుపున పోటీ చేయబోయే అభ్యర్ధిని ప్రకటించింది. తెలంగాణ(Telangana), ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల(Uttar Pradesh)లో త్వరలో జరగబోయే ఉపఎన్నికలకు సంబందించి అభ్యర్థుల లిస్ట్ విడుదల చేసిన బీజేపీ.. తెలంగాణలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ అభ్యర్ధిగా డా. టీఎన్ వంశా తిలక్ పేరును ప్రకటించింది.
ఇది చదవండి: బాసర ట్రిపుల్ ఐటీలో మరో విద్యార్థి సూసైడ్ కలకలం
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన శ్రీ గణేష్ నారాయణన్(Shri Ganesh Narayanan) కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోగా.. ఉప ఎన్నిక అభ్యర్ధి కోసం బీజేపీ తీవ్ర కసరత్తులు చేసిన రాష్ట్ర నాయకత్వం ముగ్గురు పేర్లతో కూడిన లిస్ట్ ను అధిష్టానానికి పంపింది. దీనిపై అధిష్టానం చర్చించి వంశీ తిలక్ పేరును ఫైనల్ చేసింది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- తెలంగాణ లో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే -మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు.
- హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గంలో అడుగుపడిన ‘రుద్రమ’ బ్రాండ్.
- అప్పులు కావు,మీ వ్యాపారాలకు పెట్టుబడులు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వన్ నేషన్.. వన్ ఎలక్షన్ (One Nation.. One Election) :
వన్ నేషన్.. వన్ ఎలక్షన్ (One Nation.. One Election) : కాంగ్రెస్‌కు కొంచెమైనా సిగ్గుండాలని, అధికారంలోకి వస్తే 370 ఆర్టికల్ రద్దు చేస్తాం, ట్రిపుల్ తలాక్‌ను తిరిగి అమలు చేస్తామని చెప్పడం సిగ్గుచేటని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే ఐదేండ్లలో పేదలు, మహిళలు, యువకులు, రైతులు ఈ నాలుగు సెక్టార్లపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించనుందని, దీనికి అనుగుణంగానే మేనిఫెస్టో ఉందని ఆయన పేర్కొన్నారు.
ఇది చదవండి : కొండాపూర్ చౌరస్తా లోని పవర్ మ్యాక్స్ ఫిట్నెస్ సెంటర్ లో అగ్నిప్రమాదం….
మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అందించాలని చట్టం చేశామని, జనగణన పూర్తయ్యాక దీన్ని అమలుచేస్తామని ఆయన స్పష్టంచేశారు. పోస్టాఫీసులను సోషల్ సెక్యూరిటీ కేంద్రాలుగా ఉపయోగించాలని, విలేజ్ బ్యాంకింగ్‌గా ఉపయోగించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. వన్ నేషన్.. వన్ రేషన్ లాగే.. వన్ నేషన్.. వన్ ఎలక్షన్ అవసరమని, అనేక దేశాల్లో ఈ విధానం ఉందని, భారత్‌లో కూడా వస్తే.. అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించవచ్చని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: వన్ నేషన్.. వన్ ఎలక్షన్…









Total views : 90159