యాంటి ఆక్షిడెంట్ గా పనిచేస్తుంది. ” ఇర్గోథియోనైన్ , సెలీనియం ” అనే రెండు యాంటీ ఆక్షిడెంట్లు ఉంటాయి. విటమిన్ ‘D’ పుస్కలము గా లభిస్తుంది అందువల్ల ఎముకలు దంత పుష్టికి సహకరిస్తుంది. మామూలుగా ఆహారములో విటమిన్’D’ లభించదు. పుట్టగొడుగులు ఆల్ట్రావైలెట్ -బి కిరణాలకు ఎక్స్ పోజ్ చేయడం వల్ల విటమిన్ డి బాగా తయరవుతుంది. మామూలుగా సూర్యకిరణాల తాకిడివల్ల శరీరానికి విటమిన్ ‘D’ అందుతుంది. అయితే దీనివలన సన్ట్యాన్ కి గురి అయ్యె ప్రమాధముంది. వీటిలో మొక్కలు , జంతువులకు సంబంధించిన లక్షణాలు రెండూ కనిపిస్తాయి. జంతువుల మాదిరిగా పుట్టగొడుగులు ఫోటోసింథసిస్ కి అనువైనవి కావు. భూచి నుంచి గ్రహించిన పోషకాలు కలిగిఉంటాయి కావున మొక్కకలలోని లక్షణాలు కలిగిఉంటాయి. మాంస్కృత్తులు లభిస్తాయి. శరీర సౌష్టవం , కండర పుష్టికి దోహదపడతాయి. పుట్టగొడుగులలో ఉండే కాపర్ ఎర్రరక్తకణాల ఉత్పత్తికి తోడ్పడి మెదడుకి , కండరాలకు , ఆక్షిజన్ సరఫరా అధికమయినందున వాటి పని సామర్ధ్యము పెరుగుతుంది. గుండె , ఊపిరితిత్తులు ఆరోగ్యం గా ఉంటాయి. డయబిటీస్ ను తగ్గిస్తుంది. రక్తపోటుకు గొడుగు బరువు తగ్గాలని అనుకునేవారు పుట్టగొడుగులు ఎక్కువగా తినటం మంచిది. సగం కప్పు పుట్టగొడుగుల్లో ఉండేవి 9 కేలరీలు మాత్రమే! ఉడికించినవైతే 21 కేలరీల వరకు శక్తినిస్తాయి. పుట్టగొడుగుల్లో 80-90 శాతం వరకు నీరే ఉంటుంది. రోజుకి 200 గ్రాముల చొప్పున వారానికి ఐదుసార్లు వీటిని తింటే రక్తపోటు తగ్గటానికి తోడ్పడతాయి. పుట్టగొడుగుల్లోని పొటాషియం పక్షవాతం ముప్పునూ అరికట్టేందుకు సాయం చేస్తుంది. రైబోఫ్లావిన్, నియాసిన్లు శరీరంలో విశృంఖల కణాల మూలంగా కలిగే హానిని నియంత్రిస్తాయి. ఇక విటమిన్ ఈ, సెలీనియం ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పును తగ్గిస్తాయి.
Brain
చేపలు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే చేపల్లో బీపీని, కొలెస్ట్రాల్ ని, డయాబెటిస్ ని కంట్రోల్ చేసే గుణాలు ఉంటాయి. అంతేకాకుండా చేపల్లో నాణ్యమైన ప్రోటీన్లు ఉంటాయి. వారానికి రెండుసార్లు చేపలు తినడం వల్ల గుండె జబ్బులు, డయాబెటిస్, బీపీ, మెదడు సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం తక్కువ. చేపలని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా ఉండదు. నిరోధక శక్తి పెరగడానికి కూడా చేపలు ఎంతో దోహదపడుతాయి. చేపలు శరీరానికి చాలా అవసరం ఎందుకంటే చేపల్లో మంచి కొవ్వు ఉంటుంది. అంతేకాకుండా చేపల్లో ఒమేగా – 3 ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి చాలా మంచివి. కడుపులో మంట, వేడి తగ్గాలన్న తప్పనిసరిగా చేపలు తీసుకోవాలి. ఇంకా ఆర్థరైటిస్ తో బాధపడే వాళ్ళు చేపలు తినడం వల్ల నొప్పులు తగ్గడమే కాకుండా కండరాల శక్తిని పెంచుతాయి. అలాగే అల్జీమర్స్, డిమెన్షియా, మతిమరుపు వంటి లక్షణాలను చేపలు తగ్గిస్తాయి. చేపల్లో విటమిన్ – డి అధికంగా ఉండటం వల్ల ఎముకలు గట్టిగా ఉండేటట్లు తెలుస్తాయి. అంతేకాకుండా రొమ్ము క్యాన్సర్, ప్రేగు క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్లు రాకుండా చేపలు అడ్డుకుంటాయి. చేపల్లో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలోని గ్లోబిన్ శాతం సరిపడేలా చేస్తుంది. పేగులో క్యాన్సర్ ఇతరత్రా సమస్యలు రాకుండా చేస్తుంది. శరీరంలోని ఉష్ణోగ్రతను క్రమబద్దీకరించి ఎనర్జీగా ఉండేటట్లు చేస్తాయి. అందుకే చేపలను తప్పనిసరిగా తినాలి. చేపల్లో అయోడిన్ ఉండటం వల్ల గర్భిణీ స్త్రీలకు చాలా మంచిది. కడుపులో బిడ్డకు మెదడు పెరిగేందుకు ఉపయోగపడతాయి. మన శరీరంలో మెగ్నీషియం సరిపడా లేకపోతే చేపలను తినడం వల్ల అది మన శరీరానికి అందుతుంది. దీనివల్ల ఎముకలు ధృడంగా ఉంటాయి. అందుకే చేపలను తప్పనిసరిగా తినాలి. చేపల్లో వుండే పొటాషియం శరీరంలో ద్రవాలు తయారవడానికి చాలా అవసరం. కణాలు సమర్థవంతంగా పనిచేయడానికి పొటాషియం చాలా అవసరం అందుకే చేపలను తినడం వల్ల పొటాషియం అందుతుంది.





Total views : 61961