భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నియోజకవర్గం లోని బిఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు క్యాంపు కార్యాలయం లో గులాబి రంగుల ఫ్లెక్సీలు తీసివేసి, కాంగ్రెస్ రంగుల ఫ్లెక్సీలు వేయడం ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. నిన్నటి వరకు గులాబీ రంగులో ఉన్న ఫ్లెక్సీలు ఈ రోజు ఉదయం కాంగ్రెస్ రంగులో ఉన్న ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. గత ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ నుంచి భద్రాచలం నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన తెల్లం వెంకట్రావు గత కొన్ని రోజులుగా మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి తో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుస్తున్నారు. 15 రోజుల క్రితం మొదటిసారి ముఖ్యమంత్రి కలిసిన భద్రాచలం బిఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు, మళ్లీ రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రిని కలిశారు. ఈ నేపథ్యంలో తెల్లం వెంకట్రావు కాంగ్రెస్‌లో చేరటానికి సిద్ధంగా ఉన్నారని ప్రజల్లో చర్చ నడుస్తోంది. ఈ రోజో రేపో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే అవకాశాలు ఉన్నాయని భద్రాచలం నియోజకవర్గ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది.
Brs
కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని రఘునందన్ రావు ఆరోపణ..
కాంగ్రెస్(Congress), బీఆర్ఎస్(BRS) వేర్వేరు కాదని.. ఆ రెండు పార్టీలు ఒక్కటేనని మెదక్ పార్లమెంట్ బీజేపీ(BJP) అభ్యర్థి రఘునందన్ రావు(Raghunandan Rao) ఆరోపించారు. అందులో భాగంగానే బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నా ఆ పార్టీ అధినేత కేసీఆర్ కనీసం మాట్లాడటం లేదన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్(Congress), బీఆర్ఎస్(BRS) పార్టీలకు అభ్యర్థులు దొరకడం లేదని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్(TRS) నుండి బీఆర్ఎస్(BRS)గా మారిన రోజే ఆ పార్టీపై ప్రజలకు నమ్మకం పోయిందన్నారు. 400 స్థానాలతో బీజేపీ(BJP) కేంద్రంలో మరోసారి అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. తెలంగాణ(Telangana)లో బీజేపీ(BJP) డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తుందని రఘునందన్ రావు(Raghunandan Rao) ధీమా వ్యక్తం చేశారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన సీపీ రాధాకృష్ణన్
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి
సీఎస్‌కు పొన్నం ప్రభాకర్(ponnam prabhakar) ఫిర్యాదు..
తన ఫోన్ కాల్‌ను రికార్డ్ చేసి ప్రతిపక్ష ఎమ్మెల్యేకు పంపిస్తున్నారంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. హన్మకొండ ఆర్డీవోపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి (shanthi kumari) మంత్రి పొన్నం ఫిర్యాదు చేశారు. తన ఫోన్ కాల్‌ను రికార్డ్ చేసి ఇతరులకు పంపిస్తున్న సదరు ఆర్డీవోపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.
బండి సంజయ్ అవినీతిపరుడు- పొన్నం
కాంగ్రెస్ పార్టీ(Congress party) అధికారంలోకి రావడంతో కరువు వచ్చిందని బీఆర్ఎస్ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. వారు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. పంట నష్టంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఉచిత బస్సులలో ఇప్పటి వరకు 30 కోట్ల మంది మహిళలు ప్రయాణం చేశారని తెలిపారు. బండి సంజయ్‌ని బీజేపీ అధ్యక్ష పదవి నుంచి ఎందుకు తొలగించారో చెప్పాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ అవినీతిపరుడని తెలంగాణ రాష్ట్రం కోడై కూస్తోందని మంత్రి పొన్నం ఆరోపించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: ఈజీ మనీకి అలవాటు పడ్డ దొంగల అరెస్ట్…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తొలి రోజు ఈడీ విచారణ ముగిసింది. తొలి రోజే ఆమెపై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. విచారణ ప్రక్రియను అధికారులు వీడియో రికార్డింగ్ చేశారు. ఆప్ కు ఇచ్చిన రూ. 100 కోట్ల ముడుపులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. ఎవరెవరు డబ్బులు సమకూర్చారనే ఆధారాలను కూడా చూపిస్తూ ఆమెను ప్రశ్నించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ ద్వారా సంపాదించిన రూ. 192 కోట్ల సంగతి ఏమిటని అడిగారు. డబ్బులు ఎక్కడెక్కడ పెట్టుబడులుగా పెట్టారని ప్రశ్నించారు. ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నల్లో కొన్నింటికి సమాధానాలు చెప్పిన కవిత… మరి కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయారు. కాగా సాయంత్రం ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో ఆమె భర్త అనిల్, సోదరుడు కేటీఆర్, బావ హరీశ్ రావు కలిశారు. కవిత యోగ, క్షేమాలను వీరు కనుక్కున్నారు. ఈ కేసులో న్యాయపోరాటం చేద్దామని ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా న్యాయవాది మోహిత్ రావు కూడా కవితను కలిశారు. ప్రతిరోజు కవితను కుటుంబ సభ్యులు, ఆమె న్యాయవాదులు కలుసుకునే వెసులుబాటును కోర్టు కల్పించింది. కుటుంబ భోజనం తెప్పించుకోవడానికి కూడా కోర్టు అనుమతించింది.
విజయ సంకల్ప బహిరంగ సభ(Public meeting):
పార్లమెంట్ ఎన్నికల(Parliament Elections) ప్రచారంలో భాగంగా నాగర్ కర్నూల్(Nagar Kurnool)లో ఏర్పాటు చేసిన విజయ సంకల్ప బహిరంగ సభలో ఎన్నికల కోడ్‌పై ప్రధాని మోడీ(Prime Minister Modi) కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ(Telangana)లో కూడా బీజేపీ గాలి వీస్తోందన్నారు. నాగర్ కర్నూల్(Nagar Kurnool) ప్రజలు ఈ సారి బీజేపీ(BJP)ని గెలిపించాలని కోరారు. నిన్న మల్కాజ్ గిరిలో రోడ్ షో బ్రహ్మండంగా జరిగిందన్నారు. ప్రజలు వీధుల్లో బారులు తీరి బీజేపీకి మద్దతు తెలిపారన్నారు. బీఆర్ఎస్(BRS) పట్ల కోపాన్ని ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో చూపారన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
సార్వత్రిక ఎన్నికల్లో మూడోసారి కూడా బీజేపీయే అధికారంలోకి వస్తుంనద్నారు. తెలంగాణను గేట్ వే ఆఫ్ సౌత్ అంటారన్నారు. తెలంగాణలో కూడా దోపిడీ జరుగుతోందన్నారు. అప్పుడు బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ దోచేస్తున్నాయని ప్రధాని మండిపడ్డారు. తెలంగాణలోనూ ఈ సారి బీజేపీ 400 సీట్లు అనే నినాదం వినిపిస్తోందన్నారు. తెలంగాణ ప్రజల సమస్యలు డైరెక్ట్‌గా తనకు తెలియాలంటే 17కు 17 స్థానాల్లో బీజేపీని గెలిపించాలన్నారు.
ఇది చదవండి: సుప్రీంకోర్టు కుక్ కుమార్తెకు జస్టిస్ చంద్రచూడ్ సన్మానం..!
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి
బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన..
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్(BRS MLC Kavitha husband Anil), పీఆర్వో రాజేశ్(PRO Rajesh), మరో ముగ్గురు అసిస్టెంట్లకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు(Enforcement Directorate notices) ఇచ్చింది. సోమవారం తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఈడీ సూచించింది. ఈ మేరకు రౌస్ అవెన్యూ కోర్టుకూ ఈడీ వెల్లడించింది. శుక్రవారం కవిత ఇంట్లో సోదాలు చేసిన సమయంలో కవిత ఫోన్లతో పాటు భర్త అనిల్ ఫోన్, పీఆర్వో రాజేశ్‌కు చెందిన రెండు ఫోన్లు, మరో ముగ్గురు అసిస్టెంట్లకు చెందిన ఫోన్లను ఈడీ సీజ్ చేసింది. మొత్తం పది ఫోన్లను స్వాధీనం చేసుకుంది. వీటిని తీసుకోవడానికి ఢిల్లీకి రావాలని వారికి తెలిపింది. ఢిల్లీ మద్యం కేసులో కవితను ఈడీ అరెస్ట్ చేసి… ఈ రోజు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచింది. కోర్టు ఆమెకు వారం రోజుల ఈడీ కస్టడీ విధించింది. ఈ నెల 23వ తేదీ వరకు ఆమెను ఈడీ అధికారులు విచారించనున్నారు. అంతలోనే ఇప్పుడు కవిత భర్తకు, మరో నలుగురికి ఈడీ నోటీసులు ఇవ్వడం బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన నెలకుంది.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తదుపరి చర్యలకు సిద్ధం..
మరోవైపు తన కూతురు, ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha)ను వారం రోజుల ఈడీ కస్టడీకి అప్పగించడంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తదుపరి చర్యలకు సిద్ధమయ్యారు. కవిత కోసం ఢిల్లీ అడ్వోకేట్ టీమ్‌ను కేసీఆర్ ఏర్పాటు చేస్తున్నారు. సోమా భరత్ ఆధ్వర్యంలో ప్రత్యేక లీగల్ సెల్ ఏర్పాటు చేయనున్నారు. వీరితో పాటు ఢిల్లీలోని ప్రముఖ లాయర్లతోనూ మాట్లాడుతున్నారు. కవిత కేసు కొలిక్కి వచ్చే వరకు కొందరు కుటుంబ సభ్యులు కూడా ఢిల్లీలోనే మకాం వేయనున్నారు. ఇప్పటికే పలువురు మాజీ మంత్రులు ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలను కేసీఆర్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు.
ఈడీ రేపటి నుంచి కవితను ఏడు రోజుల పాటు విచారణ..
ఈడీ రేపటి నుంచి కవిత (Kavitha)ను ఏడు రోజుల పాటు విచారించనుంది. ఈ నేపథ్యంలో సోమా భరత్ ఆధ్వర్యంలో అడ్వోకేట్ టీమ్ ఆమెకు అందుబాటులో ఉండనున్నారు. ఈడీ అధికారులు అడిగే ప్రశ్నలు… ఆమె చెప్పే సమాధానాలపై వారు సూచనలు ఇవ్వనున్నారు. కవిత కస్టడీలో ఉన్నప్పుడు రోజూ గంటసేపు ములాఖత్ ఉంటుంది. ఈ ములాఖత్ సమయంలో అడ్వోకేట్ టీమ్ అందుబాటులో ఉండి సూచనలు చేస్తుంది. రిమాండ్ పూర్తయ్యే వరకు లేదా కేసు తేలే వరకు వారు అక్కడే ఆమెకు అందుబాటులో ఉంటారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: ప్రతిమ గ్రూప్ ఆఫ్ కంపెనీ లో పోలీసులు తనిఖీలు..!
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి
బిఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ వినోద్ కుమార్ వ్యాపార సంస్థలో 6.66 కోట్ల అవినీతి సొమ్ము .. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే ఈ సొమ్మును దాచిపెట్టారు.
ప్రజలు తిరస్కరించినా మారని బిఆర్ఎస్ నేతల బుద్ధి.
అవినీతి సొమ్ముతో లోక్‌సభ ఎన్నికల బరిలో నిలవాలని చూస్తున్న బిఆర్ఎస్
రాష్ట్రంలోని బిఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల ఇండ్లలో సోదాలు జరపాలి.. పోలీస్ శాఖకు విజ్ఞప్తి – డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ
కరీంనగర్ పట్టణంలోని బిఆర్ఎస్ నేత మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ కు చెందిన వ్యాపార సంస్థ అయినటువంటి ప్రతిమ మల్టీప్లెక్స్ లో పోలీసులు విశ్వసనీయ సమాచారంతో తనిఖీ చేయగా 6 కోట్ల 66 లక్షల రూపాయల అవినీతి సొమ్ము దొరకడం విచారకరం, కేవలం లోక్‌సభ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ఎన్నికల కోడ్ ప్రకటించే రోజు వరకు వినోద్ కుమార్ కు చెందిన ఈ వ్యాపార సంస్థలో 6 కోట్ల రూపాయలు దాచిపెట్టడం జరిగిందంటే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తమ వ్యాపార సంస్థలలో టిఆర్ఎస్ నేతలు ఎన్ని కోట్ల రూపాయలు అవినీతి సొమ్మును దాచి పెట్టారో అని అనుమానాలకు దారితీస్తుంది, కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయానికి ఎదురుగా ఉన్న మల్టీప్లెక్స్ లో ఆరు కోట్ల రూపాయలు దాచిపెట్టడం జరిగిందంటే నగర శివారులో సుదూర ప్రాంతాలలో టిఆర్ఎస్ పార్టీ బడా నేతల నివాసాలలో ఫామ్ హౌస్‌లలో పోలీసుల కన్నుగప్పి ఎన్ని కోట్ల రూపాయలు ఇతర జిల్లాలకు రాష్ట్రాలకు తరలించారో అనే అనుమానాలను నివృత్తి చేయడానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి బిఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ప్రజాప్రతినిధులు వారి బంధువులు అనుచరులు బినామీల ఇండ్లు వ్యాపార సముదాయాలు అనుమాదాస్పద మరియు సౌకర్య కరమైనటువంటి ప్రాంతాలలో భవనాలలో ఏకధాటిగా దాడులు, సోదాలు జరపాలని జిల్లా కాంగ్రెస్ పక్షాన రాష్ట్ర పోలీసు శాఖను కోరుచున్నాము.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
అవినీతి సొమ్ముతో ప్రజలను, డబ్బు ఆశతో రాజకీయ నేతలను ప్రలోభ పెట్టడానికి అవకాశం లేకుండా పూర్తి శాంతియుత వాతావరణంలో రాబోయే ఎన్నికలు నిర్వహించే విధంగా పోలీసులు అన్ని రకాల చర్యలు చేపట్టాలని, ముఖ్యంగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఎన్నికల బాండ్ల రూపంలో చాలా వ్యాపార సంస్థల నుండి వందల కోట్ల రూపాయల నిధులు సేకరించడం జరిగిందనే విషయాన్ని ఇటీవల దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వెల్లడించడం జరిగింది, ఈ విధంగా అటు దేశంలో బిజెపి పార్టీ, ఇటు రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ అవినీతి సొమ్ముతో రాజకీయాలను శాసించాలనుకోవడాన్ని చూస్తుంటే రానున్న కాలంలో ఈ దేశంలో పూర్తిగా ధన బలంతో, రాజకీయ బలంతో తమ స్వార్థం కోసం తమ రాజకీయ ప్రయోజనాల కోసం దేశ ప్రజలను దేశ రాజ్యాంగ వ్యవస్థను తమ గుప్పిట్లో పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా ఈ రెండు రాజకీయ పార్టీలు వ్యూహాత్మక రాజకీయాలకు ప్రణాళిక చేస్తున్నారనే ఆలోచనలో భాగంగానే ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయని భావించవలసి వస్తుందని, ఇది విచారకరమని ఈ విధమైన చర్యలను ప్రతి పౌరుడు ఖండించవలసిన సమయం ఆసన్నమైనదని విజ్ఞులైన తెలంగాణ రాష్ట్ర ప్రజలు బిజెపి బీఆర్ఎస్ పార్టీల ఎత్తుగడలను గమనించాలని ఆ రెండు పార్టీలకు తగిన బుద్ధి చెప్పి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పత్రికాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాం.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
Niveditha :
గులాబీ నేతలు, కార్యకర్తల అభీష్టం మేరకు కంటోన్మెంట్ నియోజకవర్గ బరిలో ఉంటానని దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత సోదరి, బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు నివేదిత స్పష్టం చేశారు. కంటోన్మెంట్ నియోజకవర్గ ఉప ఎన్నిక ఏక గ్రీవం కావడానికి ఇతర పార్టీలు కూడా సహకరించాలని కోరారు. దివంగత ఎమ్మెల్యే సాయన్న, లాస్య నందిత ఆశయ సాధన కోసం పని చేస్తానని ఆమె ప్రతినబూనారు. ఈ రోజు కంటోన్మెంట్ లోని గృహలక్ష్మీ కాలనీ లోని నివాసం లో బిఆర్ఎస్ నేతలు, కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది. ముందుగా దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత మృతికి సంతాపం తెలియజేస్తూ గులాబీ శ్రేణులు 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జక్కుల మహేశ్వర్ రెడ్డి ఈ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. లాస్య నందిత హఠాన్మరణంపై కన్నీరుమున్నీరయ్యారు. ఉజ్వల భవిష్యత్తు ఉన్న నాయకురాలు ఇంత చిన్న వయస్సులోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతుందని ఊహించలేదన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఏదేమైనా ఈ కష్టకాలంలో సాయన్న కుటుంబానికి అండగా ఉంటామని గులాబీ క్యాడర్ స్పష్టం చేశారు. లాస్య నందిత సోదరి, పార్టీ నాయకురాలు నివేదిత కంటోన్మెంట్ నియోజకవర్గ ఉప ఎన్నికల బరిలో ఉండాల్సిందేనని తేల్చిచెప్పారు. లాస్య నందిత కంటే రెట్టింపు మెజార్టీతో నివేదితను గెలిపించుకుంటామని తెలిపారు. అనంతరం నివేదిత మాట్లాడుతూ గులాబీ క్యాడర్ అభీష్టానుసారం కంటోన్మెంట్ ఉప ఎన్నికల బరిలో ఉంటానని స్పష్టం చేశారు. త్వరలోనే పార్టీ హైకమాండ్ ను కలుస్తామన్నారు. కంటోన్మెంట్ ఉప ఎన్నిక ఏకగ్రీవం కావడానికి ఇతర పార్టీలు కూడా సహకరించాలన్నారు. ఒకవేళ ఎన్నికలు అనివార్యమైతే బరిలో నిల్చుని, ప్రజలందరి ఆశీర్వాదాన్ని కోరుతానన్నారు. లాస్య నందిత లాగే తనను కూడా ప్రజలు భారీ మెజార్టీతో గెలిపిస్తారని నివేదిత ఆశాభావం వ్యక్తం చేశారు. దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత ఫోటోకు పుష్పాంజలి సమర్పిస్తూ నివేదిత కన్నీటి పర్యంతమయ్యారు. ఈ దృశ్యాన్ని చూసి గులాబీ శ్రేణులంతా చలించిపోయారు. ఆ తర్వాత అందరూ లాస్య నందిత చిత్ర పటానికి పూలు వేసి, కన్నీటి నివాళి అర్పించారు.
ఈ సమావేశంలో కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యులు జక్కుల మహేశ్వర్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ టి ఎన్. శ్రీనివాస్ అనితా ప్రభాకర్, నళిని కిరణ్, పాండు యాదవ్, భాగ్యశ్రీ శ్యాంకుమార్, లోకనాథం, పలు వార్డుల బిఆర్ఎస్ అధ్యక్షులు, పలువురు బిఆర్ఎస్ సీనియర్ నాయకులు, యువ నాయకులు, కార్యకర్తలు, మహిళా నేతలు, ఉద్యమ కారులు, స్వర్గీయ సాయన్న అభిమానులు, దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత అభిమానులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
ఎమ్మెల్సీ కవితది అక్రమ అరెస్టంటూ, నిరసనగా దేవరకొండలో బీఆర్ఎస్ నాయకుల ధర్నా… ధర్నాలో పాల్గొన్న నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ నాయక్… ధర్నాలో పోలీసులకు, బీఆర్ఎస్ నాయకులు మరియు కార్యకర్తలకు మధ్య తోపులాట. రవీంద్ర కుమార్ ను అరెస్టు చేయకుండా అడ్డుకున్న కార్యకర్తలు.. అయినా బలవంతంగా అరెస్టు చేసి స్టేషన్ కు తరలించిన పోలీసులు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఎమ్మెల్సీ కవితది అక్రమ అరెస్టంటూ నిరసిస్తూ BRS నాయకులు దేవరకొండలో ధర్నా నిర్వహించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోడీకి వ్యతిరేకంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ నాయక్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవితను అక్రమంగా అరెస్టు చేశారని అన్నారు. అనంతరం రవీంద్ర కుమార్ ను అరెస్టు చేసే క్రమంలో పోలీసులకు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు మధ్య తోపులాట చోటుచేసుకోవడంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నాయకులను స్టేషన్ కు తరలించే క్రమంలో కార్యకర్తలు పోలీసు జీపుకు అడ్డుపడగా పోలీసులు బలవంతంగా రవీంద్ర కుమార్ ను, నాయకులను, అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
రంగారెడ్డి జిల్లా చేవేళ్ళ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య
ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ….. టిఆర్ఎస్ పార్టీ నాయకురాలు జాగృతి అధ్యక్షురాలు కవితలు అక్రమ అరెస్టును నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆయన మాట్లాడుతూ ఒక మహిళ అని చూడకుండా శుక్రవారం సాయంత్రం అరెస్ట్ చేయడం ఏమిటని దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నానని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.
పది సంవత్సరాల్లో టిఆర్ఎస్ కూడా కక్షపూరిత కార్యక్రమాలు చేసి ఉంటే ఏ పార్టీ కూడా లేవకుండేదని కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు అరెస్ట్ చేయడం ఏందని ఇదంతా కేవలం పార్లమెంట్ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని లబ్ధి పొందడానికి మాత్రమే కక్షపూరితంగా కవితను అరెస్టు చేయడం జరిగిందని ఆయన సందర్భంగా తెలిపారు శ్రీరాముని ముందుకు తీసుకువచ్చి బిజెపి ప్రభుత్వం ఆడుతున్న నాటకంఅని పోలీస్ స్టేషన్లో అలాంటిది ఆడపిల్లకు రక్షణ ఉంటుందని కానీ కేంద్ర ప్రభుత్వం వైఖరి బాగోలేదని ఆయన తీవ్రగా విమర్శించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
శ్రీ రాముని ముందుకు వేసుకొని బిజెపి నాటకాలు ఆడుతుందని ఆ శ్రీరామునికి నేను కూడా 1,00 111/- రూపాయలు ఇచ్చానని కానీ ఇప్పటివరకు నాకు అక్షింతలు కూడా ఇవ్వలేదని అక్షింతలనే నాటకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్న బిజెపి వైఖరిని నిరసిస్తున్నారని వెంటనే అరెస్టు చేసిన కవితను విడుదల చేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. రాబోయే కాలంలో కేంద్ర ప్రభుత్వం తీవ్ర ప్రతిఫలం అనుభవిస్తుందని ఆయన తెలిపారు. సోషల్ మీడియాలో వస్తున్న పార్టీ మారదానిపై ఆయన క్లారిటీ ఇచ్చారు ఇప్పుడైతే పార్టీ మారదలుచుకోలేదని రాబోయే కాలంలో పరిస్థితులను బట్టి మారోచ్చేమోనని ఆయన తెలిపారు నేను నిధుల గురించి మాత్రమే సీఎం రేవంత్ రెడ్డిని కలిశాలని, రేవంత్ రెడ్డి నే కాదు మంత్రులను కూడా కలవచ్చని ఆయన సందర్భంగా తెలిపారు. అనంతరం రోడ్డు మీద నిలబడి నినాదాలు చేశారు బిజెపి డౌన్ డౌన్ వెంటనే కవితను విడుదల చేయాలని…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి




Total views : 92309