ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కు వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు తాజాగా లేఖలు రాశారు. తమకు అందిన నోటీసులకు వివరణ ఇచ్చేందుకు నాలుగు వారాల గడువు ఇవ్వాలని కోరారు. ఈమేరకు వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి స్పీకర్ కార్యాలయానికి విడివిడిగా లేఖలు పంపారు. తాము అందుకున్న నోటీసులను పరిశీలించాల్సిన అవసరం ఉందని, తమపై ఫిర్యాదు చేసిన వారు సమర్పించిన ఆధారాలను అందించాలని ఈ లేఖలో కోరారు. వాటిని పరిశీలించేందుకు నాలుగు వారాల గడువు కూడా ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేశారు. తమ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు అనైతికంగా పార్టీ మారారని, పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం వారిపై చర్యలు తీసుకోవాలని వైసీపీ స్పీకర్ కు ఫిర్యాదు చేసింది. ఆనం, కోటంరెడ్డి, మేకపాటి, ఉండవల్లి శ్రీదేవిలపై అనర్హత వేటు వేయాలని కోరింది. ఈ ఫిర్యాదును పరిశీలించిన స్పీకర్ తమ్మినేని సీతారం పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన నేపథ్యంలో వారిపై చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులకు వివరణ ఇచ్చేందుకు మరింత సమయం కావాలని వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు తాజాగా లేఖలు రాశారు.
Chandrasekhar Reddy
ఏపీ భూహక్కు చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని తిరుపతి బార్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ చట్టంతో ప్రజల భూములపై లీగల్ పరిజ్ఞానం లేని అధికారులే శాసించే ప్రమాదం ఉందన్నారు. ఏపీ భూహక్కు చట్టం వలన సామాన్య ప్రజల భూములకు రక్షణ ఉండదని, ఈ చట్టం పేదల పాలిట శాపంగా మారుతుందని హెచ్చరించారు. న్యాయ పరిజ్ఞానం లేని అధికారుల నిర్ణయాలతో ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. డిసెంబర్ 1 నుంచి తిరుపతి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విధులను బహిష్కరించి నిరసనలు చేపట్టారు. తిరుపతి కోర్టు ముందు బుధవారం నిరసనకు దిగిన అడ్వకేట్లు ర్యాలీగా వెళ్లి ఎన్టీఆర్ సర్కిల్ ముందు మానవహారం నిర్వహించారు. గురువారం బైక్ ర్యాలీ చేపట్టి ఆర్టీసీ బస్టాండ్ ముందు మహాత్మా గాంధీ, డా.బీఆర్ అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రం ఇవ్వనున్నారు. తిరుపతి కోర్టు ముందు జరిగిన నిరసన కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జి.వెంకటకుమార్ , ఉపాధ్యక్షుడు టి. గోపిచంద్, ప్రధాన కార్యదర్శి ఎం.మురళి, మహిళా ప్రతినిధి వై.కె.మల్లీశ్వరిదేవి, సీనియర్ న్యాయవాదులు కంచి ప్రకాశం, ప్రభాకర్ నాయుడు, చంద్రశేఖర్ రెడ్డి, నెల్లూరు యోగానంద్, బి.ఉషాకిరణ్, టి.దినకర్, సామంచి శ్రీనివాస్, పలువురు అడ్వకేట్లు నిరసన చేపట్టిన న్యాయవాదులు పాల్గొన్నారు.






Total views : 80776