అనంతపురం జిల్లా గుత్తి మార్కెట్ యార్డులో మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకర్ రెడ్డి పత్తి రైతులను ఆదుకోవాలని ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. చేతకాని ప్రభుత్వం రైతులను తీరని అన్యాయం చేసిందంటూ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. వెంటనే ప్రభుత్వం స్పందించి పత్తి రైతులను ఆదుకొని పత్తిని ప్రభుత్వమే కొనుగోలు చేసి వారిని ఆదుకోవాలని ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం వలన రైతులకు తీవ్రం నష్టం చేకూర్చిందని వాపోయారు. ఇప్పటికైనా సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించి ఈ రైతులను ఆదుకోకపోతే రాబోయే రోజుల్లో ఇలాంటి ఆందోళన కార్యక్రమాలు మరింత చేస్తామని హెచ్చరించారు.
Crime news*
నేడు అయోధ్య రామయ్య ప్రాణ ప్రతిష్ట పురస్కరించుకొని దేశం మొత్తం రామనామ కీర్తనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో నేడు శ్రీకాళహస్తి దేవస్థానం అనుబంధమైన శ్రీ రాముల వారి ఆలయం నందు సీతాదేవి సమేత శ్రీరామచంద్ర మూర్తికి ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. కోలాటాలు, భజనలు, మంగళ వాయిద్యాల, మేళాతాళాల నడుమ రామ నామ కీర్తనలతో భజనలు చేస్తూ స్వామి వారి ఊరేగింపు నాలుగు మాడ వీధుల్లో అత్యంత వైభవంగా కన్నులు విందుగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ రాముని చిత్ర పట్టాన్ని రిక్షా పై ఉంచి ఊరోగించే తరుణంలో అక్కడున్నటువంటి శ్రీకాళహస్తి శాసనసభ్యులు కాసేపు రిక్షా తొక్కుతూ స్వామివారికి రథసారధిగా మారారు. ఈ సంఘటన చుట్టుపక్కల ఉన్నటువంటి వారిని ఆసక్తి పరచింది…
దేశమంతటా 500 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న అయోధ్య రాముని విగ్రహ ప్రతిష్టకు గ్రామ గ్రామాన ఎంతో ఉత్సాహభరితంగా, ఆనంద ఉల్లాసాలతో అయోధ్య శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట వేడుకలు జరుపుకుంటున్నారు. దీనిలో భాగంగా పి గన్నవరంలో ఈ రోజు తెల్లవారుజామున 5 గంటల నుంచి నగర సంకీర్తన ప్రతి ఇంటి ముందు శ్రీరామ్ జయరాం రంగవల్లికలతో అలంకరించుకుని సుందరకాండ పారాయణము శ్రీరామ నామ జపము లాంటివి గన్నవరం మండలంలో ప్రతి ఆలయం వద్ద చాలా భక్తితో జరిపించుకున్నారు. పి గన్నవరం పట్టాభి రామాలయం నుంచి గ్రామాలలో బైక్ ర్యాలీ నిర్వహించారు. శ్రీరాముల ఉత్సవ విగ్రహాలను గ్రామాలలో వీధి వీధినా ఊరేగించారు. అలాగే ఈరోజు ముంగండ గ్రామంలో అయోధ్యకర సేవకులకు ఘన సత్కారం చేశారు. ప్రతి రామాలయం వద్ద అన్న సమారాధన కార్యక్రమలు జరిగాయి.
అయోధ్య రామ మందిరం నిర్మాణం, శ్రీ రాముని ప్రాణ ప్రతిష్ట సందర్భంగా కాకినాడ రూరల్ మండలం పండూరు గ్రామంలో శ్రీ రామాలయం లో కాకినాడ జిల్లా బిజెపి కార్యదర్శి కాళ్ళ ధనరాజ్, నాయకులు సత్యనారాయణ రాజు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజలతో శ్రీ రాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని లైవ్ లో తిలకించారు. ఈ సందర్భంగా ధనరాజ్ మాట్లాడుతూ హిందువుల ఆరాధ్య దైవం అయిన శ్రీ రాముని దేవాలయ నిర్మాణం చారిత్రక ఘట్టం అయితే ఈ రోజు శ్రీ రాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కోసం దేశ వ్యాప్తంగా ప్రజలు ఎదురు చూస్తున్నారని, ఇంతటి మహోత్తర కార్యక్రమం దేశ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరగటం ప్రతి హిందువు గర్వించదగిన విషయమన్నారు. ఎన్ని అవాంతరాలు ఎన్ని అవరోధాలు ఎదురైన అయోధ్య లో రామాలయం నిర్మించడం తో దేశ ఖ్యాతి ప్రపంచ నలుదిశలా వ్యాపించిందన్నారు. ఈ కార్యక్రమంలో ఏనుగుల దొరబాబు, పేదిరెడ్ల దుర్గ బాబు, సత్యనాందం, ఎన్.దొరబాబు, ఊట రాంబాబు, ఎన్.కృష్ణమూర్తి , గ్రామ ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా, మందమర్రి అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ సందర్భంగా మందమర్రి పంచముఖి ఆంజనేయ దేవాలయం నుండి పురావిధుల్లో 500 బైక్ ర్యాలీ పెద్ద ఎత్తున మార్కెట్లో సెంటర్ వరకు నిర్వహించిన అయోధ్య రాముని శోభయాత్రలో పాల్గొన్న హిందూ ఉత్సహం కమిటీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించరు. మందమర్రి పట్టణంలోని మార్కెట్ ఏరియాలో ఈరోజు వ్యాపార సంఘం వారు ఆధ్వర్యంలో నిర్వహించిన నగర సంకీర్తనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 500 సంవత్సరాల హిందువుల చిరకాల స్వప్నం ఈరోజు నెరవేరనుందని తెలిపారు. ఎన్నో ఏండ్లుగా ఎదురుచూసిన ఈ క్షణం ఈరోజు వచ్చిందిదని అన్నారు. ప్రతి ఇంటి లొ సాయంత్రం ఐదు దీపాలు పెట్టుకోవాలి రాత్రి దీపావళి టపాసులు పేల్చడం, సంతోషం తో జరుపుకోవాలని అన్నారు.
తిరుపతి జిల్లా, శ్రీకాళహస్తిలో వైసీపీ కార్యకర్తల తాగుబోతు ఆగడాలు. నిన్న రాత్రి ప్రచారంలో ఉన్న బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి రిషిత రెడ్డి పై మాటల దాడి. రిషితా రెడ్డిని ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడిన వైసీపీ నేతలు, ఏర్పడు ఇంచార్జీ కిషోర్, పంపాలి మురళి మోహన్. టీడీపీ ప్రచార రథానికి వైసీపీ ప్రచార రథం అడ్డుపెట్టి రిషితా రెడ్డి ప్రచారాన్ని అడ్డుకున్న వైసీపీ నేతలు. రిషితా రెడ్డిని ప్రచారం చేసుకోకుండా వైసీపీ ప్రచార రథంలో సౌండ్ పెంచిన వైనం. ప్రచార రథం పై ఉన్న బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి ఫోటో ను చించి వేసిన వైసీపీ తాగుబోతులు.
విజయవాడ, కోడి కత్తి శీను కుటుంబ సభ్యులు చేస్తున్న అమరణ నిరాహార దీక్షను భగ్నం చేసిన పోలీసులు. కోడి కత్తి శీను ను వెంటనే విడుదల చేయాలంటూ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న శ్రీనివాస్ కుటుంబ సభ్యులు. కోడి కత్తి శీను జైలు నుండి బయటకు రావాలని మూడు రోజుల నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న కోడికత్తి శీను కుటుంబ సభ్యులు. కోడికత్తి శీను తల్లి ఆరోగ్యం విషమించడంతో మెరుగైన ఆరోగ్యం కోసం విజయవాడ ప్రభుత్వాసుపత్రి తరలించిన పోలీసులు. పోలీసులు నిరాహార దీక్ష భగ్నం చేసి ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో పోలీస్ జీబు ముందు పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకోబోయిన నిరసనకారులు. వెంటనే స్పందించి అతని వద్ద ఉన్న అగ్గిపెట్టెను లాక్కున్న పోలీసులు. నిరసనకారులను చెదరగొట్టి కోడి కత్తి శీను కుటుంబ సభ్యులను విజయవాడ హాస్పటల్ తరలించిన పోలీసులు.
ఉరవకొండ, ఈనెల 23న ఉరవకొండలో జరిగే వైఎస్ఆర్ ఆసరా బహిరంగ సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారని జిల్లా ఇన్చార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను శనివారం కలెక్టరు గౌతమి, ఎస్పీ అన్బురా జన్, సీఎం కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్, జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. అనంతరం పట్టణం లోని తొగటవీర క్షత్రియ కల్యాణ మండపంలో జిల్లా ఉన్నతాధికారులతో ఏర్పాట్లపై సమీక్షించారు. 7,876 లక్షల మంది మహిళలకు రూ.6,379 కోట్ల ఆసరా మొత్తాన్ని సీఎం విడుదల చేయనున్నారని తెలిపారు. ఏపీ ఐఐసీ చైర్మన్ మెట్టు గోవిందురెడ్డి, ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీలు శివరామిరెడ్డి, మంగమ్మ, ఎమ్మెల్యే శంకరనారాయణ, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, జడ్పీ సీఈఓ వైభోమ్ నిదియాదేవి, గుంతకల్లు ఆర్డీఓ శ్రీనివాసులురెడ్డి, స్థానిక తహసీల్దారు శ్రీధరమూర్తి పాల్గొన్నారు.
అయోధ్యకు శ్రీవారి లడ్డూలు తరలి వెళ్తున్నాయి. ఈనెల 22వ తేదీన అయోధ్యలో రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో అయోధ్యకు శ్రీవారి లడ్డూలు తరలి వెళ్తున్నాయి. తిరుమల శ్రీవారికి ఎంతో ప్రీతీకరమైన లడ్డూలను అయోధ్య రామయ్య సన్నిధికి టీటీడీ అధికారులు తరలిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం తిరుమల నుంచి తిరుపతికి లక్ష లడ్డూలు తరలించారు. టీటీడీ జేఈవో వీరబ్రహ్మం మాట్లాడుతూ.. అయోధ్య లో శ్రీరామచంద్రమూర్తి ఆలయ ప్రారంభోత్సవానికి లక్ష లడ్డూలు పంపిణీ చేయాలని పాలకమండలి నిర్ణయం తీసుకుందని తెలిపారు. తిరుపతి విమానాశ్రయం నుంచి ప్రత్యేక కార్గో ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా అయోధ్యకు తరలిస్తున్నట్లు వివరించారు. ఇవాళ ఉదయం ఈ విమానం ప్రారంభమవుతుందని. సాయంత్రంలోగా అయోధ్యకు చేరుతుందని ఆయన స్పష్టం చేశారు.
వరంగల్, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హన్మకొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 7:30 హైదరాబాద్ నుండి హన్మకొండ కి బయలుదేరనున్న మంత్రి పొన్నం ప్రభాకర్. ఉదయం 10:00 IDOC లో హన్మకొండ జిల్లా రివ్యూ మీటింగ్. మధ్యాహ్నం 2:30 గంటలకు హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి గ్రామ పంచాయతీ బిల్డింగ్ ప్రారంభోత్సవం. సాయంత్రం 4:00 గంటలకు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ లో PR, R&B అధికారులతో రివ్యూ మీటింగ్. రాత్రి హుస్నాబాద్ లో భస చేయనున్న మంత్రి పొన్నం ప్రభాకర్.





Total views : 90341