సీఎం జగన్, నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు అభివృద్ధి పేరుతో ప్రజలను మోసం చేశారని మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే బండారుమాధవ నాయుడు చెవిలో పువ్వు పెట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరసాపురం ప్రజలను ఎమ్మెల్యే మూడు సార్లు మోసగించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ పదవి కోసం జిల్లా కేంద్రంను తాకట్టు పెట్టారు. నరసాపురం నుంచి భీమవరానికి జిల్లా కేంద్రం తరలించారు. ఈ విషయం భీమవరం లో జరిగిన సీఎం సమావేశంలో పలువురు మాట్లాడారు. నరసాపురంలో మంజూరైన మెడికల్ కాలేజీను తరలించారు. రూ. 3,200 కోట్లతో అభివృద్ధి పనులు అంటూ ప్రజలను దగా చేశారు. 14 నెలలు గడిచినా బటన్ నొక్కిన పనులు ప్రారంభం కాలేదన్నారు. ప్రజలకు సిఎం, ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు చేసిన మోసాలకు న్యాయం చేయాలంటూ ఆర్డీవో కు విన్నతి పత్రం అందజేశారు.
cvr english
భువనగిరి మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానం నెగ్గింది. ఇటీవల మున్సిపల్ చైర్మన్ ఆంజనేయులు, వైస్ చైర్మన్ క్రిష్ణయ్యలపై 31 మంది అవిశ్వాస తీర్మానం కోరారు. అయితే ఆర్డీవో అమరేందర్ ఆధ్వర్యంలో అవిశ్వాసంపై భువనగిరి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఓటింగ్ జరుపగా అనుకూలంగా 31మంది కౌన్సిలర్లు ఆమోదం తెలిపారు. ఎక్స్ అఫీషియల్ మెంబర్తో సహా మొత్తం 36 మంది ఉండగా.. 31 మంది ఆమోదం తెలిపినట్లు ఆర్డీవో అమరేందర్ పేర్కొన్నారు. అయితే ఆమోదం తెలిపిన 31 మంది కౌన్సిలర్లలో 16 మంది టిఆర్ఎస్ తొమ్మిది మంది కాంగ్రెస్ ఆరు మంది బిజెపి కౌన్సిలర్లు ఉన్నారు. ఎక్స్ అఫీషియల్ మెంబర్ తో సహా మిగతా ఐదుగురు మాజీ ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి, కౌన్సిలర్లు ఆబోతుల కిరణ్ కుమార్, చెన్న స్వాతి మహేష్, ఏనబోయిన ఆంజనేయులు, చింతల కిష్టయ్య అవిశ్వాస ప్రక్రియకు గైర్హాజరయ్యారు. అయితే ఆమోదం తెలిపిన నివేదికను జిల్లా కలెక్టర్కు పంపిస్తున్నామని తదుపరి కార్యాచరణ త్వరలో ప్రకటిస్తామని ఆర్డిఓ అమరేందర్ మీడియా ముందు వెల్లడించారు.
వేములవాడ రాజన్న ఆలయానికి అనుబంధ దేవాలయమైన శ్రీ బద్ది పోచమ్మ అమ్మవారి ఆలయానికి మంగళవారం అమ్మవారికి ఇష్టమైన రోజు కావడంతో భక్తులు కుటుంబ సమేతంగా బోనాల మొక్కులు చెల్లించుకునేందుకు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆలయంతో పాటు పరిసరప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. అమ్మవారికి ఇష్టమైన పసుపు కుంకుమలను, బోనాల నైవేద్యాలను సమర్పించుకొని సేవలో తరించారు. తమ ఇంటిల్లిపాదినీ పిల్లాపాపలను చల్లగా చూడు తల్లి అంటూ అమ్మవారిని భక్తులు వేడుకున్నారు.
జగిత్యాల జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న క్షేత్రానికి భక్తుల తాకిడి పెరిగింది. మంగళవారం కావటం, దీనికి తోడు సమ్మక్క సారళమ్మ జాతరకు ముందు అంజన్నను దర్శనం చేసుకోవటం అనవాయితీ కావటంతో రాష్ర్ట నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చి అంజన్నను దర్శించుకుంటున్నారు. స్వామి వారి దర్శనానికి గంట సమయం పడుతోంది. క్యూలైన్లు నిండి వెలుపల వరకు భక్తులు బారులు తీరారు. సుమారు 30 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నట్లు ఆయల అధికారులు తెలిపారు. అనంతరం మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి దంపతులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
అక్రమ కట్టడాలపై బల్దియా అధికారులు కొరడా జులిపించారు. పార్కింగ్ స్థలాలలో ఉన్న కట్టడాలను తొలగించారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. ఉదయం వరంగల్ చౌరస్తా నుండి ఎంజీఎం జంక్షన్ వరకు పార్కింగ్ స్థలాలలో అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన వాటిని తొలగించారు. ప్రజల నుండి వస్తున్న ఫిర్యాదుల మేరకు తాము అక్రమ నిర్మాణాలు కూల్చివేసామని ఇకనైనా రోడ్డు సైడ్ ఉన్న వ్యాపారులు నిర్మాణం కోసం తీసుకున్న పర్మిషన్ లో నిర్మాణాలే చేపట్టాలని పార్కింగ్ స్థలాలలో నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని వరంగల్ సిటీ ప్లానర్ వెంకన్న తెలిపారు.
మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నంద్యాలలో గత నాలుగు సంవత్సరాల నుండి విపరీతమైన క్రైమ్ జరుగుతుందని అన్నారు. శిల్పా వెంచర్ లో మైనర్ బాలిక అనుమానస్పదంగా చనిపోయిన విషయం రెండు రోజులుగా వింటున్నామని అన్నారు. దానిపైన పోలీసులు గాని ఎమ్మెల్యే గాని ఎందుకు స్పందించడం లేదని కొంతమంది మాట్లాడుకోవడం, మీడియా లో అమ్మాయిని రేప్ చేసి చంపినట్లు అనుమానిస్తున్నారని ఆయన అన్నారు. పోలీసులు ఎమ్మెల్యే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే అనుచరుడే మద్యం అమ్ముతూ పట్టుబడ్డాడని, అభివృద్ధి పై ఎమ్మెల్యే తో చర్చకు సిద్ధమని, ఎక్కడకి చెబితే అక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన అన్నారు. నేను ఎవరితో టచ్ లో లేను శిల్పా వారే టీడీపీ తో టచ్ లో వున్నారని అన్నారు. టిక్కెట్ కోసమే అందరం కష్ట పడుతున్నామని ఒకవేళ టిక్కెట్ రాకపోతే అప్పుడు మాట్లాడుతానని ఆయన అన్నారు. పార్టీ పదవులు మార్చాలంటే అచ్చం నాయుడు నుంచే రావాలని, చంద్రబాబు నాయుడు గారు నంద్యాలకు వస్తే అంతకన్నా అదృష్టం ఏముంటుందని ఆయన ఈ సందర్భంగా అన్నారు.
రిటైర్డ్ కార్మికుల కోసం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటియుసి) అధ్యక్షులు కామ్రేడ్ వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ కొరిమి రాజ్ కుమార్ యాజమాన్యంతో మాట్లాడి వారికి రిటైర్డ్, డెత్ రావలసిన బకాయిలు సింగరేణి యాజమాన్యం కార్మికుల చేసే అడిట్ జాప్యం వలన రెండు రోజులు లేట్ కావడంతో కొన్ని సంఘాలు దుష్ప్రచారం చేస్తున్నాయి. వెంటనే రావాల్సిన బకాయిలు ఇవ్వాలని వొత్తిడి ఫలితంగా రిటైర్డ్ కార్మికులకు (Not On Roles ) వారికి రావాల్సిన లాభాల వాటా 32% PLR బోనస్ మరియు వెజ్ బోర్డ్ ఏరియల్స్ ఈ రోజు చెల్లించనున్నట్టు యాజమాన్యం తెలిపింది. కావున ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ ప్రకారము కార్మికులకు రావలసిన బకాయిలను ఇప్పించుటలో కార్మికుల సమస్యలు ఫై ఏఐటీయూసీ ఎప్పుడు ముందుంటుందని తెలిపారు.
NTR జిల్లా పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం రంగుల మహోత్సవం 2024 సందర్భంగా పెనుగంచిప్రోలు పోలీస్ స్టేషన్ నందు మండల రెవెన్యూ అధికారులు, దేవాదాయ శాఖ సిబ్బంది సమక్షంలో జరిగింది. పోలీస్ వారి సమక్షంలో శ్రీ అమ్మవారు మరియు పరివార దేవతలను పెనుగంచిప్రోలు నుండి జగ్గయ్యపేట తీసుకువేళ్ళుటకు ఎద్దుల బండ్ల లక్కీ డ్రా ను చిన్న పిల్లల చేత పోలీస్ స్టేషన్ నందు నిర్వహించారు. శ్రీ తిరుపతమ్మ అమ్మవారి కోసం ఎద్దుల బండికి, బర్రెల పెద్ద వెంకయ్య గోపయ్య స్వామి కోసం ఎద్దుల బండికి కొత్తగుండ్ల అజయ్ కుమార్ ఎంపిక కాబడినారు. శ్రీ తిరుపతమ్మ అమ్మవారి ఆలయ పాలక మండలి చైర్ పర్సన్ జంగాల శ్రీనివాసరావు, ఎస్ ఐ దుర్గప్రసాద్, మండల రెవెన్యూ అధికారులు, ఆలయ అధికారులు, గ్రామానికి చెందిన ఎద్దుల బండ్ల యజమానులు పాల్గొన్నారు.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న కార్యాలయంలో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు. నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన కేశినేని చిన్ని. ఎంపీ కేసినేని నాని పై తీవ్ర స్థాయిలో మండిపడ్డ కేశినేని చిన్ని. ఈ సందర్భంగా కేశినేని చిన్ని మాట్లాడుతూ.. ఎంపీ కేశినేని నాని దేవినేని అవినాష్ కు ముఖ్య అనుచరుడుగా మారాడు. దేవినేని అవినాష్ ఎటు తిరిగితే ఆయన వెనుక నాని అటు తిరుగుతున్నాడు. కేశినేని నాని వైసీపీలోకి వెళ్లాక ముగ్గురు నలుగురు కూడా నాని వెంట లేరు. కేశినేని నానికి విజయవాడ ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలో టిడిపిని ఖాళీ చేయడం కేశినేని నాని వల్ల కాదు. కొడాలి నానిలా బూతులు మాట్లాడుతూ కేశినేని నాని తయారయ్యాడు. మేము గేట్లు తెరిస్తే వరదలా రావడానికి వైసిపి నేతలు సిద్ధంగా ఉన్నారు. దుష్ట పరిపాలన అంతమొందించడమే చంద్రబాబు లక్ష్యం.





Total views : 141697