ఆంధ్రప్రదేశ్ లో సోనోవిజన్ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా కస్టమర్స్ కు కుచ్చుటోపీ పెట్టి కోట్లాది రూపాయలను సోనావిజన్ యాజమాన్యం దోపిడీ చేస్తుంది. పండగల సీజన్ వచ్చిందంటే చాలు అరచేతిలో వైకుంఠం చూపిస్తూ కల్లబొల్లి మాటలు చెబుతూ సామాన్య మధ్యతరగతి కుటుంబాలను లూటీ చేస్తోంది రీసెంట్గా విశాఖలో కోటి రూపాయలు పైబడే బ్లాక్ మనీ దొరకడంతో సోనోవిజన్ అక్రమాలు బయట పడ్డాయి ఫ్రిజ్, వాషింగ్ మిషన్ ల లో కూడా బ్లాక్ మనీ తరలిస్తూ అడ్డంగా బుక్ అయింది.
CVr health
కొమురం భీం జిల్లా, కాగజ్ నగర్ అటవీ డివిజన్ పరిధిలోని దరిగాం అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ అధికారుల తనిఖీలు. గత మూడు రోజుల క్రితం ఆధిపత్య పోరులో కె15 అనే సంవత్సరం నర ఆడ పులి మృతి చెందగా మరో గాయపడ్డ పులి కోసం గాలింపు. తాజాగా మృతి చెందిన కె15 పులి మృతదేహానికి కొంచెం దూరం లోనే మరో ఐదు సంవత్సరల ఎస్9 అనే మొగ పులి మృతదేహం గుర్తింపు. దరిగాం అటవీ ప్రాంతాల్లో టైగర్ ట్రాకర్స్ తో పాటు జిల్లా ఫారెస్ట్ బృందాల గాలింపు. సంఘటన స్థలాన్ని సందర్శించిన పులుల రక్షణ అధికారి శాంతారాం,డి.ఎఫ్.ఓ నీరజ్ కుమార్ తొబ్రీయాల్, నేడు సంఘటన స్థలానికి విచారణ నిమిత్తం రానున్న కేంద్ర పులుల సంరక్షణ బృందం అధికారులు.
అల్లూరు జిల్లా చింతపల్లిలో చలి ఉష్ణోగ్రతలు 6.5 డిగ్రీ నమోదు కాగా, లంబసింగిలో 4.5 డిగ్రీలు ఉండవచ్చని అంచనా. దీంతో మన్యం ప్రజలు చలికి గజగజ వణికిపోతూ రగ్గులు స్వెటర్లు మంకీ టోపీలు వాడుతూ ఇంట్లో నుండి పొద్దు పొడిచి ఎండ కాసే వరకు బయటి రాలేకపోతున్నారు. మైదాన ప్రాంతం నుండి పర్యాటకులు చలిలో ఎంజాయ్ చేయటానికి పర్యాటక ప్రాంతాలైన లంబసింగి, చెరువులవేనం యు పాయింట్, తాజంగిడ్యామ్, కొత్తపల్లి జలపాతం, వంజంగి యుపాయింట్, అరుకు మొదలగు ప్రాంతాలు చూడటానికి పర్యాటకులు పోటెత్తుతున్నారు. చలిలో వృద్ధులు బాలింతలు చిన్నపిల్లలు చలికి తట్టుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
విజయవాడ, ఎస్మా ప్రయోగించినా తగ్గమంటూ సమ్మెను కొనసాగిస్తామంటున్న అంగన్వాడీలు. వేతనాలపెంపు, ఉద్యోగ భద్రతపై ఆందోళన విరమించేది లేదంటున్న మున్సిపల్ కార్మికులు. టీచర్ల సమస్యలపై యూటిఎఫ్ ఆద్వర్యంలో 36 గం.ల దీక్షకు పిలుపు, అనుమతి లేదన్న పోలీసులు. అయినా దీక్ష చేస్తామంటున్న యూటిఎఫ్ నేతలు. ఉద్యోగ భద్రతపై ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రాధన్యతపై సమ్మెకు దిగుతామంటున్న 108, 104 సిబ్బంది. ఈనెల 22 వరుకు దశలవారిగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామంటున్న 108, 104 ఉద్యోగ సంఘాల నేతలు. అన్ని సంఘాలు ఒకేసారి ఆందోళనలకు పిలుపునివ్వడంతో దద్దరిల్లిపోతున్న ధర్నా చౌక్. ధర్నా చౌక్ లో ఉన్న అందోళనకారుల టెంట్లు తీసేయడానికి సిద్దమవుతున్న పోలీసులు.
అమరావతి, నేడు కేంద్ర ఎన్నికల సంఘ ప్రతినిధులను కలవనున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్. ఎన్నికలలో వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులను వాడకూడదని ఫిర్యాదు. ఇప్పటికే టీడీపీ, జనసేన సానుభూతిపరుల ఓట్ల తొలగింపు పై ఫిర్యాదు చేసిన ప్రతిపక్షాలు. ఫిర్యాదులు పరిష్కరించినట్టుగా టీడీపీకి లేఖ రాసిన ఈసి. మరి కొన్ని ఫిర్యాదులు పరిష్కరణ దశలో ఉన్నాయని వెల్లడి. ఉమ్మడిగా ఫిర్యాదు చేయనున్న పవన్, చంద్రబాబు. వాలంటీర్లు అసలు ఉద్యోగులే కాదని చెబుతున్న వైసీపీ. సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులని వెల్లడి. ఎన్నికలలో ప్రభుత్వ ఉద్యోగులను వాడకూడదని ఎలా చెబుతారని అంటున్న వైసీపీ. ఉదయం చంద్రబాబు పవన్ భేటీ తర్వాత ఈసీ ని కలిసే అవకాశం. ఈసీకి ఫిర్యాదు చేయాల్సిన అంశాలపై ముందుగా చర్చించునున్న ఇరువురు నేతలు. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు ఈసీ తో సమావేశం.
ఢిల్లీ నుండి ఎయిర్ ఇండియా విమానంలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంకు చేరుకున్న ఎలక్షన్ కమిషనర్లు. గన్నవరం విమానాశ్రయంలో ఎలక్షన్ కమిషనర్లకు స్వాగతం పలికిన ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు, జేసీలు మరియు ఉన్నతాధికారులు. అనంతరం గన్నవరం విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన విజయవాడ నోవాటాలకు బయలుదేరి వెళ్లిన ఎలక్షన్ కమిషనర్లు.
ఐ పోలవరం మండలం మురమళ్ళ స్థానిక శ్రీ సాయి స్కూల్లో సంక్రాంతి సంబరాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. స్కూల్ చైర్మన్ వాసురాజు దంపతులు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కనుమరుగైపోతున్న సంక్రాంతి సాంప్రదాయాలు ఈతరం విద్యార్థిని విద్యార్థులకు కళ్ళకి కట్టినట్టుగా నిర్వహించారు. స్కూల్ ఆవరణలో భోగి మంటలు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దు ఆటల విన్యాసాలు, తెలుగింటి వస్త్రధారణలు, రంగురంగుల రంగవల్లులు, కోడిపందాల కార్యక్రమాలు నిర్వహించారు. భోగిమంటల చుట్టు పాటలు పాడుతూ డాన్సులు వేస్తూ ఆనందోత్సాహాలతో సంబరాలు జరిగాయి.






Total views : 90566