డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట నియోజకవర్గం అంగన్వాడీ కార్యకర్తలు విజయవాడలో సోమవారం చేపట్టబోయే కోటి సంతకాలతో జగనన్నకు చెబుదాం కార్యక్రమం నేపథ్యంలో పోలీసుల ముందస్తు అరెస్టులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో ఏడుగురు అంగన్వాడీ సంఘ నేతలను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించిన పోలీసులు. విజయవాడ బయలుదేరిన తమను బస్సు నుంచి దించివేసి రాత్రి వేళ స్టేషన్ కు తరలించారని చెబుతున్న అంగన్వాడీ కార్యకర్తలు.
cvr live
డా.బి.ఆర్.అంభేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం అయోధ్య శ్రీ రామయ్య విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా ముమ్మిడివరం బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో గ్రామోత్సవం. వేకువజామునే బాజా భజంత్రీలు, భజనలతో ఉమా సూరేశ్వర స్వామి ఆలయం వద్ద నుండి శ్రీ సీతారామ స్వామివారిని పల్లకీ సేవగా ప్రారంభమై ముమ్మిడివరం లో పలు రామాలయాల మీదుగా రామనామా సంకీర్తనలతో ముమ్మిడివరంలో సాగిన గ్రామోత్సవం. పాల్గొన్న భక్తులు..
తిరుపతి, రేణిగుంట అంగన్వాడీల అరెస్టుకు సిఐటియు ఖండన. కోటి సంతకాలతో జగనన్నకు చెబుదాం అనే పేరిట శాంతియుతంగా విజయవాడకు వెళుతున్న అంగన్వాడీలను రేణిగుంటలో అరెస్టు చేయడాన్ని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి తీవ్రంగా ఖండించారు. అరెస్టు చేయబడ్డ మహిళలను తక్షణం విడిచి పెట్టాలని వారి ప్రజాస్వామ్యతమైన నిరసన కార్యక్రమానికి ఆటంకం కల్పించవద్దని పోలీసులకు ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమస్యల పరిష్కారం చేతగాక మహిళలపై నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు.
వైద్య సేవల్లో ప్రభుత్వం నిర్లక్ష్యం. డేగల ప్రభాకర్… ప్రతి ఒక్కరు తమ ఆరోగ్యంపై శ్రద్ద వహించాలని తెలుగుదేశం పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్ అన్నారు. నగరం లో ప్రతి ఆదివారం నిర్వహించే ఉచిత మెడికల్ క్యాంప్ లో భాగంగా ఈ రోజు తూర్పు నియోజకవర్గంలోని శారదకాలని 32 వ లైన్ లో నిర్వహించారు. ఈ క్యాంప్ లో 4 డాక్టర్ల బృందం ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులను పంపిణి చేశారు. ఈ వైద్య శిభిరం లో సుమారు 280 మంది ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ నిజానికి టెక్నాలజీ రోజుల్లో అన్ని సమస్యలకు మందులు ఉన్నప్పటికీ పెద్దపెద్ద రోగాలకు ముందుగా మనం భయపడే తీరు మన రోగాన్ని పెంచుతుందన్నారు. ఇందులో నిరుపేదలు, మధ్యతరగతి కుటుంబాలు అయితే మరింత దయనీయంగా ప్రతినిత్యం బాధపడుతూన్నారన్నారు. అలంటి వారి కోసం ఉచిత మెగా మెడికల్ క్యాంప్ లు నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటికి నగరంలో 6 మెడికల్ క్యాంప్ లు నిర్వహించామన్నారు. ఓపిక లేక, ఆసుపత్రికి వెళ్ళి చూపించుకోలేని వృద్ధుల కోసం, ఆర్థిక సంపాదన లేని సామాన్య ప్రజల కోసం, వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నామన్నారు. పేద ప్రజలకు మంచి వైద్యం అందించాలన్నది తమ ఆశయం అన్నారు. ముఖ్యంగా పేద ప్రజలు పెద్దఎత్తున తరలి వచ్చి మెడికల్ క్యాంపు సేవలు సద్వినియోగం చేసుకోవడం చాలా సంతోషముగా ఉందన్నారు. పేద ప్రజలకు అవసరసమైన వైద్య సేవలు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందనీ ఆరోపించారు. కేవలం వైద్య పరీక్షలు చేయడం మాత్రమే కాకుండా, వారికి అవసరమైన మందులు కూడా పంపిణీ చేస్తున్నాం అన్నారు. ఈ మెగా మెడికల్ క్యాంపుకు ప్రజల నుండి అనూహ్య స్పందన లభించిందని, పెద్ద సంఖ్యలో రోగులు నిష్ణాతులైన వైద్యుల వద్ద వైద్య చికిత్సలు అందించుకున్నారు. వైసీపీ కేవలం మాటల ప్రభుత్వమని మండిపడ్డారు. ఏ ఒక్క ప్రభుత్వం వైద్యశాలలో కనీస సౌకర్యాలు లేవని, డాక్టర్లు కూడా అందుబాటులో లేరన్నారు. ప్రజలు ఆరోగ్యం పట్ల జగన్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. ఈ కార్యాక్రమమం లో డాక్టర్ అన్వేష్, డాక్టర్ రాజా, డాక్టర్ గోపి, డాక్టర్ పవన్, చిట్టెం సింధు, మహంకాళి నరసింహారావు, యర్రమల కిరణ్, సౌపాటి రత్నం, మల్లెంపూడి శ్రీను, కొత్తూరి వెంకట్, లింగంగుంట్ల ఆదాం, రాయవరపు బాబురావు, బాజీ మాస్టర్, నిశంకరరావూ అమర్నాధ్, కొండెపు శేఖర్, బండ్లమూడి రాధమ్మ, చౌదరి శ్రీను, కొలగాని సుబ్బారావు, బొక్కిసమ్ శివరామ్, అడపా ప్రసాద్ బాబు, బీరం శ్రీనివాసరావు, షేక్ సుభాని, జనసేన నాయకులూ శ్యాం, కిషోర్, దళవాయి భార్గవ్, వెంకటేశ్వర్లు, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా, మైలవరం నియోజకవర్గం, ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి మున్సిపాలిటీ పరిదిలోని బ్యాంక్ సెంటర్లో టీడీపీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు జయహో బీ.సీ కార్యక్రమానికి ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి లాంఛనంగా ప్రారంభించిన మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. బీ.సీ కుల ద్రోహి జగన్మోహన్ రెడ్డి నీకు రాబోయే ఎన్నికల్లో బీ.సీ లే బుద్ధి చెబుతారన్న కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థి చెన్నుబోయిన చిట్టి బాబు. బీ.సీ లలో దాదాపుగా 143 ఉపకులాలు ఉన్నాయి. కాని బీ.సీ ల నిదులు ఏమైనాయి, బీ.సీ ల అనేక పదకాలు ఎతైసిన జగన్ రెడ్డి. బీ.సీ లను కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మాత్రమే ఉపయోగించే జగన్మోహన్ రెడ్డి బీ.సీ కులాలను పట్టించుకోకుండ వదిలేసిన బీ.సీ కుల ద్రోహి జగన్ రెడ్డి.
పల్నాడు జిల్లా, రొంపిచర్ల మండలం పరగటిచర్లకి చెందిన గుడిపూడి విగ్నేష్ 22. ఫోన్ యాప్ లో ఇటీవల లోన్ తీసుకున్న విగ్నేష్.. యాప్ వారు ఫోన్లో పెడుతున్న వేధింపులు భరించలేక ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విగ్నేష్.. ఫోన్ లో లోన్ యాప్ లో అప్పు తీసుకోవటం తో తిరిగి చెల్లించలేక నిండు ప్రాణాలు బాలి చేసుకున్న విగ్నేష్.
కృష్ణా జిల్లా, పెనమలూరు నియోజకవర్గం, ఉయ్యూరు మండలంలో ని అన్ని గ్రామాల్లో మంత్రి జోగి రమేష్ విస్తృతంగా పర్యటించారు. గ్రామాల్లో వైఎస్సార్సీపీ పార్టీ నాయకులను, కార్యకర్తలను, శ్రేణులను కలిసి 2024 ఎన్నికల్లో పార్టీని గెలిపించే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలి అని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ 2024 లో గెలిచేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు అని ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలి అని ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో 175 స్థానాలు వైసీపీ కైవసం చేసుకుంటుంది అని అన్నారు. జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కునే దమ్ము ప్రతిపక్షాలకు లేదు అని, ఎన్ని పార్టీలు గుంపులుగా వచ్చిన భయపడే ప్రసక్తి లేదని ప్రజల గుండెల్లో మేము స్థానం సంపాదించుకున్నామని తెలిపారు. పెనమలూరు నియోజకవర్గం లో 2019 ఎన్నికల్లో కన్నా ఎక్కువ మెజారిటీతో గెలిచి పెనమలూరు గడ్డపై వైఎస్సార్సీపీ జెండా ఎగరవేస్తామని మంత్రి జోగి రమేష్ తెలిపారు.
విజయవాడ, బుద్ధ వెంకన్న, ఉత్తరాంధ్ర టిడిపి ఇంఛార్జ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కేశినేని నాని వైసీపీ కోర్టు కు బర్త్ డే గిఫ్ట్ ఇస్తున్నా, బ్లాక్ మెయిలింగ్ కు మారు పేరుగా కేశినేని నాని, 2 వేల కోట్లకు ఎన్ని సున్నాలున్నాయో కేశినేని నాని చెప్పగలడా ? కేశినేని నాని అప్పులు ఎన్నున్నాయో చెప్పగలడా ? కే అంటే కేశినేని కాదు… కోవర్టు. మొన్నటి వరకూ చంద్రబాబు అనుచరుడు కేశినేని నాని. ఇవాళ దేవినేని అవినాష్ అనుచరుడుగా మారాడు. దొంగ రశీదు బుక్కులు తయారు చేయించి ఫైనాన్స్ కంపెనీకి కోట్ల రూపాయలు ఎగనామం పెట్టిన కోవర్టు నాని. వంద రూపాయల బస్సు టికెట్టు 500 కు అమ్మాడు కోవర్టు నాని. ఒకే నంబరు ప్లేటు మీద బస్సులు తిప్పిన కోవర్టు నాని. భూకబ్జాలకు విజయవాడ నగరంలో పేటెంట్ రైట్ ఉన్న వ్యక్తి కోవర్టు నాని
చంద్రబాబు కేశినేని నానిని మెడబట్టి గెంటాడు అనేది నిజం. బాలయోగి ఆస్తులు కాజేసింది కేశినేని నాని అని చిన్న పిల్లాడిని అడిగినా చెపుతాడు. దళిత వ్యక్తి ఆస్తులు కాజేసి ఏ మోహం పెట్టుకుని అంబేద్కర్ విగ్రహావిష్కరణకు వెళ్ళావు నాని. బాలయొగి ఆస్తులు ఇచ్చేసి అంబేద్కర్ విగ్రహం కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగు.. కేశినేని నాని ఊహల్లో బ్రతికే వ్యక్తి కనుకనే చంద్రబాబు స్ధాయి అని చెప్పుకుంటాడు. లోకేష్ గెడ్డంలో నెరిసిన వెంట్రుక స్ధాయి కాదు కేశినేని నానిది. కేశినేని నాని వెనుక నందిగామలో పదిమంది లేరు. కేశినేని నాని టిడిపి వీడితే పది మంది లేరు అతని వెనుక ఎన్నికల తరువాత వైసీపీ కేశినేని నాని సహా ఖాళీ అయిపొతుంది. ఉల్లిపాయ బాంబులు పేలితే పారిపోయే వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. కాల్ మనీ అంటావు.. అంటే ఏంటో చెప్పు.. చర్చిద్దాం.. నీ బ్రతుకే అప్పులు ఎగ్గొట్టే బ్రతుకు. చంద్రబాబు ఈ జిల్లాలో చేసిన పోరపాటు ఈ కోవర్టును ఎంపీ చేయడం. చంద్రబాబు అమాయకత్వం, మంచితనంతో వదిలేసాడు.. జగన్ అయితే నాని ని కొట్టి పంపిస్తాడు. దాదాపు 9 కోట్ల రూపాయల చందాలు 2019లో వసూలు చేసాడు కేశినేని నాని. ఎన్ని రకాల అవలక్షణాలు ఉంటే.. అన్నీ ఉన్న వ్యక్తి కేశినేని నాని. కేశినేని నాని కొవ్వు కరిగిస్తాం. లోకేష్, చంద్రబాబు లను మర్యాదపూర్వకంగా కలిసాను. వెస్ట్ ఇంఛార్జ్ నేనేమీ అడగలేదు. కోఆర్డినేటర్ కూడా బ్లాక్ మెయిల్ చేసి తెచ్చుకున్నాడు కేశినేని నాని. చంద్రబాబు కుటుంబానికి విధేయుడుగా ఉంటాను. చంద్రబాబు కుటుంబానికి మా కుటుంబం అంకితం. బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకి తెరపడింది. అన్న వదిలిన బాణం షర్మిల… ఇప్పుడు రివర్స్ అయింది…
ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ ఏపీ కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం నింపుతున్న వైయస్ షర్మిల చేరిక. రాష్ట్ర కాంగ్రెస్ లో దశాబ్దం తర్వాత కనబడుతున్న నూతన ఉత్సాహం. కానూరు వద్ద ఏపీ పీసీసీ అధ్యక్షరాలిగా చేపట్టనున్న బాధ్యతలు, ఘన స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ శ్రేణుల భారీ ఏర్పాట్లు. గన్నవరం నుండి విజయవాడ వరకు ఎటు చూసినా షర్మిల ఫ్లెక్సీలు. షర్మిల రాక రెండు గంటలు ఆలస్యం అయిన కానూరు సభాస్థలి వద్ద కార్యకర్తల్లో తగ్గని ఉత్సాహం.
కృష్ణాజిల్లా, గన్నవరం, కడప నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న వైఎస్ షర్మిల. షర్మిల వెంట వచ్చిన ఏపీ ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్య ఠాకూర్, కేవీపీ రామచంద్రరావు, రఘువీరా రెడ్డి, తులసిరెడ్డి. స్వాగతం పలికిన మాజీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి, మాజీ కేంద్రమంత్రి జేడీ శీలం, పలువురు నేతలు. గన్నవరం నుండి విజయవాడ బయల్దేరిన షర్మిల. ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా నియమితులయ్యాక తొలిసారి విజయవాడ వచ్చిన షర్మిల.






Total views : 90764