అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం GVK ప్రైవేట్ school లో 1st క్లాస్ చదువుతున్న విద్యార్థులు ఆకతాయిగా డ్రైన్ క్లీనర్ పౌడర్ తీసుకొచ్చి తినడంతో ఐదుగురు విద్యార్థులు అస్వస్థత గురయ్యారు. వెంటనే స్కూల్ సిబ్బంది దగ్గరలో ఉన్న రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తీసుకు వచ్చి చికిత్స చేయించగా ఇద్దరు పిల్లలకు అస్వస్థత ఎక్కువ ఉండడంతో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. వీరి తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యం మీద తీవ్ర ఆగ్రహం చూపిస్తున్నారు.
cvr om
టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో కొందరు అనుమతులు తీస్కుని మరికొందరు అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు జరిపి వందల కోట్లు సంపాదిస్తే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనుమతి అనేదే లేకుండా అందరికీ ఇళ్ల స్థలాలను మట్టి ఫిల్లింగ్ పేరుతో వేల కోట్ల రూపాయలను వైసీపీ నేతలు తమ జేబుల్లో వేసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ మట్టి తవ్వకాలను అడ్డుకోవాల్సిన మైన్స్, రెవెన్యూ శాఖల అధికారులు నామ మాత్రపు దాడులు చేసి చేతులు దులుపుకుంటున్నారు.
కాకినాడ జిల్లాకు చెందిన వైసీపీ కీలక నేత ఈ మట్టి తవ్వకాల వెనుక ఉండటంతో అధికారులేవ్వరు అక్రమ మట్టి తవ్వకాలవైపు కన్నెత్తి చూసే ప్రయత్నం చేయడం లేదంటే అధికారులపై ఎలాంటి వొత్తిడి ఉందో అర్థం చేసుకోవచ్చు. టీడీపీ హయాంలో మాజీమంత్రి చినరాజప్ప అనుచరులతో పాటు ఇతర పార్టీలకు చెందిన నేతలు మట్టి తవ్వకాలు చేస్తే…వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. కేవలం చంద్రశేఖర్ రెడ్డి అనుచరులు మాత్రమే తవ్వకాలు చెయ్యాలని అధికారులకు హుక్కుం జారీ చేయడంతో ఇతరులు ఎవ్వరు రామేశం మెట్టలో మట్టి తవ్వకాలు జరిపినా అధికారులతో దాడులు జరిపించి భారీ మొత్తంలో జరిమానా విధించడంతో ద్వారంపూడి అనుచరులు కానీ వారు ఎవ్వరూ రామేశంమెట్టలో అడుగు పెట్టలేని పరిస్థితి ఏర్పడింది. జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న మెట్టలొ మట్టి తవ్వకాలు చేసేందుకు ద్వారంపూడి అనుచరులు ప్రయత్నించగా ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు అడ్డుకున్నారు. నా పరిధిలో మట్టి తవ్వకాలు నా ఇష్టం ఇక్కడ తవ్వకాలు జరిపితే మర్యాదగా ఉండదని తెగేసి చెప్పడంతో ద్వారంపూడి చంటిబాబుపై కక్ష పెంచుకున్నారు. ఇందులో భాగంగానే జగ్గంపేటలో చంటిబాబును పక్కన పెట్టి నరసింహం కు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ పదవి కట్టబెట్టారని ప్రచారం జరుగుతోంది.
అయితే ఇటీవల రామేశంమెట్టలో మట్టి తవ్వకాలను పెద్దాపురంకు చెందిన కొందరు అడ్డుకున్నారు. మైనింగ్,రెవెన్యూ అధికారులతో దాడులు చేయించి 13 టిప్పర్లు, 2ఎక్స్కవేటర్లు సీజ్ చేయించారు. విషయం తెలుసుకున్న ద్వారంపూడి సీజ్ చేశారు కదా ఫైన్ కట్టించుకుని వదిలేయండి అంటూ రుసరుసలాడుతూ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఎక్కడ సీజ్ చేసిన వాహనాలకు అక్కడే ఫైన్ వేసి వదిలేశారు. నాలుగున్నర ఏళ్లలో ఎప్పుడు లేనిది పెద్దాపురం వైసీపీ నేతలు మట్టి తవ్వకాలు అడ్డుకోవడంతో ఖంగు తిన్న ద్వారంపూడి ఎలాగైనా మట్టి తవ్వకాలు తానే చెయ్యాలని కంకణం కట్టుకున్నట్టు తెలుస్తోంది. ఈసారి అనుమతులు తీస్కుని తవ్వకాలు చేస్తే ఎలా అడ్డుకుంటారో చూస్తానని తన అనుచరుల వద్ద ద్వారంపూడి అనట్లు ప్రచారం జరుగుతోంది.
అయితే మట్టి తవ్వకాలు అడ్డుకోవాల్సిన విపక్ష నేతలు మాత్రం రామేశం మెట్టకు వెళ్లకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసే అంశం…
కృత్రిమ మేధస్సు (AI) టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ, AI ప్రాంప్ట్ జనరేటర్లు మరింత శక్తివంతంగా మరియు సున్నితంగా మారుతున్నాయి. ఈ సాధనాలు వినియోగదారులు టెక్స్ట్, చిత్రాలు, వీడియోలు మరియు ఆడియో వంటి విభిన్న రకాల కంటెంట్‌ను సృష్టించడానికి AI మోడల్లను ఉపయోగించడానికి సహాయపడతాయి.
2024లో అత్యుత్తమ AI ప్రాంప్ట్ జనరేటర్లలో కొన్ని:
- Bard: Google AI నుండి వచ్చిన ఈ జనరేటర్ టెక్స్ట్‌ను ఉత్పత్తి చేయడానికి, భాషలను అనువదించడానికి, విభిన్న రకాల సృజనాత్మక కంటెంట్‌ను వ్రాయడానికి మరియు మీ ప్రశ్నలకు సమాచారంగా సమాధానం ఇవ్వడానికి శిక్షణ పొందిన భారీ భాషా నమూనా (LLM) ను ఉపయోగిస్తుంది.
- ChatGPT: OpenAI నుండి వచ్చిన ఈ జనరేటర్ టెక్స్ట్ మరియు కోడ్ యొక్క భారీ డేటాసెట్‌పై శిక్షణ పొందిన LLM. ఇది టెక్స్ట్‌ను ఉత్పత్తి చేయడానికి, భాషలను అనువదించడానికి, విభిన్న రకాల సృజనాత్మక కంటెంట్‌ను వ్రాయడానికి మరియు మీ ప్రశ్నలకు సమాచారంగా సమాధానం ఇవ్వడానికి ఉపయోగించవచ్చు.
- DALL-E 2: OpenAI నుండి వచ్చిన ఈ జనరేటర్ టెక్స్ట్ వివరణల నుండి చిత్రాలను సృష్టించడానికి శిక్షణ పొందిన AI మోడల్. ఇది చాలా వాస్తవిక మరియు సృజనాత్మక చిత్రాలను రూపొందించగలదు.
- Midjourney: Midjourney టెక్స్ట్ వివరణల నుండి చిత్రాలను సృష్టించడానికి శిక్షణ పొందిన మరొక AI మోడల్. ఇది DALL-E 2 కి ప్రత్యర్థిగా పరిగణించబడుతుంది మరియు చాలా వాస్తవిక మరియు కళాత్మక చిత్రాలను రూపొందించగలదు.
- Nightcafe Creator: Nightcafe Creator టెక్స్ట్ వివరణల నుండి చిత్రాలను సృష్టించడానికి శిక్షణ పొందిన మరొక AI మోడల్. ఇది వినియోగదారులకు చిత్రాలను రూపొందించడానికి మరింత నియంత్రణను అందిస్తుంది మరియు విభిన్న శైలులలో చిత్రాలను సృష్టించడానికి ఉపయోగించవచ్చు.
AI ప్రాంప్ట్ జనరేటర్‌ను ఎంచుకునేటప్పుడు, మీ అవసరాలను పరిగణనలోకి తీసుకోవడం ముఖ్యం. మీరు టెక్స్ట్‌ను ఉత్పత్తి చేయాలనుకుంటే, Bard లేదా ChatGPT ను , మీరు చిత్రాలను సృష్టించాలనుకుంటే, DALL-E 2, Midjourney లేదా Nightcafe Creator ను ఉపయోగించవచ్చు.
కోపం ఒక సహజమైన భావోద్వేగం. అయితే, అధికంగా కోపం రావడం వల్ల మన ఆరోగ్యం, సంబంధాలు, పనితీరు ప్రభావితం అవుతాయి. అందుకే కోపాన్ని సరిగ్గా నియంత్రించుకోవడం చాలా ముఖ్యం.
కోపాన్ని కంట్రోల్ చేయడానికి కొన్ని చిట్కాలు:
మీకు కోపం వస్తున్నప్పుడు దాని గుర్తులు ఏమిటో తెలుసుకోండి. మీ శరీరం ఎలా స్పందిస్తుందో గమనించండి. కోపంగా ఉన్నప్పుడు వెంటనే ఏమీ మాట్లాడవద్దు లేదా చేయవద్దు. కొంత సమయం తీసుకొని శాంతించండి. లోతైన శ్వాస తీసుకోవడం వల్ల మీ హృదయ స్పందన రేటు తగ్గుతుంది మరియు మీ మనస్సు శాంతించడానికి సహాయపడుతుంది. మీ కోపానికి కారణమైన పరిస్థితి గురించి మరింత సానుకూలంగా ఆలోచించడానికి ప్రయత్నించండి. మీ కోపాన్ని సరైన రీతిలో వ్యక్తీకరించడం చాలా ముఖ్యం. యోగా, ధ్యానం, వ్యాయామం వంటి విశ్రాంతి పద్ధతులను అభ్యసించడం వల్ల మీ కోపాన్ని నియంత్రించడానికి సహాయపడుతుంది. మీ కోపాన్ని మీరే నియంత్రించుకోలేకపోతే వృత్తిపరమైన సహాయం తీసుకోండి. వాకింగ్ వల్ల శారీరక ఆరోగ్యానికే కాదు, మానసిక ఆరోగ్యానీ మంచిదే. మీకు యాంగర్ ఇష్యూస్ ఉంటే.. వాకింగ్ మంచి ట్రీట్మెంట్లా హెల్ప్ అవుతుంది.
వాకింగ్ మీ కండరాలను రిలాక్స్ చేస్తుంది, మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచుతుంది. యాంగర్ కంట్రోల్ గురించి ఆలోచించడానికి వాకింగ్ మీకు కొంత ప్రశాంతమైన సమయాన్ని ఇస్తుంది.
మ్యూజిక్ వింటే మనసు ప్రశాంతంగా ఉంటుందని మన అందరికీ తెలుసు. NIH అధ్యయనం కూడా ఇది స్పష్టం చేసింది. మెలోడీలు, సీథింగ్ పాటలు మనసు ప్రశాంతతను, విశ్రాంతిని ఇస్తాయి. మీకు కోపంగా, మనసు ఆందోళనగా ఉన్నప్పుడు, ప్రెజెంట్ మూజిక్ వినండి.
ఎన్టీఆర్ జిల్లా, రేపటి దెందులూరు సీఎం సభకు ఉమ్మడి కృష్ణా జిల్లా నేతల ఏర్పాట్లు. సీఎం సభకు దూరంగా మైలవరం ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తీరుపై పార్టీ నేతల్లో గందరగోళం. మైలవరం కేడర్ ను సీఎం సభకు తీసుకెళ్లే ఏర్పాట్లు చేస్తున్న ఎంపీ కేశినేని నాని, నియోజకవర్గం పరిశీలకుడు పడమట సురేష్ బాబు. ఈ నెల 4 లేదా 5 న ప్రెస్ మీట్ పెట్టి తన మనోభావాలు చెబుతానని ప్రకటించిన వసంత కృష్ణ ప్రసాద్. ఎమ్మెల్యే పార్టీ మారుతున్నారని ఇప్పటికే జోరుగా ప్రచారం.
బిర్యానీ అంటేనే ఫుల్ ఫ్లేవర్! ఆ రుచిలో సగభాగం బిర్యానీ ఆకు నుంచే వస్తుంది. చాలా మంది ఈ ఆకుని వాడి పడేస్తారు. కానీ ఆకుని కాల్చిన పొగ ద్వారా కలిగే లాభాలు చాలానే ఉన్నాయి అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
బిర్యానీ ఆకు కాల్చిన పొగ ద్వారా కలిగే లాభాల గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. కొంతమంది దాని ఆరోగ్య ప్రయోజనాల గురించి చెబుతారు, మరికొందరు దాని హానికరమైన ప్రభావాల గురించి హెచ్చరిస్తారు.
బిర్యానీ ఆకు పొగ శ్వాసకోశ సమస్యలకు ఉపశమనం కలిగిస్తుందని నమ్ముతారు. దగ్గు, జలుబు, ఆస్తమా వంటి సమస్యలకు ఇది మంచిది. బిర్యానీ ఆకు పొగ కీళ్ల నొప్పులకు ఉపశమనం కలిగిస్తుందని కూడా నమ్ముతారు. ఇది వాపును తగ్గిస్తుంది మరియు నొప్పిని తగ్గిస్తుంది. బిర్యానీ ఆకు పొగ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుందని నమ్ముతారు. ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది మరియు శాంతిని కలిగిస్తుంది. బిర్యానీ ఆకు పొగ నిద్రలేమికి చికిత్స చేయడంలో సహాయపడుతుందని నమ్ముతారు. ఇది నిద్రపోయే సమయాన్ని తగ్గిస్తుంది మరియు నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది.
విజయనగరం జిల్లా, ఎస్.కోట లో వైసీపీలో ముసలం.. ఈ ఎమ్మెల్యే మాకొద్దు..అంటూ అసమ్మతి నేతల నిరసన.. శృంగవరపుకోట నియోజకవర్గం ఎల్.కోట మండలంలో శ్రావణి ఫంక్షన్ హాల్ లో ఎమ్మెల్యే అసమ్మతి వర్గం సమావేశం. శృంగవరపుకోట నియోజకవర్గం లో ఐదు మండలాల లో ఉన్న ఎంపీటీసీలు,జడ్పీటీసీలు,సర్పంచ్ లు స్థానిక ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావును మార్చాలని స్థానిక నాయకులకు టిక్కెటు కేటాయించాలని కోరారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో స్థానికులకు టికెట్ కేటాయించకుండా మళ్ళీ కడుబండి శ్రీనివాసరావుకి టికెట్ ఇస్తే ఓడిపోవడం ఖాయమని అందుకని స్థానికులకి అవకాశం ఇవ్వాలని అందరూ నాయకులు ముక్తకంఠంతో కోరారు. మా మాట వినకుండా టికెట్ ఇస్తే ముకుమ్ముడు అందరం పార్టీకి రాజీనామాలకు సిద్ధమని తెలిపారు. ఎల్ కోట సీనియర్ నాయకులు సూర్యారావు మాట్లాడుతూ.. మాకు స్థానికుడు తప్ప ఈ ఎన్.ఆర్.ఐ లు మనకి వద్దు కచ్చితంగా అభ్యర్థిని మార్చకపోతే అందరం ముకుమ్ముడి రాజీనామాకైనా సిద్ధం అని ముఖ్తకంఠంతో తెలిపారు.
NTR జిల్లా, జగ్గయ్యపేట పెనుగంచిప్రోలు రంగుల మహోత్సవంలో అధికారులు వైఫల్యం. అర్థరాత్రి 12గంటలు దాటిన గ్రామ మండపానికి చేరుకొని ఎంపిక చేసిన ఎద్దుల బండ్లు, ఆలస్యంగా మండపానికి చేరుకున్న రెండు బండ్లు. అమ్మవారిని జగ్గయ్యపేట సాగనంపేందుకు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న మహిళలు, భక్తులు. తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్న అధికారులు. సమయపాలన పాటించకపోవడంతో అధికారులు తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న మహిళ భక్తులు.
కృష్ణాజిల్లా, పామర్రు నియోజకవర్గం విజయవాడ మచిలీపట్నం జాతీయ రహదారిపై కురుమద్దాలి వద్ద దగ్ధమవుతున్న కారు, కారులో ఉన్న వ్యక్తులు దిగి పారిపోయినట్లు సమాచారం. భీమవరం నుంచి హైదరాబాద్ వెళుతున్న ముగ్గురు యువకులు. ఇంజన్లో నుంచి మంటలు రావడంతో కారు దిగి పారిపోయిన యువకులు, టాటా హేరియర్ డీజిల్ కారు పూర్తిగా దగ్ధం అయినట్టు సమాచారం.
ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం తనికెళ్ళ గ్రామ సమీపంలో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని ఆ వ్యక్తి వద్ద నుండి రెండు లక్షల రూపాయలు విలువ చేసే ఎనిమిది కేజీల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిషా నుండి హైదరాబాద్ గంజాయిని తీసుకు వెళ్తు తనికెళ్ల సమీపంలో దిగి వేరొక వాహనం కోసం ఎదురుచూస్తుండగా ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు పట్టుబడిన వ్యక్తి మల్కన్‌గిరి, ఒడిశా రాష్ట్రానికి చెందిన వ్యక్తి గా గుర్తించారు. గంజాయి తో పట్టుబడిన వ్యక్తిని అరెస్టు చేసి ఖమ్మం కోర్టుకు తరలించారు దాడులలో ఎక్సైజ్ అధికారులు రమ్య, కిరీటి, మమత సిబ్బంది ఫాల్గొన్నారు.




Total views : 90933